NewsOrbit
జాతీయం న్యూస్

Swati Maliwal: ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ ను రాజ్యసభకు నామినేట్ చేసిన ఆప్

Swati Maliwal: దేశ రాజధాని ఢిల్లీ సహా ఈశాన్య రాష్ట్రం సిక్కింలో ఖాళీ అవ్వనున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ  నెల 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముగ్గురు అభ్యర్ధులను ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నామినేట్ చేసింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మాలీవాల్ తమ రాజ్యసభ అభ్యర్ధిగా నామినేట్ చేస్తున్నట్లు పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

ఢిల్లీలోని మూడు రాజ్యసభ స్థానాలకు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సంజయ్ సింగ్, సునీల్ కుమార్ గుప్తా, నారాయణ్ దాస్ గుప్తా ప్రాతినిధ్యం వహిస్తుండగా, వీరి ఆరేళ్ల పదవీ కాలం ఈ నెల 27వ తేదీతో ముగియనుంది. దీంతో వీటికి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సుశీల్ కుమార్ గుప్తా ఈ ఏడాది చివర్లో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దృష్టి సారించాలని నిర్ణయించడంతో ఆ స్థానం నుండి స్వాతి మాలివాల్ ను పార్టీ ఎంపిక చేసింది.

సంజయ్ సింగ్, నారాయణ్ దాస్ గుప్తా ను వరుసగా రెండో సారి నామినేట్ చేస్తున్నట్లు ఆప్ తెలిపింది. అయితే సంజయ్ సింగ్ ప్రస్తుతం మనీలాండరింగ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నారు. తాను రెండో సారి రాజ్యసభకు వెళ్లేందుకు వీలుగా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రీనామినేషన్ పత్రాలప సంతకం చేసేందుకు తనకు అనుమతి ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించింది. ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు గానూ ఈ నెల 2వ తేదీన ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 9వ తేదీలోగా నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలి.

Breaking: భారతి సిమెంట్స్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju