NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు వాయిదా

ntr reaction on chandrababu arrest

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు కు ఏసీబీ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. దీంతో చంద్రబాబు ను జైల్ లో వద్దు, గృహ నిర్బందంలో ఉంచండి అంటూ చంద్రబాబు తరపున దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో సోమవారం వాదనలు జరిగాయి. వాదనలు మిగిసిన అనంతరం సాయంత్రం తీర్పు వెలువడుతుందని భావించినప్పటికీ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేస్తూ రేపు ఉత్తర్వులు ఇస్తానని పేర్కొన్నారు.

ntr reaction on chandrababu arrest

ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకరరెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ద లుథ్రా వాదనలు వినిపించారు. రాజమండ్రి జైల్ కంటే మించిన సెక్యురిటీ ఎక్కడా ఉండదని అదనపు ఏజీ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు 50 అడుగుల గోడ ఉంటుందనీ, అక్కడకు ఎవ్వరూ రాలేరన్నారు.

ACB remand Chandrababu naidu,

చంద్రబాబుకు ఇంట్లో కంటే జైలులోనే భద్రత ఉంటుందనీ, చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై ప్రభుత్వం అనుక్షణం అప్రమత్తంగా ఉందని ఏఏజి తెలిపారు. 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉంటారనీ, ఆయన భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదనీ, జైలులో చంద్రబాబుకు ప్రత్యేక గదితో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణ కొనసాగుతోందని తెలియజేస్తూ చంద్రబాబు భద్రతపై తీసుకున్న చర్యలపై జైళ్ల శాఖ డీజీ అదేశాల లేఖను న్యాాయమూర్తి ముందు ఉంచారు. గృహ నిర్బంధం పిటిషన్ ను డిస్మిస్ చేయాలని ఏఏజీ కోరారు.

Unexpected scene in ACB court while Chandrababu was in court cage

చంద్రబాబు తరపు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపిస్తూ చంద్రబాబుకు ఇప్పటి వరకూ ఎన్ఎస్జీ భద్రతలో ఉన్నారని చెప్పారు. చంద్రబాబు కు జైలులో కల్పించిన భద్రతపై అనుమానం ఉందన్నారు. హౌజ్ కస్టడీ కి సంబంధించి గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఉందని గుర్తు చేశారు. ఆయన వయసు, హోదా దృష్ట్యా హౌజ్ రిమాండ్ ఇవ్వాలని కోరారు.

జైలులో భద్రత రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిదని , రాష్ట్ర ప్రభుత్వం భద్రత పై అనుమానంతోనే ఎన్ఎస్ జీ భద్రత ఉందని, ఆయన జైలులో ఉంటే ఎన్ ఎస్ జీ కమెండోలు బయటే ఉంటారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి తీర్పు రిజర్వు చేశారు. రేపు ఉత్తర్వులు వెలువరిస్తామని కోర్టు ప్రకటించింది,

TDP Leaders celebrations: చంద్రబాబు అరస్ట్ అయితే టీడీపీ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకున్నారు ? ఫుల్ స్టోరీ !

Related posts

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju