NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Election commission: గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు ఉపయోగించుకోవచ్చు .. కానీ  

Election commission: ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు ఉపయోగించుకునే అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ఎన్నికల సంఘం గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి ఎన్నికల విధులను అప్పగించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Election commission

అయితే ఎన్నికలకు సంబంధించి ప్రధాన విధులు వారికి అప్పగించవద్దని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటర్లకు ఇంకు రాసే పనులు లాంటి విధులను మాత్రమే అప్పగించాలని తెలిపింది. దీనికి సంబంధించి ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా కీలక సూచనలు చేశారు.

అర్హులైన గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిని పోలింగ్ పార్టీలుగా సార్వత్రిక ఎన్నికల్లో విధులు అప్పగించవచ్చని తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకూ కీలక సూచనలు జారీ చేశారు. ప్రతీ పోలింగ్ పార్టీలోనూ అర్హులైన ఒక రెగ్యులర్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగిని నియమించుకోవచ్చని వెల్లడించింది. బీఎల్ఓలుగా వ్యవహరించిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులను పోలింగ్ విధుల్లోకి తీసుకోవద్దని ఈసీఐ స్పష్టం చేసింది.

బీఎల్ఓలకు పోలింగ్ రోజున వారికి ఎన్నికల విధులు కాకుండా ఇతర విధులు అప్పగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పింది. గ్రామ వార్డు వలంటీర్లకు ఎలాంటి పరిస్థితుల్లోనూ ఎన్నికల సంబంధిత విధులు అప్పగించ వద్దని స్పష్టం చేసింది. అభ్యర్ధులకు పోలింగ్ ఏజెంట్లుగానూ వలంటీర్లను అనుమతించవద్దని స్పష్టం చేసింది.

Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు ..’మరో పదేళ్లు సీఎంగా ఉంటా’

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?