Balayya: నందమూరి నట సింహం బాలయ్య గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఇక ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రస్తుత కాలంలో కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీని ఇస్తున్నాడు. బాలయ్య సినిమాలు సాధారణంగా నిర్మాతలకు లాభాలను మిగులుస్తాయి. అయితే బాలయ్య మీద ఎన్నో ఆశలు పెట్టుకుని సినిమా ప్రారంభించిన.. ప్రారంభించకపోయినా కొందరి నిర్మాతలకు నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే ఆ సినిమాలు మధ్యలో ఆగిపోతాయి కనుక. నిజానికి ఆ సినిమాలు కనుక రిలీజై ఉంటే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తాయేమో. బాలయ్య మొదలు పెట్టి మధ్యలో ఆగిపోయిన సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
1. నటరత్న:
1986లో నిర్మాత జి. సుబ్బారావు ఈ సినిమాని డైరెక్ట్ చేద్దామని అనుకున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్ ని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా ఈ సినిమా షూటింగ్ ని అమెరికాలో సిద్ధం చేద్దామని ప్లాన్ చేసుకున్నారు. కానీ వీసాలు రావడం ఆలస్యం అయ్యింది. ఇక మరో పక్క బాలయ్య వేరే ప్రాజెక్టులతో బిజీ అయిపోవడంతో ఈ సినిమా విషయమే మర్చిపోయారు.
2. శపథమ్:
గోపాల్ రెడ్డి మరియు సుధాకర్ రెడ్డి కలిసి బాలయ్యను హీరోగా పెట్టి ఈ సినిమాని తీద్దామని అనుకున్నారు. అదేవిధంగా ఈ సినిమా త్రీడి సినిమా గా రూపొందిద్దామని ప్లాన్ చేశారు. ఇక ఈ సినిమా అనివర్ణ కారణాల చేత మధ్యలోనే ఆగిపోయింది.
3. అశోకచక్రవర్తి:
ప్రముఖ నిర్మాత కొంగంటి హరికృష్ణ బాలయ్యతో ” బాలకృష్ణుడు ” మూవీ చేస్తున్నట్లు ఒకానొక సమయంలో ప్రకటించారు. ఇక ఎస్ .ఎస్ రవి చందర్ ను దీనికి దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇక కథ కూడా పూర్తి చేశారు. ఇక అశోక్ చక్రవర్తి మరియు ధ్రువ నక్షత్రం సినిమాలు ఒకే కథతో వచ్చాయి. అదే విధంగా ఇవి రెండు కూడా ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఇక ఈ విషయం తెలిసిన బాలయ్య బాగా కోప్పడ్డాడు. రెండు కథలు ఎలా ఒక్కటయ్యాయని ఫైర్ అయ్యాడు. ఇక అనంతరం బాలకృష్ణుడు సినిమా చేయడానికి ఒప్పుకోలేదు.
4. విక్రమ సింహ భూపతి:
భార్గవ్ ఆర్ట్ ప్రొడ్యూసర్ గోపాల్ రెడ్డి మరియు బాలయ్య కాంబినేషన్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ప్లాన్ చేసిన ఈ మూవీ కి టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు. ఇక ఈ సినిమా కూడా అనివర్ణ కారణాల చేత మధ్యలోనే ఆగిపోయింది.
ఇలా బాలయ్య కెరీర్ లో మరిన్ని సినిమాలు ఉన్నాయి. ఇక ఈ సినిమాలు కనుక రిలీజ్ అయితే పక్కా హిట్ అయ్యేవేమో.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!