32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
న్యూస్ హెల్త్

Laser Hair Removal: లేజర్ హెయిర్ రిమూవల్ మంచిదేనా? దీనికి ఎంత ఖర్చు అవుతుంది? దీని వలన జరిగే మంచి చెడు ఏంటి?

Laser Hair Removal Review Laser Hair Removal Is Good or Bad for you
Share

Laser Hair Removal: అవాంఛిత రోమాలు తొలగించుకోవడానికి చాలా మంది వ్యాక్సింగ్, షేవింగ్, ప్లకింగ్,. హెయిర్ రిమూవర్ క్రీమ్స్ వాడతారు. వీటివల్ల తాత్కాలిక ప్రయోజనాలే తప్ప.. శాశ్వత పరిష్కారం లభించదు.. దీనికి కొంతమంది లేజర్ ట్రీట్ మెంట్ చేయించుకుంటారు. దీనివల్ల ఎంచక్కా ఇక ఈ అవాంఛిత రోమాల సమస్య ఉండదు. డబ్బులు ఖర్చైనా పర్మినెంట్ రిజల్ట్ ఉంటుందని కొందరు అనుకుంటారు. అయితే మరికొంత మంది లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోవాలంటే చాలా అనుమానాలు అసలు ఇది మంచిదేనా కాదా.. అంత డబ్బు పెట్టి చేయిస్తే మనకు మళ్లీ రోమాలు వస్తాయా.!? ఇలాంటి మీ సందేహాలనింటికి సమాధానం ఇదిగో..

Laser Hair Removal: Review Laser Hair Removal Is Good or Bad for you?
Laser Hair Removal: Review Laser Hair Removal Is Good or Bad for you?

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌.. అవాంఛిత రోమాల్ని శాశ్వతంగా తొలగించడానికి చేసే చికిత్స. అత్యంత శక్తిమంతమైన కాంతి పుంజాన్ని చర్మంపై పడేలా చేసి.. రోమాలు మొలిచే హెయిర్‌ ఫాలికల్‌ని తొలగిస్తారు. దాంతో కొత్తగా హెయిర్ పెరగకుండా ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలం పాటు అవాంఛిత రోమాలు పెరగకుండా ఉంటాయి. అయితే ఇది అందరి విషయంలో జరగదని నిపుణులు చెబుతున్నారు.

అన్ వాంటెడ్ హెయిర్ లేజర్‌ పద్ధతిలో తొలగించుకోవచ్చు. ఇది జుట్టు రంగు, చర్మ రంగును బట్టి దీని సక్సెస్‌ రేటు ఆధారపడి ఉంటుంది. అదెలాగంటే.. వెంట్రుకల్లోని మెలనిన్‌ వర్ణద్రవ్యం లేజర్‌ కిరణాలను మరింత సమర్థంగా ఆకర్షిస్తుంది.. కాబట్టి నల్లటి రోమాలు, తెల్లటి చర్మ ఛాయ కలిగిన వారి విషయంలో లేజర్‌ చికిత్స సక్సెస్‌ రేటు ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా.. వెంట్రుకలు నల్లగానే ఉండి, చర్మ ఛాయ కూడా తక్కువగా ఉన్నట్లయితే.. వెంట్రుకల్లోని మెలనిన్‌ని లేజర్‌ అంత త్వరగా గుర్తించలేదు. ఈ క్రమంలో చర్మంలోని మెలనిన్‌ లేజర్‌ని ఆకర్షించి.. ఫలితంగా చర్మం డ్యామేజ్‌ అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది

లేజర్‌ ట్రీట్మెంట్ మీ చర్మతత్వానికి సరిపడుతుందో లో డర్మటాలజిస్ట్ అడిగి తెలుసుకోవాలి. చర్మం పై ట్యాన్‌ ఉంటే లేజర్‌ట్రీట్మెంట్ చేయరు. వ్యాక్సింగ్‌, ప్లకింగ్‌, హెయిర్ అవాంఛిత రోమాలు

కన్నుల భాగంలో , కనురెప్పలు, కంటి చుట్టూ ఉన్న ప్రదేశాల్లో మాత్రం ఈ ట్రీట్మెంట్ చేయరు. పచ్చబొట్టు వేయించుకున్న చోట లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స చేయకూడదు.

Laser Hair Removal Good or Bad
Laser Hair Removal Good or Bad?

Hair: రాత్రి నిద్రకు ముందు జడ వేసుకోవలా.!? ఎందుకంటే.!?

లేజర్‌ హెయిర్‌ రిమూవల్‌ చికిత్స సరిపడినా.. కొంతమందిలో మాత్రం కొన్ని రకాల దుష్ప్రభావాలు వచ్చినా వెంటనే తగ్గుతుంది. ఈ ట్రీట్మెంట్ తర్వాత కూడా చర్మం ఉబ్బడం, ఎరుపెక్కడం కనిపించవచ్చు. కానీ ఇవి కొన్ని గంటల్లోనే తగ్గుతుంది. కొంతమందిలో లేజర్‌ ట్రీట్మెంట్ తర్వాత ఆయా భాగంలో చర్మం రంగు మారచ్చు. కానీ ఇది అరుదుగా మాత్రమే.

  • లేజర్ చికిత్సలో కారణంగా క్యాన్సర్‌ వస్తుందన్న భయం చాలామందిలో ఉంది. అయితే ఇది పూర్తిగా అపోహే మాత్రమే.
  • గర్భిణీ స్త్రీలు లేజర్‌ చికిత్స తీసుకోవడానికి వీల్లేదంటున్నారు నిపుణులు. ఎందుకంటే లేజర్‌ కిరణాలు బిడ్డపై ప్రతికూల ప్రభావం ఉండవచ్చు.
  • ఈ ట్రీట్మెంట్ తీసుకోవాలనుకున్న వారు మాత్రం అనుభవజ్ఞులైన నిపుణుల సమక్షంలో తీసుకోవడమే అన్ని విధాలుగా మంచిది. ఈ ట్రీట్మెంట్ తర్వాత డాక్టర్‌ సలహాలు పాటించాలి. చర్మ సంరక్షణ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి.
  • లేజర్‌ ట్రీట్మెంట్ లో భాగంగా తక్కువలో తక్కువగా ఆరు సిట్టింగ్స్ నుంచి గరిష్ఠంగా ఇరవై సిట్టింగ్స్‌ వరకు చేయించుకోవాలి. మీ చర్మంలో అవాంఛిత రోమాలు వచ్చే హెయిర్ ఫాలికల్స్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని సిట్టింగ్స్ పడతాయి. ఈ చికిత్స తర్వాత చర్మంరెండు రోజుల పాటు ఎండలోకి వెళ్లకుడదు.
  • చాలామంది విషయంలో ఈ లేజర్‌ చికిత్స సత్ఫలితాలనిచ్చినా.. కొంతమందిలో మాత్రం కొన్ని సంవత్సారల తరువాత మళ్లీ ఆన్ వాంటెడ్ హెయిర్ తిరిగి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

Indhulekha Hair Oil Review: ఇందులేఖ హెయిర్ ఆయిల్ లో ఏముంటుంది, ఇది వాడిన వారు ఏమంటున్నారు, ఫైనల్ గా ఐస్ ఇట్ గుడ్ ఆర్ బాడ్?


Share

Related posts

ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు చేయకండి…ఇంట్లోనే తేలికగా ఇలా చేయండి

Kumar

Justice NV Ramana: పార్లమెంట్‌పై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సంచలన వ్యాఖ్యలు

somaraju sharma

Supreme court: యోగి సర్కార్‌కు సుప్రీంలో ఊరట…! ఆ నగరాల్లో లాక్ డౌన్ లేదు..!!

somaraju sharma