Eagle: ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారిలో మాస్ మహారాజు రవితేజ ఒకరు. తన నటన ,మంచితనంతో ఎంతో మంది ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు రవితేజ. ఇక గత ఏడాది టైగర్ నాగేశ్వరరావు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అదేవిధంగా ఈనెల 9న ” ఈగల్ ” సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సంగతి తెలిసిందే.
ఇక మంచి కథ ప్రాధాన్యత ఉన్న పాత్ర రవితేజ ఖాతాలో పడితే ఎలాంటి కలెక్షన్స్ రాబడతాయో ఆ సినిమాలు ధమాకాని ఎగ్జాంపుల్ కింద తీసుకోవచ్చు.ఇక రవితేజ తాజాగా నటించిన మూవీ ఈగల్ ని పీపుల్ మీడియా భారీ బడ్జెట్ తో నిర్మించింది. హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా రవితేజ మూవీస్ మీద రీసెంట్ బిజినెస్ ఈ మధ్యకాలంలో జరుగుతుంది.
యావరేజ్ గా చూసుకుంటే 19 నుంచి 22 కోట్ల మధ్య రవితేజ సినిమాలపై డిస్ట్రిబ్యూటర్స్ పెట్టుబడికి ముందుకొస్తున్నారు. ఇక ఈగల్ మూవీ కి 21 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ విషయానికి వస్తే..రూ.6.2 కోట్లు ఇండియాలో కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా రూ. 12 కోట్లను మొదటి రోజు సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా సక్సెస్ ట్రాక్ లో వెళ్తుంది.
ఇక గతంలో టైగర్ నాగేశ్వరరావు సినిమాకి డిస్ట్రిబ్యూటర్ హక్కులు భారీగానే జరిగాయి. కానీ ఆ సినిమా కొన్నిచోట్ల మెప్పించినప్పటికీ మరికొన్ని చోట్ల మాత్రం మెప్పించలేకపోయింది. ఏదేమైనా రవితేజ హిట్ అండ్ ఫ్లాప్ అనేది పట్టించుకోకుండా దాదాపు సంవత్సరానికి రెండు సినిమాలు రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాడు. తన ఇమేజ్ పోతుంది ఏమో అని కూడా ఆలోచించకుండా కొత్త దర్శకులకి ఛాన్స్ ఇస్తూ మనసున్న సెలబ్రిటీ అనిపించుకుంటున్నాడు.