NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ముద్రగడ తో వైసీపీ కాపు నేతల కీలక భేటీ ..జగన్ దూతలుగానేనా..?

కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. కాపు ఉద్యమ సమయంలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో తమ సామాజిక వర్గానికి చెందిన యువకులపై పెట్టిన కేసులను వైసీపీ సర్కార్ ఉప సంహరించడం, రైల్వే కోర్టు కూడా ఆ కేసును కొట్టివేయడంతో ముద్రగడ పద్మనాభం మరల క్రియాశీల రాజకీయాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారుట. వైసీపీ పట్ల సానుకూలంగా ఉన్న ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రత్తిపాడు లేదా పిఠాపురం నుండి పోటీ చేయాలన్న ఆసక్తి చూపుతున్నారని వార్తలు వినబడుతున్నాయి. ఒక వేళ తను పోటీ చేయకపోతే తన కుమారుడిని వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో ముద్రగడ పద్మనాభంతో వైసీపీ కాపు నేతలు భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

YSRCP Kapu Leaders Meet Mudragada Padmanabham

 

వైసీపీ ఎంపీ వంగా గీత, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబుతో పాటు పలువురు ఎంపీపీలు, కాపు నేతలు కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి వెళ్లి సమావేశమైయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై వీరి మధ్య చర్చ జరిగిందని తెలుస్తొంది. చాలా కాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడ పద్మనాభం నుండి వైసీపీలోకి ఆహ్వానించేందుకే వీరు వెళ్లినట్లుగా, అది కూడా సీఎం జగన్మోహనరెడ్డి సూచనల మేరకే వెళ్లారనే అనుకుంటున్నారు. ముద్రగడ ఆలోచనలు, పార్టీలో చేరేందుకు ఆయన కోరికలను తెలుసుకుని సీఎం జగన్మోహనరెడ్డి కి తెలియజేయడం ద్వారా పార్టీలో చేరికకు మార్గం సుగమం చేసే ప్రయత్నంలో భాగంగా వైసీపీలోని కాపు సామాజికవర్గ నేతలు ముద్రగడతో భేటీ అయ్యారన్న చర్చ జరుగుతోంది.

అసెంబ్లీ సీటు హామీ లభిస్తే త్వరలో వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ప్రధానంగా ఈ నెల 14వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ను దెబ్బకొట్టేందుకు ముద్రగడను అస్త్రంగా వాడుకోవాలని వైసీపీ వ్యూహాత్మక అడుగులు వేస్తొందనేది టాక్. ఈ క్రమంలోనే వైసీపీ కాపు నేతల భేటీ అన్న చర్చ జరుగుతోంది. వీరి సమావేశ ఎజెండా ఏమిటి అనేది బయటకు అయితే రాలేదు కానీ త్వరలో ముద్రగడ వైసీపీలోకి ఎంట్రీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

దివ్యాంగులకు సీఎం కేసిఆర్ గుడ్ న్యూస్

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?