NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

TDP Leaders celebrations: చంద్రబాబు అరస్ట్ అయితే టీడీపీ నాయకులు ఎందుకు సంబరాలు చేసుకున్నారు ? ఫుల్ స్టోరీ !

Advertisements
Share

TDP Leaders celebrations: చంద్రబాబు అరెస్టు అయి జైలుకు వెళితే టీడీపీ నాయకులు ఓ చోట సంబరాలు చేసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. విషయంలోకి వెళితే.. టీడీపీ అధినేత చంద్రబాబు ను స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు చేసిన సీఐడీ అధికారులు రోడ్డు మార్గంలో విజయవాడ కు తీసుకువచ్చారు. సాయంత్రం నుండి రాత్రి మొత్తం సిట్ కార్యాలయంలో విచారణ జరిపి అదివారం వేకువజామున కోర్టులో హజరుపర్చారు.

Advertisements

అయితే ఏసీబీ కోర్టులో రిమాండ్ రిపోర్టుపై వాదనలు మొదలు కావడంతో చంద్రబాబు తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరుపున ప్రభుత్వ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అయితే సోషల్ మీడియాలో చంద్రబాబు రిమాండ్ రిపోర్టును కోర్టు తిరస్కరిస్తుందని, చంద్రబాబు వెంటనే బయటకు వస్తారంటూ టీడీపీ శ్రేణులు భావించారు.

Advertisements

ntr reaction on chandrababu arrest

ఉదయం నుండి మధ్యాహ్నం వరకూ వాడివేడిగా వాదనలు ముగిసిన తర్వాత తీర్పు రిజర్వ్ చేసిన న్యాయమూర్తి .. సాయంత్రం తీర్పు వెలువరించారు. 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చారు. మరో పక్క ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో కొందరు అత్యుత్సాహంతో చంద్రబాబుకు బెయిల్ వచ్చేసినట్లుగా ట్రోల్స్ చేశారు.

అసత్యపు ప్రచారం హోరెత్తించారు. ఓ నాయకుడు అయితే బాణాసంచా కల్చి సంబరాలు జరిపి ఆ తర్వాత ముక్కున వేలు వేసుకున్నాడు. విశాఖ జిల్లా పీఎం పాలెం లో జీవీఎంసీ 6వ వార్డు టీడీపీ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు, రాష్ట్ర బీసీ సెల్ నాయకుడు గొల్లంగి అనందబాబు తదితరులు ఆదివారం సాయంత్రం ఆయిదు గంటలకే బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత చంద్రబాబుకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చిందని తెలియడంతో తెలుగు తమ్ముళ్లు చేసిన పనికి ముక్కున వేలేసుకున్నారు.

Chandrababu Naidu-NTR: చంద్రబాబు అరస్ట్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు స్పందించలేదు ? చాలా హ్యాపీ గా ఉన్నాడా ?


Share
Advertisements

Related posts

Wild Dog : వైల్డ్ డాగ్ తెరవెనుక కథ ఇదేనంట.. మీరు ఓ సారి చూసేయండి..

bharani jella

Central government:ఆధార్, పాన్, పాస్‌పోర్టు అన్ని దానితోనే లింక్.. ఇక ప్రతి ఒక్కరికీ ఒకటే ఐడీ!

Ram

చింతమనేని అనుచరులపై అపూర్వ ఫిర్యాదు

sarath