NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Chandrababu Arrest: ముగిసిన చంద్రబాబు తొలి రోజు సీఐడీ విచారణ .. ఎన్ని గంటలు సాగిందంటే..?

Chandrababu Arrest: స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు తొలి రోజు కస్టడీ విచారణ ముగిసింది. విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబును రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సీఐడీ అధికారులు శనివారం తొలి రోజు ఆయన తరుపు న్యాయవాదుల సమక్షంలో విచారించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్ లోని కాన్ఫరెన్స్ హాలులో స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టునకు సంబంధించి కొన్ని కీలక ఫైళ్లను చంద్రబాబు ముందు ఉంచి విచారణ జరిపినట్లుగా సమాచారం.

తొలి రోజు సుమారు ఆరు గంటల పాటు విచారణ సాగినట్లు సమాచారం. చంద్రబాబుకు జైల్ ఆవరణలోని ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం విచారణ ప్రారంభించారు. తొలి రోజు 11.30 గంటల తర్వాత విచారణ ప్రారంభించినట్లు సమాచారం. కోర్టు ఆదేశాల మేరకు గంటకు అయిదు నిమిషాలు రెస్ట్ ఇస్తూ విచారణ ప్రక్రియను కొనసాగించినట్లు తెలుస్తొంది. మధ్యాహ్నం ఒంటి గంటకు చంద్రబాబుకు బ్రేక్ ఇచ్చారు. లంచ్ బ్రేక్ తర్వాత కూడా చంద్రబాబును సీఐడీ అధికారులు విచారించారు. విచారణ  విరామ సమయంలో చంద్రబాబు తన న్యాయవాదులతో మాట్లాడుకునే వెసులుబాటు కల్పించారని సమాచారం.

విచారణ తర్వాత కూడా చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయుడు నేతృత్వంలో అధికారుల బృందం విచారణ ప్రక్రియను కోర్టు ఆదేశాల మేరకు సీఐడీకి చెందిన వీడియో గ్రాఫర్ తో రికార్డు చేయించినట్లు సమాచారం. విచారణ నివేదిక మొత్తాన్ని సీల్డ్ కవర్ లో కోర్టుకు సమర్పించాలని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్న సంగతి తెలిసిందే.   ఆదివారం నాడు ఈ కేసుకు సంబంధించి రెండో రోజు విచారణ జరగనుంది. రేపు సాయంత్రం విచారణ పూర్తి అయిన తర్వాత చంద్రబాబును వర్చువల్ పద్దతిలో న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టనున్నారు సీఐడీ అధికారులు.

TSPSC: తెలంగాణ గ్రూప్ – 1 ప్రిలిమ్స్ రద్దు చేసిన హైకోర్టు .. హైకోర్టు తీర్పుపై టీఎస్పీఎస్సీ కీలక నిర్ణయం..?

Related posts

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!