NewsOrbit
జాతీయం న్యూస్

మహారాష్ట్ర లో ఘోర ప్రమాదం .. 25 మంది సజీవ దహనం .. ప్రధాని మోడీ దిగ్భాంతి

మహారాష్ట్ర లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 25 మంది సజీవ దహనం అయ్యారు. మరో ఎనిమిది మంది గాయాలతో బయటపడ్డారు. మహరాష్ట్ర లోని బుల్దానాలోని సమృద్ది మార్గ ఎక్స్ ప్రెస్ హైవేపై వేకువ జామున ఈ ఘటన జరిగింది. యావత్కాల్ నుండి పూణె కు 32 మంది తో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. ప్రయాణీకులు అందరూ గాఢ నిద్రలో ఉండగా బస్సు టైరు పేలిపోయి పల్టీ కొట్టింది. దీంతో బస్సులో నుండి హాఠాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రయాణీకులు మేల్కొనేలోపే క్షణాల్లో బస్సులోని ప్రయాణీకులు అగ్నికీలలకు బలయ్యారు. కొద్ది మంది ప్రయాణీకులు బస్సు వెనుక అద్దం పగులగొట్టి బయటపడ్డారు.

25 Burnt Alive in Maharashtra bus accident.

 

ప్రమాదం జరిగిన కొద్ది సేపటికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది.  బస్సు ప్రమాదంలో గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.

బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు అయిదు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ శిండే శనివారఁ ఉదయం ప్రకటించారు. మహారాష్ట్ర ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ కింద రూ.2లక్షలు చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల వంతున సాయం ప్రకటించారు.

గోదావరి జిల్లాల్లో వైసీపీకి సై అంటే సై అన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్

Related posts

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?

వ‌లంటీర్లు – గృహ సార‌థులు తెచ్చిన ఓట్లెన్ని… వైసీపీ లెక్క ఇదే…!

BSV Newsorbit Politics Desk

జ‌గ‌న్ : సింహం సింగిల్ గానే… అందుకే మ‌ళ్లీ బంప‌ర్ విక్ట‌రీ…?

గ‌న్నవ‌రంలో వంశీ, యార్ల‌గ‌డ్డ ఇద్ద‌రూ చేతులెత్తేశారా.. మ‌రి గెలుపెవ‌రిది..?

Lok Sabha Elections: ముగిసిన లోక్ సభ  ఐదో విడత పోలింగ్ ..56.7 శాతం పోలింగ్ నమోదు

sharma somaraju

అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం

sharma somaraju

TS Cabinet Key Decisions: ధాన్యం కొనుగోలు బాధ్యత కలెక్టర్లదే.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

sharma somaraju