NewsOrbit
జాతీయం న్యూస్

Ayodhya Ram Mandir: అయోధ్యలో ముగ్గురు అనుమానిత ఉగ్రవాదుల అరెస్టు..!

Ayodhya Ram Mandir: అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వేళ ముగ్గురు అనుమానితులు పోలీసులకు చిక్కారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ గురువారం రాత్రి అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. ఉత్తరప్రదేశ్ డీజీపీ (లా అండ్ ఆర్డర్) ప్రశాంత కుమార్ ఈ విషయాన్ని మీడియాకు తెలిపారు.

రొటీన్ తనిఖీలు నిర్వహిస్తుండగా, ముగ్గురు సందేహాస్పదంగా తిరుగుతూ కనిపించారని ఆయన చెప్పారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని ప్రశాంత్ కుమార్ తెలిపారు. అయితే ఆ ముగ్గురి వివరాలు గానీ.. విచారణకు సంబంధించిన విషయాలపై గానీ ఇంకా ప్రకటన వెలువడలేదు.

అయితే పట్టుబడిన వారిలో ఒకరు రాజస్థాన్ కు చెందిన ధర్మవీర్ గా గుర్తించారు. మిగతా ఇద్దరు అనుమానితుల వివరాలు తెలియాల్సి ఉంది. వీరు అయోధ్యకు ఎందుకు వచ్చారు..ఎమైనా అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నారా..వీరి వెనుక ఎవరెవరు ఉన్నారు..తదితర విషయాలు తెలుసుకునేందుకు ఏటీఎస్ తో పాటు వివిధ విభాగాలకు చెందిన భద్రతా సిబ్బంది విచారణ చేపట్టారు.

జనవరి 22న అయోధ్య రామ మందిరంలో రామ్ లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. వారణాసికి చెందిన పూజారి లక్ష్మీకాంత్ దీక్షిత్ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా జరగనున్న ఈ కార్యక్రమానికి 11 వేల మంది అతిధులుగా హజరు కానున్నారు. ఆహ్వానాలు వెళ్లిన వారిలో రాజకీయ, సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు కూడా ఉన్నారు. దీంతో యూపీ పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది. పదివేల మంది పోలీసులతో పాటు కేంద్ర బలగాలు పహరాలో .. సీసీ కెమెరాల నిఘా నీడలో అయోధ్య ఉంది.

Revanth Reddy: రేణుకమ్మా జాతీయ పార్టీ కాంగ్రెస్ లో అది సాధ్యమా..?

Related posts

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?

కేంద్రం చేతిలోకి హైదరాబాద్.. ఇక తెలంగాణ ప‌ని ఇలా ఖ‌తం కానుందా..?

వైసీపీ నాని Vs టీడీపీ రాము : గుడివాడ ఓట‌రులో ఈ మార్పు చూశారా…!

CM Revanth Reddy: ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలపై తెలంగాణ సీఎం రేవంత్ కౌంటర్లు ఇలా

sharma somaraju

YS Sharmila: భావోద్వేగంతో జగనన్న వ్యాఖ్యలకు షర్మిల కౌంటర్

sharma somaraju

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N