Face Glowing: పైనాపిల్ ఆరోగ్యానికి చాలా మంచిది.. ఇందులో అనేక పోషక విలువలు ఉంటాయి.. ఇవి చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది.. పైనాపిల్ జ్యూస్ లో ఇవి కలిపి ముఖానికి రాసుకుంటే మచ్చలేని మెరిసే మోము మీ సొంతం..! ఎలా ఉపయోగిస్తే ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయంటే.!?
పైనాపిల్ జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత. చల్లటి నీటితో కడిగేసుకోవాలి ఇలా వారంలో రెండు సార్లు చేస్తుంటే ముఖంపై ఉన్న మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.. ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా పైనాపిల్ పేస్ట్ లో కొంచెం తేనే, పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ను ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. చర్మంపై పేరుకొన్న మృతకణాలను తొలగించి చర్మం రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ముఖం ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తుంది.
కొద్దిగా పైనాపిల్ జ్యూస్ లో ఒక చెంచా బాదం నూనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఐదు నిమిషాల పాటు మసాజ్ చేసుకోవాలి. మరో పదిహేను నిమిషాలపాటు అలాగే ఉంచుకొని ఆ తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తారు. పైనాపిల్ లో ఉండే కొల్లాజన్ వృద్ధాప్య ఛాయలను తొలగిస్తుంది. పైనాపిల్ జ్యూస్ కొన్ని రకాల చర్మ తత్వానికి సరిపడక పోవచ్చు. ముందుగా ఈ ప్యాక్ ను ట్రై చేసేటప్పుడే చేతుల మీద రాసుకొని మంట, దురద లేకపోతే.. నిరభ్యంతరంగా ఈ చిట్కాలను పాటించి మంచి ఫలితాలను పొందండి.