NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Telangana Assembly: గత ప్రభుత్వంలో మాదిరిగా మనం చేయొద్దు .. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు కీలక సూచన చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి

Telangana Assembly: నాలుగు రోజుల విరామం అనంతరం తెలంగాణ శాసనసభ సమావేశాలు ఇవేళ ప్రారంభమైయ్యాయి. స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటిఆర్ తో పాటు అధికార, విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు ప్రసాద్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఆయన్ను స్పీకర్ స్థానం వద్దకు సీఎం, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క, ఇతర నేతలు తోడ్కొని వెళ్లి కూర్చొబెట్టారు.

ఈ సందర్భంగా స్పీకర్ ఎన్నికకు సహకరించిన పార్టీలకు సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మంచి సంప్రదాయానికి తొలి రోజే సభ నాంది పలికిందని, భవిష్యత్తులోనూ ఇదే సంప్రదాయం కొనసాగాలని రేవంత్ ఆకాంక్షించారు. ఆ తర్వాత స్వీకర్ అభినందన కార్యక్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గత పాలకపక్షాన్ని సున్నితంగా విమర్శిస్తూ వారి మాదిరిగా మన ప్రభుత్వంలో ఉండరాదని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు.

గత అసెంబ్లీలో తాను మూడున్నరేళ్లు సభ్యుడుగా ఉన్నాననీ, అప్పట్లో సంఖ్యాపరంగా ప్రతిపక్ష సభ్యులకు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చినా నిమిష నిమిషానికి అడ్డుతగిలేవారని గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. ఈ ప్రభుత్వంలో సంఖ్యాపరంగా కాకుండా ఏ పార్టీ సభ్యుడైనా వారి సమస్యలు, వారి నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని కోరారు.  ప్రజా సమస్యలపై మాట్లాడే టప్పుడు ప్రతిపక్ష సభ్యులకు తగిన సమయం ఇవ్వాలని కోమటిరెడ్డి విజ్ఞప్తి చేశారు. గత అసెంబ్లీలో తనకు జరిగిన చేదు అనుభవాలను చెప్పదల్చుకోలేదని అంటూనే అధికార, ప్రతిపక్ష సభ్యులు అన్న తేడా లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని కోమటిరెడ్డి కోరారు.

CM YS Jagan: చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాన్ లోకల్స్ అంటూ సీఎం వైఎస్ జగన్ ఘాటు విమర్శలు

Related posts

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Chintamaneni: టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని పై మరో కేసు నమోదు

sharma somaraju

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju