NewsOrbit
Entertainment News OTT Telugu TV Serials

Vyuham Web Series Review: సాలెగూడులా పెనవేసుకున్న కేసులు, కథలో ట్విస్టులు…కానీ తుస్సుమన్న వ్యూహం వెబ్ సిరీస్ రివ్యూ! న్యూస్ ఆర్బిట్ రేటింగ్ 2.5/5 స్టార్స్ !

Vyuham Web Series Review

Vyuham Web Series Review: ఆక్సిడెంట్ కాదు హిట్ అండ్ రన్ కేసు అని కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి…ఐపీఎస్ అర్జున్ రామచంద్ర కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తరువాత ట్విస్ట్ మీద ట్విస్టులతో బయటపడిన పెద్ద రహస్యం. ఉద్వేగపూరితంగా చక్కటి స్క్రీన్ ప్లేతో, సాయి సుశాంత్ లాంటి వారి నటనతో ఆహా అనిపిస్తుంది, కానీ మొత్తంగా చూస్తే ఎక్కడో ఏదో లోపం ఉన్నట్లు అనిపించే సిరీస్ వ్యూహం, పూర్తి విశ్లేషణ తో వ్యూహం వెబ్ సిరీస్ రివ్యూ.

Vyuham 2023 Web Series Review
Vyuham 2023 Web Series Review

Vyuham Web Series Review తారాగణం: సాయి సుశాంత్ రెడ్డి మరియు చైతన్య కృష్ణ మనకు లీడ్ లో కనబడుతారు, మైఖేల్ పాత్రలో చైతన్య కృష్ణ, ఐపీఎస్ అధికారి అర్జున రామచంద్ర పాత్రలో సాయి సుశాంత్. పావని గంగిరెడ్డి, ప్రీతీ అస్రాణి, రవీంద్ర విజయ్, శశాంక్ లాంటి ప్రముఖ తారాగణం తో వ్యూహం వెబ్ సిరీస్ నటనకు సంబంధించినంత వరకు మంచి పేరు తెచ్చుకుంది.

శశికాంత్ శ్రీవైష్ణవ్ పీసపాటి దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సుప్రియ యార్లగడ్డ నిర్మించిన వ్యూహం వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతానికి ట్రేండింగ్ లో ఉంది, నటీనటుల ప్రదర్శన శ్రీరామ్ మద్దూరి ఇచ్చిన బాక్గ్రౌండ్ మ్యూజిక్ వ్యూహం కి కలిసొచ్చిన అంశాలు.

Vyuham Review: Amazon Prime Vyuham Web Series Review Vyuham OTT Review
Vyuham Review: Amazon Prime Vyuham Web Series Review Vyuham OTT Review

కథ: 8 భాగాలుగా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వ్యూహం వెబ్ సిరీస్ కథ రాసింది ఈ సిరీస్ డైరెక్టర్ శశికాంత్ శ్రీవైష్ణవ్. కథలోకి వెళ్తే…ఎంతో రిస్క్ అని తెలిసి కూడా మంచి సంపాదన ఉండే ఉద్యోగాలు వదిలిపెట్టి సమాజం లో మార్పు కోసం ఐపీఎస్ అవుతాడు అర్జున్ రామచంద్ర, తనకు మొదటిగా ఎదురైనా క్రైమ్ కేసు అతను ఊహించని విధముగా జీవితాన్నే మార్చేస్తుంది. మైఖేల్ అనే వ్యక్తి ఒక రోజు స్టేషన్ లో ఐపీఎస్ రామచంద్రను కలిసి ఒక కంప్లైంట్ ఇస్తాడు. గర్భవతి అయినా తన భార్యకు ఆక్సిడెంట్ లో జరిగింది చెప్పి, అది ఆక్సిడెంట్ కాదు హిట్ అండ్ రన్ కేసు అని కంప్లైంట్ ఫైల్ చేస్తాడు. ఇలా ఆ కేసు విచారణ మొదలు పెట్టిన అర్జున్ ఒకదాని తరువాత మొరొక రహస్యం తెలుసుకుని వేరే కేసులకు మైఖేల్ ఇచ్చిన కంప్లైంట్ కి సంబంధం ఉంది అని తెలుసుకుంటాడు. ఇప్పుడు అర్జున్ ఈ కేసుల వెనుక ఉన్న అసలు నిజాన్ని కనుక్కుంటాడా అనేదే వ్యూహం వెబ్ సిరీస్ కథ.

Vyooham Web Series:  అమెజాన్ ప్రైమ్ వీడియోలో “వ్యూహం” తెలుగు వెబ్ సిరీస్ స్ట్రీమింగ్..!!

పాజిటివ్ టాక్: కథ మొదలయ్యే విధానం చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మొదటి రెండు ఎపిసోడ్స్ లో స్క్రీన్ ప్లే సస్పెన్స్ అదిరిపోతుంది, ప్రేక్షకుడిని కట్టిపడేసేలా ఉంటుంది. చాలా గ్యాప్ తరువాత మనకు కనిపించి సాయి సుశాంత్ రెడ్డి మిగిలిన నటులతో కలిసి నటన మాత్రం చించేశారు అని చెప్పాలి. శ్రీరామ్ మద్దూరి ఇచ్చిన బీజిఎమ్ మ్యూజిక్ మరో స్థాయిలో ఉంటుంది, జరుగుతున్న కథకు అనుకూలంగా మ్యూజిక్ నడుస్తూ కథలో థ్రిల్ ఇంకా సస్పెన్స్ ఉండేలా చేస్తుంది.

Vyuham Web Series Review
Vyuham Web Series Review

నెగెటివ్ టాక్: మొదటి రెండు ఎపిసోడ్స్ తరువాత కథలో పట్టు తగ్గుతుంది, చాలా కొత్త క్యారెక్ట్ర్స్ రావడంతో పటు అనవసరమైన సాగదీత చూసేవారికి ఆసక్తి తగ్గేలా చేస్తుంది, రెండు ఎపిసోడ్స్ లో చాలా బాగా చూపించిన దర్శకుడు ఆ తరువాత ఏమైందోగాని తుస్సుమనిపించేలా చేసాడు. అయితే ఇక్కడ డైరెక్టర్ కంటే ఎక్కువ తప్పు చేసింది ఎడిటర్ అని చెప్పాలి, ఎడిటర్ పని అంటే అనవసరమైన చేతను కట్ చేసి క్రిస్పీగా కథను మనకు చూపించాలి, అప్పుడు కరకరమని మనం నమిలేస్తాము, కానీ ఇక్కడ ఎడిటర్ ఆలా చేయకుండా కథను బాగా సాగదీసాడు, అయితే సినిమా కాదు కాబట్టి వెబ్ సిరీస్ కి అనుగుణంగా కథను పొడిగించాలి ఆలా అని ఏమి లేని దెగ్గర ఏదో ఉంది అన్నట్లు చూపించే ప్రయత్నం చేస్తే ఇలానే ఉంటుంది.

ఇప్పటి వరకు వ్యూహం వెబ్ సిరీస్ విశ్లేషణ చదివారు…ఇప్పుడు వ్యూహం వెబ్ సిరీస్ చూడాలా వద్దా అనే ప్రెశ్నకు సమాధానం…వ్యూహం కచ్చితంగా చూడండి కొంచెం సాగదీతను పక్కన పెడితే ఇది చక్కటి సస్పెన్స్ కూడిన థ్రిల్లర్ వెబ్ సిరీస్. న్యూస్ ఆర్బిట్ రేటింగ్ 2.5/5 స్టార్స్.

 

 

 

 

Related posts

Brahmamudi May 20 Episode 414: మాయ జోలికి వెళ్లొద్దని వార్నింగ్ ఇచ్చిన రాజ్.. భర్తకి సవాల్ చేసిన కావ్య.. సుభాష్ పశ్చాత్తాపం.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 20 Episode 628: కృష్ణ నిజస్వరూపం అరవింద కు చెప్పిన విక్కి.. విక్కీని అవమానించిన అరవింద..గుడిలో నిజం తెలుసుకున్న అరవింద ఏం చేయనుంది?

bharani jella

Krishna Mukunda Murari May 20 Episode 474: అబార్షన్ చేయించుకున్న ముకుంద.. కృష్ణ మురారిల కోపం.. ముకుందని కొట్టిన కృష్ణ.. ముకుంద బ్లాక్మెయిల్..

bharani jella

Pavitra Jayaram: ప్లీజ్ అలా మాట్లాడకండి.. పవిత్ర జయరాం కూతురు ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న అభినవ్ గోమఠం కామెడీ మూవీ.. మరో మైలురాయి దాటేసిందిగా..!

Saranya Koduri

Padamati Sandhya Ragam: నేను చేసే ఆ పనిని భరిస్తాడు.. అందుకే అతను నాకు ఇష్టం.. సంధ్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Small Screen: గృహప్రవేశం చేసుకున్న బుల్లితెర నటి.. వీడియో వైరల్..!

Saranya Koduri

Chandu: సీరియల్ ని మించిన ట్విస్టులు.. ఇద్దరి పెళ్ళాల ముద్దుల మొగుడు చందు లవ్ స్టోరీ..!

Saranya Koduri

Shobha Shetty: అవకాశాలు లేక.. పైట చెంగు జార వేస్తున్న శోభా శెట్టి..!

Saranya Koduri

NTR: కెరీర్ మొత్తంలో జూ. ఎన్టీఆర్ ను బాగా బాధ‌పెట్టిన మూడు సినిమాలు ఇవే!

kavya N

Allu Arjun: మెగా ఫ్యామిలీకి ఊహించ‌ని షాకిచ్చిన అల్లు అర్జున్‌.. ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్‌..?!

kavya N

Anasuya Bharadwaj: పెళ్ళాంకో న్యాయం చెల్లికో న్యాయమా.. ఆ స్టార్ డైరెక్ట‌ర్ పై రెచ్చిపోయిన అన‌సూయ‌!

kavya N

Santhosham Movie: సంతోషం మూవీలో నాగార్జున కొడుకుగా యాక్ట్ చేసిన బుడ్డోడు ఇప్పుడెలా ఉన్నాడో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Narendra Modi Biopic: వెండితెర‌పై న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌.. ప్ర‌ధాని పాత్ర‌లో పాపుల‌ర్ యాక్ట‌ర్‌!?

kavya N

Chandu: అర్ధరాత్రి 12 గంటలకు చందు నుంచి నాకు మెసేజ్ వచ్చింది.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్..!

Saranya Koduri