NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan: ఊపిరి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే – ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

YS Jagan: తన వ్యాఖ్యలు వక్రీకరించి ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసిందంటూ శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు జగనన్న మాటే శిరోధార్యమని పేర్కొన్నారు. ఊపిరి ఉన్నంత వరకూ జగనన్న బాటలోనే నడుస్తానని స్పష్టం చేశారు. రీసెంట్ గా తన ఫెస్ బుక్ లైవ్ వీడియో లో మాట్లాడిన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించి బురదజల్లే ప్రయత్నం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ దళిత మహిళగా నియోజకవర్గ సమస్యలను ప్రశ్నించడం నేరమా అని ప్రశ్నించారు.

ఎమ్మెల్యే పద్మావతి తన భర్త అలూరు సాంబశివారెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యారు. అనంతరం వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తాను ఫేస్ బుక్ లైవ్ లో నీటి కేటాయింపుపై మాత్రమే మాట్లాడానని చెప్పారు. స్థానిక అధికారులు సమస్యల పరిష్కారంపై సక్రమంగా స్పందించడం లేదనే ఆవేదనతో మాట్లాడానని పేర్కొన్నారు. అయితే తన ఆవేదనను ఎల్లో మీడియా పూర్తిగా వక్రీకరించి హైలెట్ చేసిందన్నారు. తాను సీఎం వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా ఏమీ మాట్లాడలేదని అన్నారు.

ఎల్లో మీడియాలో ప్రచారంలో ఉన్న అంశాలు ఏవీ నిజం కాదనీ వాటిని ఖండిస్తున్నానన్నారు పద్మావతి. ఇప్పటి వరకూ కూడా జగనన్న తన కుటుంబ సభ్యుల్లాగా, సొంత చెల్లెలుగా తనను చూసుకుంటున్నారని తెలిపారు. వారు చెప్పింది వేదవాక్కుగా పని చేయడమే తప్ప.. ఏనాడూ వారికి దిక్కరించే మనస్థత్వం నాది కాదని స్పష్టం చేశారు ఎమ్మెల్యే పద్మావతి. సీఎం జగన్ తనను మరలా శింగనమల నియోజకవర్గం నుండి ఎన్నికల్లో పోటీ చేయమన్నా చేస్తాననీ, లేదంటే వేరొకరికి అవకాశమిస్తామన్నా తాను అసెంబ్లీ సీటు వదులుకుని పార్టీకి పని చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు.

తాను వైసీపీ వీడిపోతున్నట్లు, జగనన్న ను వ్యతిరేకిస్తున్నట్లు భిన్న కథనాలు ఎల్లో మీడియాలో రావడం తనకు ఆశ్చర్యం కల్గించిందని పద్మావతి అన్నారు. ఎస్సీలకు జగనన్న చేసిన మేలు రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే గుర్తిండిపోయేలా చేశారని అన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలు జగనన్న పరిపాలన పట్ల చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు.

YSRCP: రాజ్యసభ అభ్యర్ధుల ఖరారు చేసిన వైసీపీ

Related posts

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju