NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి .. ఆగంతకుడు అరెస్టు

ప్రముఖ వివాదాస్పద రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ పై న్యూయార్క్ లో ఓ ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. అమెరికా న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో సమావేశానికి సల్మాన్ రష్దీ (75) హజరై ప్రసంగానికి సిద్ధమవుతుండగా వేదికపైకి దూసుకువచ్చిన ఓ ఆగంతకుడు కత్తితో రష్దీ పై దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన రష్దీ అక్కడికక్కడే కుప్పకూలిపోగా ఆయనను హుటాహుటిన హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియరాలేదు. రష్దీపై కత్తితో దాడి చేసిన ఆగంతకుడిని న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

1947లో ముంబాయిలో జన్మించిన సల్మాన్ రష్దీ కొన్నాళ్ల తర్వాత బ్రిటన్ కు తరలివెళ్లి స్థిరపడ్డారు. రష్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైస్ దక్కడంతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పద మైయ్యాయి. ప్రధానంగా 1980లో రచించిన ది సాతానిక్ వెర్సెస్ నవల వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇస్లామిక్ ఛాందస వాదులను ఈ నవల తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. రష్జీ దైవ దూషణకు పాల్పడ్డారంటూ అతనిపై నిప్పులు చెరిగారు. హత్య బెదిరింపులు ఆయనకు వచ్చాయి. మతాన్ని కించపరుస్తుందంటూ 1988లో ఆయన నవలను ఇరాన్ లో నిషేదించారు. రష్దీపై ఇరాన్ నేత ఆయతుల్లా ఖోమేనీ ఫత్వా కూడా జారీ చేశారు. రష్దీ ని హత్య చేసేందుకు ఇరాన్ మూడు మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించింది.

ఎస్సీ, బీసీ: టీడీపీకి పొలిటికల్ దెబ్బ..! జగన్ వేసిన ఉచ్చు.. టీడీపీకి నష్టం తప్పదా..?

Related posts

Lok Sabha Elections 2024: సొంతిల్లు, కారు లేదు కానీ ప్రధాని మోడికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయంటే..?

sharma somaraju

Chandrababu: ఆ చెల్లింపులు ఆపించండి సారూ .. గవర్నర్ అబ్దుల్ నజీర్ కు చంద్రబాబు లేఖ

sharma somaraju

Pulavarti Nani: చంద్రగిరి టీడీపీ అభ్యర్ధి పులవర్తి నానిపై దాడి .. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత

sharma somaraju

Jagan: జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి

sharma somaraju

Lok sabha Elections 2024: వారణాసిలో ప్రధాని మోడీ నామినేషన్ .. హజరైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్

sharma somaraju

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Barzan Majid: ఐరోపా మోస్ట్ వాంటెండ్ స్మగ్లర్ మజీద్ (స్కార్పియన్) అరెస్టు

sharma somaraju

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?