RRR: టాలీవుడ్ ఇండస్ట్రీలో తీసిన సినిమాలలో ఒక ఫ్లాప్ లేకుండా.. అదిరిపోయే గ్రాఫ్ మెయింటైన్ చేస్తున్న తిరుగులేని డైరెక్టర్ కొరటాల శివ. మహేష్ బాబుతో “భరత్ అనే నేను” లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత.. ఏడాది పాటు చిరంజీవి కోసం వెయిట్ చేసి తర్వాత “ఆచార్య” సినిమా స్టార్ట్ చేయగానే కరోన రావడం తెలిసిందే. దీంతో రెండు సంవత్సరాలు ఈ సినిమా ప్రాజెక్టు లోనే శివ పని చేయడం జరిగింది. అయితే ఎట్టకేలకు ఇటీవల సినిమా పూర్తి చేసి ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు హిందీలో కూడా డబ్ చేసి అదే రోజు విడుదల చేయాలని సినిమా యూనిట్ డిసైడ్ అయిందట. అయితే హిందీలో ఈ సినిమాని పెన్ స్టూడియోస్ పంపిణీ చేయనుంది. అయితే ఒక్కసారిగా ఆచార్య హిందీ లో విడుదల చేయడానికి గల కారణం “RRR” అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దిగ్గజ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన “RRR” కి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలలో చరణ్ బాగా ఉత్సాహంగా పాల్గొనటంతో…ఆ క్రేజ్ “ఆచార్య” క్యాష్ చేసుకోవటానికి ఈ రీతిగా వ్యవహరించినట్లు ఫిలిం నగర్ టాక్.
సినిమాలో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కీలక పాత్ర చేయడం తెలిసిందే. దాదాపు చరణ్ పాత్ర సినిమాలో 45 నిమిషాల పాటు ఉంటుందని అంటున్నారు. “ఆచార్య” సినిమాకి చరణ్ క్యారెక్టర్ యే హైలెట్ అని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం. సినిమాలో చిరంజీవి సరసన.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా…, చరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. దాదాపు 13 సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా మణి శర్మ సంగీతం అందిస్తుండటంతో మెగా అభిమానులు ఆచార్య విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!