NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోహ‌మాటానికి పోతోన్న చంద్ర‌బాబు… చివ‌ర‌కు వ‌చ్చేది ఏంటో తెలుసుగా..!

రాజ‌కీయాల్లో వ్యూహాలు.. ప్ర‌తివ్యూహాలు మాత్ర‌మే ఉండాలి. మొహ‌మాటాలు అస్స‌లు ప‌నికిరావు. ఈ విష యం ఢిల్లీ నుంచి గ‌ల్లీ వ‌రకు అన్ని పార్టీలు అనుస‌రిస్తున్న విధాన‌మే. తెలంగాణ‌లో మొహ‌మాటాల‌కు పోయి.. కేసీఆర్ చేతులు కాల్చుకున్నారు. మూడో సారి ముచ్చ‌టైన అధికారం ద‌క్కుతుంద‌ని భావించి కూడా.. ఓడిపోయారు. ఇక‌, కేంద్రంలోని మోడీని చూస్తే.. ఆయ‌న‌కు అస్స‌లు మొహ‌మాటం లేదు. తాను ఎంపిక చేసేప్పుడే.. జాగ్ర‌త్త ప‌డ‌తారు.. తేడా వ‌స్తే.. ప‌క్క‌న పెడతారు. ఇక‌, ఏపీలో సీఎం జ‌గ‌న్ కూడా ఇదే త‌ర‌హా ప‌రిస్థితిలో ముందుకు సాగుతున్నారు.

పార్టీ ప‌రంగా.. నాయ‌కుల ప‌రంగా ఒత్తిడి వ‌చ్చినా.. సీఎం జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. గెలుపు గుర్రాల‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇస్తున్నారు. కానీ, ఎటొచ్చీ టీడీపీలో మాత్రం మొహ‌మాటాల‌కు పొతున్న ప‌రిస్థితి క‌ని పిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌త ఎన్నిక‌ల్లోనూ ఇదే త‌ర‌హా మొహ‌మాటాల‌కు పోయి.. చేతులు కాల్చుకున్నారు. అప్ప‌ట్లో కొంద‌రు ఎమ్మెల్యేల‌పై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. అయినా.. వారినే కొన‌సాగిం చారు. దీంతో టీడీపీ ఘోరంగా వెనుక‌బ‌డింది.

ఇక‌, ఇప్పుడు కూడా టికెట్ల వ్య‌వ‌హారంలో మొహ‌మాటాల‌కే ప్రాధాన్యం ఇస్తున్నార‌నే టాక్ వినిపిస్తోంది. తునిలో య‌న‌మ‌ల కుటుంబం ఫేడ్ అవుట్ అయిపోయింది. కొన్నాళ్లుగా ఈ క‌టుంబం ఇక్క‌డ గెలుపు గుర్రం ఎక్క‌డం లేదు. అయినా.. ఈ కుటుంబానికే టికెట్ ఇస్తున్నారు. య‌న‌మ‌ల దివ్య పేరు దాదాపు ఖ‌రారు చేశారు. ఇక‌, ఉమ్మ‌డి క‌డ‌ప జిల్లాలోని మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గం కూడా.. మొహ‌మాటానికి కేంద్రంగా మారింది. పుట్టా సుధాక‌ర్ యాద‌వ్ వ‌రుస‌గా ప‌రాజ‌యం పాల‌వుతున్నారు. ఈసారీ ఆయ‌న‌కే టికెట్ కేటాయించారని తెలిసింది.

విజ‌య‌వాడ తూర్పులో సిట్టింగ్ ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఈ ద‌ఫా గెలుపు గుర్రం ఎక్క‌డం క‌ష్ట‌మ‌నే వాద‌న సొంత పార్టీలోనే ఉంది. పైగా ఇక్క‌డ స‌మీక‌ర‌ణ‌లు మారాయి. ఈ క్ర‌మంలో అభ్య‌ర్థిని మార్చి వేరే వారికి ఇస్తే.. కొంత బెట‌ర్ అంటున్నారు. అయినా.. గ‌ద్దె వైపే పార్టీ నిల‌బ‌డింది. దీంతో క‌మ్మ వ‌ర్గంలో చీలిక రానుంద‌ని తెలుస్తోంది. అదేవిధంగా తిరువూరులోనూ ఇదే ప్ర‌యోగం చేస్తున్నారు. శ్యావ‌ల దేవ‌ద‌త్‌ను ముందు నియ‌మించి.. ఇప్పుడు పొరుగు జిల్లాకు చెందిన కొలిక‌పూడి శ్రీనివాస‌రావుకు టికెట్ ఇస్తామ‌ని చెబుతున్నారు.

సో.. ఇవ‌న్నీ.. కూడా ఏదో చేస్తున్నాం.. ఈక్వేష‌న్లు మారుస్తున్నామ‌ని చెబుతున్నా.. అంత‌ర్గ‌తంగా పార్టీలో నైరాశ్యం పెరిగేందుకు దారితీస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీలకులు. ఇక చివ‌ర‌గా చంద్ర‌బాబు ఈ సారి కూడా పార్టీకి చావో రేవో అయిన‌ప్పుడు కూడా మొహ‌మాటాల‌కు పోతే జ‌రిగేదేంటో తెలుసుగా అని పార్టీ నేత‌లే విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

Related posts

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju