NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu: చంద్రబాబు అరస్ట్ గురించి మొట్టమొదటిసారి స్పందించిన cm జగన్ !

Jagan's government has set itself a goal by arresting Chandrababu
Advertisements
Share

Chandrababu: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ను ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబును సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు లో హజరుపర్చగా, రిమాండ్ రిపోర్టుపై ఇరుపక్షాల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపున సీనియర్ సుప్రీం కోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా, సీఐడీ తరపున ప్రభుత్వ అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించాయి. చివరకు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ వాదనలకు ఏకీభవిస్తూ 14 రోజులు రిమాండ్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో చంద్రబాబు ను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు.

Advertisements

Jagan's government has set itself a goal by arresting Chandrababu

దీంతో శుక్రవారం రాత్రి మొదలైన హైడ్రామా 48 గంటల తర్వాత తెరపడింది. ఏసీబీ కోర్టు రిమాండ్ రిపోర్టును రిజక్ట్ చేసి చంద్రబాబుకు వెంటనే బెయిల్ మంజూరు చేస్తారని భావించిన టీడీపీ శ్రేణులకు భంగపాటు ఎదురైంది, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో రూ.279 కోట్లు దుర్వినియోగం జరిగిందన్న ఆరోపణలతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు అందుకు సంబంధించి పలు ఆధారాలను కోర్టు ముందు ఉంచారు.

Advertisements

Unexpected scene in ACB court while Chandrababu was in court cage

చంద్రబాబు అరెస్టులో అధికారులు ప్రొసీజర్ ఫాలో కాలేదనీ, ఎఫ్ఐఆర్ లో ఆయన పేరు లేకపోయినా అరెస్టు చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ లో 37వ నిందితుడుగా పేర్కొన్నారనీ, ఆయనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ వర్తించదని ఇలా పలు వాదనలు చంద్రబాబు తరపున న్యాయవాది వినిపించినా ఏసీబీ కోర్టు .. సీఐడీ వాదనలకు ఏకీభవించి రిమాండ్ విధించింది. అయితే పిటిషనర్ తరపు విజ్ఞప్తి మేరకు జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని ఆదేశాలు ఇచ్చింది.

చంద్రబాబు అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. అయితే ఈ అంశంపై విదేశీ పర్యటనలో ఉన్న సీఎం వైఎస్ జగన్ కు వివరాలు తెలియజేయగా, అవినీతికి పాల్పడిన వాళ్లను జైలుకు తరలించకుండా ముద్దు పెట్టుకుంటారా అన్నట్లు కామెంట్స్ చేశారుట. ఏసీబీ కోర్టులో ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించిన న్యాయవాద బృందాన్ని కూడా అభినందించారుట. ఏది ఎలా ఉన్నా ప్రతిపక్ష నేతకు సెంట్రల్ జైలులో ప్రత్యేక వసతులు కల్పించి పటిష్ట భద్రతా ఏర్పాటు చేయాలని చెప్పినట్లుగా సమాచారం.

Chandrababu: చంద్రబాబు హౌజ్ రిమాండ్ పిటిషన్ పై తీర్పు వాయిదా


Share
Advertisements

Related posts

Kodali Nani : మంత్రి కొడాలి నానికి బిగ్ రిలీఫ్..! మీడియా కళ్ళు బైర్లు కమ్మే న్యూస్ చెప్పిన సర్పంచి అనూష..!!

Yandamuri

YS Viveka: వివేకా కేసులో దారుణ నిజాలు..! వైసీపీకి బిగుస్తున్న ఉచ్చు..?

Srinivas Manem

Fire Accident : నంద్యాల చెక్ పోస్టు వద్ద భారీ అగ్నిప్రమాదం

somaraju sharma