NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Transfer: టీడీపీ ఆరోపణలతో జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. కడప సెంట్రల్ జైలు అధికారిపై బదిలీ వేటు .

Transfer: సాధారణంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపక్ష పార్టీ విమర్శలు, సూచనలు ఏమీ పట్టించుకోరు. టీడీపీ ప్రతిదీ రాజకీయం చేస్తుందనీ, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరించదని వైసీపీ పేర్కొంటుంటుంది.  కానీ టీడీపీ చేసిన ఈ ఆరోపణ విషయంలో ప్రభుత్వం స్పందించింది. ఇటీవల కడప సెంట్రల్ జైలు అధికారి వరుణారెడ్డిని నియమించడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. గతంలో పరిటాల రవి హత్య కేసు ప్రధాన నిందితుడు మొద్దు శ్రీనును అనంతపురం జైలులోనే తోటి ఖైదీ హత్య చేశారనీ, ఆ సమయంలో జైలు ఇన్ చార్జి అధికారిగా ఉన్న వరుణా రెడ్డిని ఇప్పుడు కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జిగా ఉన్నారని పేర్కొన్నారు. వివేకా హత్య కేసు నిందితులు ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నారనీ, వారికి ప్రాణ హాని పొంచి ఉందని ఆరోపించారు చంద్రబాబు. మరో పక్క ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అధికారులకు లేఖ రాశారు.

Kadapa central jail officer varuna reddy Transfer
Kadapa central jail officer varuna reddy Transfer

 

Transfer: కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి అధికారి బదిలీ

వివేకా హత్య కేసులో నింధితులకు కడప జైలులో రక్షణ లేదనీ, ఆ నిందితులను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపడం గానీ లేక అక్కడ ఉన్న జైలు ఇన్ చార్జి అధికారి వరుణారెడ్డిని వేరే జిల్లాకు బదిలీ చేయాలని లేఖలో పేర్కొన్నారు. అక్కడి జైలు అధికారిపై గతంలో ఉన్న అభియోగాలను లేఖలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కడప సెంట్రల్ జైలు ఇన్ చార్జి సూపర్నిటెండెంట్ గా ఉన్న వరుణారెడ్డిని ఒంగోలు జిల్లా జైలుకు బదిలీ చేసింది. ఒంగోలు జిల్లా జైలు సూపర్నింటెండెంట్ ప్రకాశ్ ను కడప జైలుకు బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

వివేకా హత్య కేసు విషయంపై టీడీపీ చాలా కాలంగా సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వస్తుంది. ఈ హత్య కేసులో నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో కడప జైలులో వివేకా హత్య కేసు నిందితులపై ఏమైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని భావించిన ప్రభుత్వం సీబీఐ జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వకముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న జైలు అధికారి వరుణారెడ్డి పై బదిలీ వేటు వేసింది.

Related posts

Arvind Kejrival: సీఎం కేజ్రీవాల్ పీఎస్ బిభవ్ కుమార్ అరెస్టు .. కేజ్రీవాల్ ఏమన్నారంటే..?  

sharma somaraju

గన్నవరం ఎయిర్ పోర్టులో ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్ నిర్బంధం, విడుదల .. అసలు ఏమి జరిగిందంటే ..?

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆ బీఆర్ఎస్ నేతను ఎందుకు అరెస్టు చేయడం లేదు ?: బీజేపీ నేత రఘునందనరావు

sharma somaraju

Telangana EAPCET: ఈఏపీ సెట్ ఫలితాలు విడుదల – టాప్ టెన్ ర్యాంకర్లు వీరే

sharma somaraju

SIT: విచారణ ప్రారంభించిన సిట్ ..రాజకీయ నేతలు, అధికారుల్లో గుబులు

sharma somaraju

EC: పల్నాడు కలెక్టర్, మూడు జిల్లాలకు ఎస్పీలను నియమించిన ఈసీ

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి కన్హయ్య కుమార్ పై దాడి .. దాడికి కారణం అదేనా..?

sharma somaraju

Siddhu Jonnalagadda: టిల్లు స్క్వేర్ స‌క్సెస్ తో భారీగా పెరిగిన సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ రెమ్యున‌రేష‌న్‌.. ఇప్పుడెన్ని కోట్లంటే..?

kavya N

Road Accident: పెళ్లి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ ఘోర విషాదం .. వరుడు సహా అయిదుగురు దుర్మరణం

sharma somaraju

Serial Actor Chandrakanth: ప‌విత్ర‌తో ఐదేళ్లుగా స‌హ‌జీవ‌నం.. క‌ట్టుకున్న భార్య‌కు అన్యాయం.. చంద్రకాంత్ గురించి వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

Malla Reddy: స్థలాన్ని ఆక్రమించుకుంటున్నారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఫైర్ .. సుచిత్ర పరిధిలో ఉద్రిక్తత

sharma somaraju

Prasanna Vadanam: ఆహాలో అల‌రించ‌బోతున్న సుహాస్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ప్ర‌స‌న్న‌వ‌ద‌నం.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!

kavya N

వైసీపీ Vs టీడీపీ: ఈ ఐదే ఓట‌ర్ల‌ను తిక‌మ‌క పెట్టాయా ?

ఏపీ వార్‌: ఈ విధ్వంసం వెన‌క ఎక్క‌డ .. ఏం జ‌రిగింది ?

లోకేష్ కోసం.. మ‌రో ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా..!