NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నుమూత

మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి (70) అలియాస్ సంగ్రామ్ (సాయన్న)  అనారోగ్యంతో కన్నుమూశారు. దండకారణ్యంలో ఆయన మృతి చెందినట్లు పేర్కొంటూ మావోయిస్టులు సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు. తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి రాజిరెడ్డి తొలి తరం మావోయిస్టు నేతల్లో ఒకరు. నాలుగున్నర దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదిగి ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడుగా కొనసాగుతున్నారు రాజిరెడ్డి. 1975 లో ఇంటర్ చదువుతున్న సమయంలోనే ఆర్ఎస్ యూలో చేరారు. అప్పుడే కమ్యూనిస్టు భావజాలానికి ఆకర్షితుడయ్యారు రాజిరెడ్డి. వివాహమై ఒక కూరుతు జన్మించిన తర్వాత 1977లో అజ్ఞాతంలోకి వెళ్లి అప్పటి పీపుల్స్ వార్ లో చేరారు.

Raji Reddy

 

మంథని, మహదేవ్ పూర్ ఏరియా దళంలో పని చేసి కేంద్ర కమిటీ సభ్యుడి స్థాయికి ఎదిగారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్ చార్జిగా ఆయన పని చేశారు. రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కేసులు ఉండగా, వివిధ రాష్ట్రాల్లో ఆయనపై కోటి రూపాయల రివార్డు ఉంది. పీపుల్స్ వార్ అగ్రనేతలతో ఆయన పని చేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తి లకు సహచరుడు రాజిరెడ్డి.  ఉమ్మడి ఏపీ మాజీ స్పీకర్ శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడుగా ఉన్నారు.

2008 జనవరి నెలలో కేరళలో రాజిరెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మెట్ పల్లి కోర్టులో హజరుపర్చారు. వివిధ కేసుల్లో నిందితుడుగా రెండున్నరేళ్లు కరీంనగర్ జైలులో ఆయన ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తఫాల్ పూర్ లో నలుగురి హత్య కేసులోనూ ఆయన నిందితుడు. ఉమ్మడి ఏపీలో పీపుల్స్ వార్ చేసిన తొలి హత్య తఫాల్ పూర్ ఘటన. ఆ కేసులో ఏ 1 గా కొండపల్లి సీతారామయ్య, ఏ 2 గా రాజిరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, రాజిరెడ్డి కన్నుమూసినట్లు సమచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తమకు అప్పగించాలని కోరుతున్నారు.

Related posts

Karthika Deepam 2 May 23th 2024 Episode: దీపకి వార్నింగ్ ఇచ్చిన అనసూయ.. కేసు వెనక్కి తీసుకున్న కార్తీక్..!

Saranya Koduri

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

sharma somaraju

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

sharma somaraju

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju