NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ పాలిటిక్స్‌లోకి రేవంత్ రెడ్డితో పాటు ఆ ఇద్ద‌రు టాప్ లీడ‌ర్లు ఎంట్రీ…!

త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో ఏపీలో పుంజుకోవాల‌ని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యూహాల‌కూ ప‌దును పెంచుతోంది. 2014లో ఎక్క‌డైతే.. నామ‌రూపాలు లేకుండా పోయిందొ.. అక్క‌డే పార్టీ పుంజుకోవాల‌ని భావిస్తోంది. ఈ క్ర‌మంలో అనూహ్యంగా వైఎస్ కుమార్తె ష‌ర్మిల‌ను రంగంలోకి దింపిన కాంగ్రెస్ పెద్ద‌లు.. అక్క‌డితో ప‌నిముగించ‌లేదు. ఇప్పుడు కీల‌క‌మైన నాయ‌కుల‌ను కూడా ఏపీకి పంపుతోం ది. వారితో ప్ర‌చారం చేయిస్తోంది.

Revanth Reddy, those two top leaders entered AP politics.
Revanth Reddy, those two top leaders entered AP politics.

సోమ‌వారం నుంచి వ‌రుస‌గా.. ప్రాంతీయ స‌మ‌న్వ‌య క‌మిటీల స‌మావేశాల‌కు కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేసింది. వీటితోపాటు.. మూడు ప్రాంతాల్లో (ఉత్త‌రాంధ్ర‌-కోస్తా-రాయ‌ల‌సీమ‌) భారీ బ‌హిరంగ స‌భ‌ల‌కు కూడా తెర‌దీ సింది. ఈ క్ర‌మంలో ఆయా స‌భ‌ల‌కు అతిర‌థ మ‌హార‌థులు వంటి జాతీయ నాయ‌కుల‌తోపాటు..పొరుగున ఉన్న క‌ర్ణాట‌క‌, తెలంగాణ ముఖ్య‌మంత్రుల‌ను కూడా ల్యాండ్ చేయిస్తోంది. వారి ప్ర‌సంగాలు.. ఆయా రాష్ట్రాల్లో జ‌రుగుతున్న సంక్షేమం వంటివాటిపై కాంగ్రెస్ దృష్టి పెట్ట‌నుంది.

క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆరు, ఏడు హామీల‌ను అమ‌లు చేస్తున్న విష‌యం తెలి సిందే. దీంతో ఆయా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పుంజుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ క్ర‌మంలోఅలాంటి ప‌థ‌కాల‌నే ఏపీలోనూ అమ‌లు చేస్తామ‌ని చెప్ప‌డం ద్వారా..ఇక్క‌డ పునాదులు వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేప‌డుతోంది. ముఖ్యంగా ఏపీకి ప్ర‌ధాన డిమాండ్లుగా ఉన్న పోల‌వ‌రం నిర్మాణం, ప్ర‌త్యేక‌హోదా, విశాఖ స్టీల్ క‌ర్మాగారాన్ని ప్రైవేటు ప‌రంగా చూడ‌డం కాంగ్రెస్ అజెండాలో కీల‌కంగా ఉన్నాయి.

Revanth Reddy, those two top leaders entered AP politics.
Revanth Reddy, those two top leaders entered AP politics.

ఇదేస‌మ‌యంలో ఇత‌ర హామీలైన‌.. ఉచిత ఆర్టీసీ బ‌స్సు ప్ర‌యాణాల‌ను ప్ర‌క‌టించాల‌ని అనుకున్నా.. ఇప్ప‌టికే దీనిని టీడీపీ-జ‌న‌సేన కూట‌మి తీసేసుకుంది. ఈ నేప‌థ్యంలో మ‌రిన్ని ప‌థ‌కాల‌కు కాంగ్రెస్ శ్రీకారం చుట్టే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఇదిలావుంటే.. పార్టీ జాతీయ అధ్య‌క్షుడు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి, క‌ర్ఱాట‌న ముఖ్య‌మంత్రి సిద్ద‌రామ‌య్య‌, డిప్యూటీ సీఎం శివ‌కుమార్‌లు ఏపీకి స్టార్ క్యాంపెయిన‌ర్లుగా మార‌నున్నారు. మ‌రి ఏమేర‌కు ఫ‌లితం ద‌క్కుతుందో చూడాలి.

Related posts

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?