Updated: 18:44:21 12/11/2022
Indhulekha Hair Oil Review: ఇందులేఖ హెయిర్ ఆయిల్.. ఈ ఆయిల్ గురించి అంతా వినే వింటారు.. ఇది ఆయుర్వేదిక్ ఆయిల్.. ఈ నూనెలో అన్ని జుట్టు పెరుగుదలకు జుట్టు సంబంధిత సమస్యలను తొలగించే మూలికలను ఉపయోగించారు పైగా ఈ ఆయిల్ వాడటానికి జుట్టు లోపలికి వెళ్లే విధంగా ఓ దువ్వెన లాంటిది కూడా అందించారు. దాంతో తలలో రక్త ప్రసరణ జరిగి జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.. ఇంతకీ ఈ ఆయిల్లో ఉపయోగించిన మూలికలు ఏంటి.!? వాడిన వారు ఏమంటున్నారు.! ఈ ఆయిల్ వాడటం వలన ప్రయోజనం ఉందా.!? లేదా అనేది తెలుసుకుందాం..

ఇందులేఖ హెయిర్ ఆయిల్ లో ఉపయోగించిన పదార్థాలు..
ఇందులేఖ హెయిర్ ఆయిల్ లో బృంగరాజ్, ఉసిరి, వటదా, శ్వేతకుటిజ అనే నాలుగు హెర్బ్ ను ఉపయోగించారు. బృంగరాజ్ లో యాంటీ ఆక్సిడెంట్, మినరల్స్ సమృద్ధిగా లభిస్తాయి. ఇవి జుట్టు పెరగడానికి కీలక పాత్ర పోషిస్తుంది. బృంగరాజ ఉపయోగించిన ఏ నూనెనైనా కూడా జుట్టుకి ఉపయోగించడం మంచిది. జుట్టు పెరగడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది. ఇది తలలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలాగా సహాయపడుతుంది. వటదా లో జుట్టుకి కావలసిన ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. శ్వేతకుటీజలో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. చుండ్రు తో పాటు తలలో వచ్చే వివిధ రకాల సమస్యలను తొలగించడానికి సహాయపడతాయి..
ఎందుకు వాడచ్చు.!?
ఇందులేఖ హెయిర్ ఆయిల్ ను ఎందుకు వాడొచ్చు అంటే.. ఇందులో సల్ఫేట్, సిందటిక్, సిలికాన్, ఆర్టిఫిషియల్ పెర్ఫయూమ్స్, పారాబెన్స్ వంటివి ఏమీ ఉపయోగించలేదు. అందువలన ఈ ఆయిల్ ను నిరభ్యంతరంగా వాడొచ్చు. కాకపోతే ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ కాబట్టి కాస్త ఘాటైన స్మెల్ ఉంటుంది. అయినా కూడా జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. కొత్తగా జుట్టు రావడానికి సహాయపడుతుంది. అయితే బట్టతల ఉన్నవారికి కొత్తగా జుట్టు మాత్రం రాదని గుర్తుంచుకోవాలి.
ఎలా వాడాలి.!?
ఈ హెయిర్ ఆయిల్ ను వారానికి మూడుసార్లు వాడాలి. కచ్చితంగా నాలుగు నుంచి ఐదు నెలలు వాడితే చక్కటి ఫలితాలు వస్తాయి. కాస్త జుట్టు కూడా వస్తుంది. విపరీతంగా హెయిర్ ఫాల్ వున్నవారు వారానికి నాలుగు సార్లు ఈ హెయిర్ ఆయిల్ వాడాలి. జుట్టు రాలడాన్ని నివారించి కొత్తగా జుట్టు పెరగడానికి సహాయపడుతుంది అలానే బాగా ఒత్తుగా పొడవుగా మాత్రం పెరగదని గుర్తుంచుకోండి.
చివరగా.. ఇందులేఖ హెయిర్ ఆయిల్ ను వాడొచ్చు. జట్టు పెరగడానికి సహాయపడుతుంది. బట్టతల మీద జుట్టు కొత్తగా రాదని గమనించాలి.