NewsOrbit
న్యూస్

అక్షయ్ కుమార్ కెనడా పౌరుడా?

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుణ్యమా అంటూ హిందీ హీరో అక్షయ కుమార్ ఇటీవల వార్తల్లోకి ఎక్కారు. సినిమా కథానాయకులు ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు, నిజమే! కానీ ఈసారి అక్షయ్ కుమార్‌ను వార్తల్లోకి ఎక్కించింది సినిమా కాదు; రాజకీయాలు.

అదేంటి దేశభక్తికి ప్రతీక అయిన ఆ హీరో మోదీని చేసిన ఇంటర్వ్యూకు రాజకీయాలకూ ఏం సంబంధం అనుకుంటున్నారా? అక్కడే ఉంది మతలబు. అధికారం నిలబెట్టుకోవడం కోసం అన్ని రకాల దారుల్లో ప్రయత్నాలు చేస్తున్న మోదీ తన ప్రచారం కోసం వేసిన కొత్త ఎత్తుగడే ఆ ఇంటర్య్యూ అని ప్రజలు చాలామంది గ్రహించారు.

దానితో అక్షయ్‌పై జనం దృష్టి పడింది. గూగుల్‌లో అతనిపై శోధనలు పెరిగాయి. మీడియా కూడా అక్షయ్‌ను హీరోగా కాకుండా ఇతరత్రా చూడడం మొదలుపెట్టింది. ముంబైలో మొన్న జరిగిన పోలింగ్‌లో చాలామంది తారలు తమ వోటు హక్కు వినియోగించుకున్నారు. అక్షయ్ మాత్రం పోలింగ్ కేంద్రం మొహం చూడలేదు. మామూలుగా అయితే మీడియా పట్టించుకునేది కాదేమో! మొన్నటి ఇంటర్వ్యూ కారణంగా కాబోలు అక్షయ్‌ను వోటు ఎందుకు వేయలేదని మీడియా అడిగింది. దానికి ఆయన సమాధానం ఇవ్వలేదనుకోండి.

ఇప్పుడు ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. అక్షయ్ కుమార్ కెనడా పౌరుడని తెలిసింది. ‘వాంకూవర్ అబ్జర్వర్’ అనే కెనడాకు చెందిన ఆన్‌లైన్ వార్తాపత్రిక ఒక వార్తా కథనంలో ఈ విషయం వెల్లడించింది. నిజానికి అక్షయ్ కుమార్‌కు కెనడా పౌరసత్వం ఉందని చెప్పడం ఆ వార్తా కథనం అసలు లక్ష్యం కాదు. వాస్తవంగా కెనడా పౌరులయిన వారికి కెనడా పౌరసత్వం నిరాకరిస్తున్నారంటూ రాసిన ఆ కథనంలో, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ లాంటి వారికి మాత్రం వారాల వ్యవధిలోనే పౌరసత్వం ఇస్తున్నారని పేర్కొన్నారు.

ఇండియా చట్టాల ప్రకారం భారత పౌరులకు ద్వంద్వ పౌరసత్వం అవకాశం లేదు. మరి అక్షయ్ కుమార్ కెనడా పౌరసత్వం తీసుకున్నదే నిజమయితే ఆయన ఇండియా పౌరసత్వాన్ని వదులుకుని ఉండాలి.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Leave a Comment