NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

YSRCP: ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో లపైనే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. ఆయా రాజకీయ పార్టీలు ప్రకటించే హామీల పట్ల ప్రజలు ఆకర్షితులు అవుతుంటారు. కర్ణాటక అసెంబ్లీ సమయంలో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, తక్కువ ధరకు వంట గ్యాస్ సిలెండర్ వంటి హామీలకు ప్రజలు ఆకర్షితులు అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం గట్టారు. దీంతో అటువంటి హామీలనే తెలంగాణ కాంగ్రెస్ కూడా అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ప్రకటించింది. తెలంగాణలో ప్రజలు ఆ హామీలను నమ్మారు. కాంగ్రెస్ ను గెలిపించారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత ఏపీలో తెలుగుదేశం పార్టీ అక్కడి కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో కొన్నింటిని కాపీ కొట్టడంతో పాటు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు పేరు మార్పు చేసి ఎక్కువగా లబ్ది చేకూర్చే విధంగా మినీ మేనిఫెస్టోను విడుదల చేసింది. సూపర్ సిక్స్ పేరుతో వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళుతున్నారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి తెలంగాణలో మంచి స్పందన లభిస్తొంది. లక్షలాది మంది మహిళలు ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ ఇంత వరకూ పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఇంకా విడుదల చేయలేదు.

ys-jagan

టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో ఉమ్మడి మేనిఫెస్టోను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మరో పక్క బీజేపీతో దోస్తీకి ప్రయత్నిస్తున్నందున ఆ అంశం ఫైనల్ అయ్యే వరకూ ఆగాలని ఆలోచన చేస్తుంది. అధికార వైసీపీ మేనిఫెస్టో ప్రకటనకు మూహూర్తం ఖరారు చేసింది. గత ఎన్నికల సమయంలోనే జగన్ ..మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా చూస్తామని చెప్పడంతో పాటు మేనిఫెస్టోలో ప్రకటించిన నవరత్న పథకాలకు అమలు చేసి చూపించారు. మేనిఫెస్టోలో ప్రకటించిన వాటిలో 99శాతం అమలు చేసినట్లుగా వైసీపీ ఘంటాపథంగా చెబుతోంది.

YS Jagan

దీంతో ప్రజలను మరింతగా ఆకర్షించేందుకు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఎటువంటి హామీలతో మేనిఫెస్టో ప్రకటిస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టోకు చట్టబద్దత లేకపోవడంతో ఇచ్చిన హామీల్లో కొన్నింటిని తుంగలో తొక్కినా చేసేది ఏమీ లేదు. అందుకే ఆచరణ సాధ్యం కాని హామీలను ఇస్తుంటారు. ఆ తర్వాత దానిపై ఏదో కవర్ చేసుకుంటారు. వివిధ వర్గాలను ఆకట్టుకునేలా హామీలను ఇస్తుంటాయి రాజకీయ పార్టీలు.

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టోలో ప్రకటించిన అనేక అంశాలను గాలికి వదిలివేశారు. అలానే ఉద్యోగ వర్గాలను ఆకట్టుకునేందుకు గత ఎన్నికలకు ముందు జగన్మోహనరెడ్డి ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని నెరవేర్చడం సాధ్యం కాదని చేతులు ఎత్తేశారు. ఇలాంటివి రెండు మూడు మినహా దాదాపు మేనిఫెస్టోలో ప్రకటించిన అన్ని హామీలను జగన్మోహనరెడ్డి సర్కార్ నెరవేర్చడంతో ఈ సారి ఎటువంటి హామీలను మేనిఫెస్టోలు ప్రకటిస్తారు అనే దానిపై ప్రజలతో పాటు రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇంతకూ వైసీపీ మేనిఫెస్టో ప్రకటన ఎప్పుడు.. ఎక్కడ అనే విషయానికి వస్తే..

బాపట్ల జిల్లా మేదరమిట్ల వద్ద ఈ నెల పదో తేదీన సిద్దం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ లను శనివారం వైసీపీ నేతలు విడుదల చేశారు. ఈ సభలో నాలుగు సంవత్సరాల పది నెలల్లో వైసీపీ సర్కార్ చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వివరిస్తారు. ఈ సభలోనే వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారు. ఈ విషయాన్ని పార్టీ కీలక నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. గతంలో ఏమి చేశాం.. రాబోయే కాలంలో ఏమి చేస్తామో సీఎం జగన్ వివరిస్తారని ఆయన తెలిపారు.

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

Related posts

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N