NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 17 Today Episode:దీప ఇంటికి వెళ్లిన మోనితకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన దీప!

Karthika Deepam Feb 17 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందంటే మోనిత ఇంటిముందున్న ప్రజావైద్యశాల బోర్డుని దీప చెప్పిందని ఆ వారణాసి దాన్ని చించి పడేస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన మోనిత ఇంటిముందున్న జనాన్ని చూసి బాబాయ్ పోయాడా ఏంటి,అయ్యో బాబాయ్ పోతే నా ప్లాన్ ఏమైపోతుంది అనుకుంటుంది.ఇక అసలు విషయం తెలుసుకున్న మోనిత అరెరే దీపక్కకి కోపం వచ్చిందంటే నా గెలుపు ఖాయం అనుకుంటుంది.సీన్ కట్ చేస్తే సౌందర్య ఇంట్లో అంతా ఓ దగ్గర చేరి ఉండడం చూస్తే చాలా సంతోషంగా ఉంది అంటుంది సౌందర్య.

Sarkaru Vaari Paata: అతను కూడా “సర్కారు వారి పాట” మరో “పోకిరి” అంటున్నాడు..!!

Karthika Deepam Feb 17 Today Episode: మోనిత ప్లాన్ ఏంటో తెలుసుకుంటా అంటున్న భారతి :

మరోవైపు కార్లో వెళుతున్న డాక్టర్ రవి, భారతి అసలు మోనిత ప్లాన్ ఏంటి ఎందుకు కార్తీక్ కి ఎందుకు ఫేవర్ చేసిందో అర్థం కావడం లేదంటుంది. దీప చెప్పినట్టు మోనిత కార్తీక్ కి సపోర్ట్ చేయడానికి ఇంకేదైనా కారణం ఉంటుందా అని డౌట్ వ్యక్తం చేస్తే..ఏమో నీకే తెలియాలి అంటాడు రవి. నిజానికి నేను మోనితకి క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటారు కానీ మోనిత ఎప్పుడు ఏం చేస్తుందో నేనుకూడా ఊహించలేను అంటుంది.ఇక కార్తీక్ బాబుని ఎత్తుకుని ఆడిస్తుంటే దీపక్కా అంటూ ఎంట్రీ ఇస్తుంది మోనిత. ఏంటి కార్తీక్ ఆదిత్య కొడుకుని ఆడిస్తున్నావా, మన బాబుని ఎప్పుడైనా ఇలా ఎత్తుకున్నావా అంటుంది. తమ్ముడి కొడుకుమీద ఉన్న ప్రేమ మన కొడుకుమీద లేకపోతే ఎలా అంటుంది. వీడు దీపు గాడు కాదని కార్తీక్ చెప్పేలోగా శ్రావ్య అడ్డుపడి…వివరాలు తనకి చెప్పడం ఎందుకులెండి బాబుని నాకివ్వండి అని తీసుకెళ్లిపోతుంది.

Trivikram Mahesh: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో.. మరో సూపర్ స్టార్..??
దీప ఇంటికి మోనిత :

ఇంతలో అక్కడకు ఎంట్రీ ఇచ్చిన దీప కారణం నేను చెబుతాను డాక్టర్ బాబు అంటుంది దీప. బస్తీలో బోర్డు పీకించేశానని తన కడుపుమంట డాక్టర్ బాబు అని చెబుతుంది. నా పేరు, డాక్టర్ బాబు పేరు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది, బస్తీ వాసులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్ అని క్వశ్చన్ చేస్తుంది. నేను లేనప్పుడు నీ ఆటలు సాగాయ్, నేను వచ్చాను కాస్త ఒళ్లు దగ్గర పెట్టుకో అంటుంది దీప.స్పందించిన మోనిత..కార్తీక్ ఇవన్నీ ఆపేస్తానని నీకు ముందే చెప్పాను ఆలోచించుకో అంటుంది. ఒక్క బోర్డు తీసేస్తే బస్తీలో ప్రతి ఇంటికీ ఓ బోర్డు తగిలిస్తానని మోనిత హెచ్చరిస్తే…. కుక్కతోక వంకర అని ఊరికే అనలేదు… ఇకపై లెక్కే వేరన్నట్టుంది చెబుతుంది దీప. బస్తీ వాళ్లను చూసుకుని నీకు బాగా బలం వచ్చినట్టుంది, అదే బస్తీ వాళ్లను నా వైపు తిప్పుకుంటాను అని అంటుంది మోనిత. కార్తీక్ సింపిల్ గా అయ్యేదాన్ని నువ్వు కాంప్లికేట్ చేస్తున్నావ్ అంటుంది మోనిత. నేను నీలా ఆలోచిస్తే నువ్వు తట్టుకోలేవ్, త్వరలోనే దీప అంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇస్తుంది. మోనిత కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    Trivikram Mahesh: త్రివిక్రమ్ మహేష్ సినిమాలో.. మరో సూపర్ స్టార్..??
    మోనిత కండిషన్ గురించి దీపకు చెప్పిన కార్తీక్ :

    మోనిత కండిషన్ పెట్టిందో, ఆఫర్ ఇచ్చిందో తెలీదు కానీ అంటూ మోనిత చెప్పన డీల్ గురించి కార్తీక్ దీపకి చెబుతాడు. ఇంతకాలం మోనిత గురించి మనం ఎక్కువ ఆలోచించలేదు కాబట్టి రెచ్చిపోతోంది. మన పక్కన క్రూర జంతువు వెళుతుంటే పట్టించుకోవాలన్న దీప మీకు డాక్టర్ లైసెన్స్ రావడం వెనుక ఏదో కుట్ర ఉందని నా అనుమానం అంటుంది. ఇంత నెగిటివ్ గా ఆలోచిస్తున్నావ్ అంటని కార్తీక్ అంటే అసలు లైసెన్స్ రావడానికి మోనిత హెల్ప్ చేసిందంటున్నారు కానీ లైసెన్స్ పోవడానికి మోనితే కారణం అయి ఉండొచ్చేమో అంటుంది దీప.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju