NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

క‌మ్మ‌ల‌కు జీరో సీట్లు… ఆ ఒక్క‌డే వైసీపీలో మిగిలిపోయాడు…!

వైసీపీ అధినేత జ‌గ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో కంప్లీట్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఫాలో అయిపోతూ టిక్కెట్లు ఇస్తున్నాడు. కంప్లీట్ బీసీ స్ట్రాట‌జీతో ముందుకు వెళుతోన్నారు. అసెంబ్లీ, పార్ల‌మెంటు సీట్ల కేటాయింపు చూస్తుంటేనే జ‌గ‌న్ సోష‌ల్ ఇంజ‌నీరింగ్ ఎలా ఉందో క్లీయిర్‌గా తెలుస్తోంది. మొత్తం 25 పార్ల‌మెంటు సీట్ల‌లో ఉత్త‌రాంధ్ర‌లో శ్రీకాకుళం నుంచి మొద‌లు పెడితే శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, విశాఖ‌, అన‌కాప‌ల్లి, రాజ‌మండ్రి, న‌ర‌సాపురం, ఏలూరు, న‌ర‌సారావుపేట‌, హిందూపురం, అనంత‌పురం, క‌ర్నూలు సీట్ల‌ను బీసీల‌కే ఇచ్చేశారు.

25 సీట్ల‌లో ఏకంగా 11 ఎంపీ సీట్లు బీసీల‌కే ఇచ్చారు. మిగిలిన వాటిలో అమ‌లాపురం, బాప‌ట్ల‌, తిరుప‌తి, చిత్తూరు ఎస్సీ సీట్లు. కాపుల‌కు గుంటూరు, కాకినాడ‌, బంద‌రు సీట్లు ఇచ్చారు. క‌మ్మ సామాజిక వ‌ర్గం ఈ సారి పూర్తిగా వైసీపీకి యాంటీగా ఉంటుంద‌ని జ‌గ‌న్ లెక్క‌లు వేసుకుంటున్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందు నుంచే జ‌గ‌న్ క‌మ్మ వ‌ర్గాన్ని బాగా టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. ఈ ఐదేళ్ల‌లో క‌మ్మ‌ల‌కు రెండే ఎమ్మెల్సీలు మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌, త‌ల‌శిల ర‌ఘుకు మాత్ర‌మే ఇచ్చారు.

ఇక గ‌త ఎన్నిక‌ల్లో విశాఖ‌, విజ‌య‌వాడ‌, న‌ర‌సారావుపేట పార్ల‌మెంటు సీట్ల‌ను జ‌గ‌న్ క‌మ్మ‌ల‌కు ఇచ్చారు. విశాఖ‌, న‌ర‌సారావుపేట‌లో గెలిచిన వైసీపీ, విజ‌య‌వాడ‌లో ఓడిపోయింది. అయితే ఈ సారి జ‌గ‌న్ ఒక్క క‌మ్మ‌ల‌కు కూడా పార్ల‌మెంటు సీటు ఇవ్వ‌కూడ‌ద‌ని ముందే డిసైడ్ అయిపోయారు. అయితే విజ‌య‌వాడ టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని అనూహ్య ప‌రిణామాల‌తో వైసీపీలోకి వ‌చ్చారు. దీంతో నానికి ఎంపీ టిక్కెట్ కేటాయించ‌డంతో వైసీపీ నుంచి ఎంపీ టిక్కెట్ ద‌క్కించుకున్న ఏకైక క‌మ్మ నేత‌గా నాని మిగిలిపోయారు.

వాస్త‌వానికి జ‌గ‌న్ విజ‌య‌వాడ పార్ల‌మెంటు సీటు కూడా బీసీల్లో గౌడ‌ల‌కు ఇవ్వాల‌ని అనుకున్నారు. నాని వైసీపీలోకి రావ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో మాత్ర‌మే కేశినేని నానికి సీటు ఇచ్చారు. నాని పార్టీ మార‌కుండా ఉండి ఉంటే అస‌లు వైసీపీ నుంచి పార్ల‌మెంటు సీట్ల‌లు క‌మ్మ‌ల‌కు ప్రాథినిత్య‌మే లేకుండా ఉండేది. ఏదేమైనా క‌మ్మ ఓటింగ్ ఈ సారి త‌మ‌కు ప‌డ‌ద‌ని జ‌గ‌న్ పూర్తిగా డిసైడ్ అయిపోయే సోష‌ల్ ఇంజ‌నీరింగ్‌లో వాళ్ల‌ను పూర్తిగా ప‌క్క‌న పెట్టేసిన‌ట్టే క‌నిపిస్తోంది.

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju