NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Pedana (Krishna): మనసున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ – మంత్రి జోగి రమేష్

Pedana (Krishna): ప్రజలు అడగకుండానే వారి ఆకలి గమనించి ఆదుకుంటున్న మనసు ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల్లో పర్యటించిన మంత్రి జోగి రమేష్ జగనన్న సురక్ష కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత పెడన మండలం బల్లిపర్రు  గ్రామంలో జరుగుతున్న జగనన్న సురక్ష కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న ఘనత  వైసీపీ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.

AP Minister Jogi Ramesh

 

అర్హులై ఉండి ప్రభుత్వ పథకం పొందకుండా మిగిలిపోకూడదన్న ఉద్దేశంతో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమ్మ ఒడి, పింఛన్లు, చేయూత, కాపు నేస్తం జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా వంటి అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు. కొందరు అర్హులుగా ఉన్నప్పటికీ ఆదాయం, కులం, కుటుంబం తదితర ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఇటువంటి ప్రభుత్వ పథకాలు పొందలేక మధనపడుతున్నారన్నారు. ఈ విషయం గమనించిన సిఎం జగన్ వాలంటీర్లను ప్రతి ఇంటికి పంపించి వారి అవసరాలను గుర్తించి 11 రకాల సేవలను ఉచితంగా అందించే కార్యక్రమం జగనన్న సురక్ష ద్వారా చేస్తున్నదని చెప్పారు. పాత బల్లిపర్రు గ్రామ రహదారి నిర్మాణం కోసం రూ.50 లక్షలు,  మంచినీటి సదుపాయం కోసం రూ.6 లక్షలు మంజూరు చేస్తామని మంత్రి గ్రామస్తులకు హామీ ఇచ్చారు.

AP Minister Jogi Ramesh

 

ముంజలూరు గ్రామంలో స్మశానానికి పోవు దారి కోసం రూ.5 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బల్లిపర్రు గ్రామంలో 787 మందికి, బంటుమిల్లి మండలం ముంజలూరు గ్రామంలో 76 మందికి, అత్తమూరు గ్రామంలో 235 మందికి, కృత్తివెన్ను మండలం చినపాండ్రాక గ్రామంలో 610 మంది లబ్ధిదారులకు వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను మంత్రి జోగి రమేష్ అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, డి ఎల్ డి ఓ సుబ్బారావు, ఎంపీపీ రాజులపాటి వాణి, ఎంపీడీవో రెడ్డయ్య తహశీల్దారు మధుసూదనరావు, ఎంపీపీలు వెలివెల చినబాబు, సంగా మధు సూధనరావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు కొల్లాటి గంగాధర రావు,  గరికిపాటి చారుమతి రామానాయుడు, జడ్పీటీసీలు మైలా రత్నకుమారి, వేముల సురేష్ రంగ బాబు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరక్టర్ కారుమంచి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అమరావతి భూస్కామ్ లో చంద్రబాబు, పొంగూరు నారాయణ లు ఇలా దొరికేశారు(గా)..!

Related posts

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju