NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఏపీలో బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఫిక్స్‌… పోటీ చేసే క్యాండెట్లు వీళ్లే…!

ఏపీలో టీడీపీ – జ‌న‌సేన కూట‌మిలోకి బీజేపీ వ‌చ్చి చేరింది. ఈ మూడు పార్టీల పొత్తు దాదాపు ఖ‌రారైంది. చంద్ర‌బాబు బీజేపీ, జ‌న‌సేన కూట‌మికి 30 అసెంబ్లీతో పాటు 8 పార్ల‌మెంటు సీట్లు ఇస్తున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేశారు. పొత్తులో భాగంగా జ‌న‌సేన 24 అసెంబ్లీ సీట్ల‌తో పాటు 3 పార్ల‌మెంటు స్థానాల్లో పోటీ చేస్తుంద‌ని ముందు ప్ర‌క‌టించారు. ఇక బీజేపీ 5 పార్ల‌మెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. అయితే బీజేపీ 6 పార్ల‌మెంటు సీట్లు అడ‌గ‌డంతో ముందుగా జ‌న‌సేన తీసుకున్న అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు స్థానాన్ని జ‌న‌సేన త్యాగం చేసి బీజేపీకి ఇచ్చేలా చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ లెక్క‌న చూస్తే బీజేపీ మొత్తం 6 పార్ల‌మెంటు, 6 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయ‌నుంది. బీజేపీ పోటీ చేయబోతున్నట్లుగా భావిస్తున్న ఆరు ఎంపీ నియోజకవర్గాలు కూడా ఖరారు అయ్యాయ‌ని.. ఆ ఆరు నియోజ‌క‌వ‌ర్గాల‌కు అభ్య‌ర్థులు కూడా ఫిక్స్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. అరకు, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, హిందూపురం, ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ సీట్లను టీడీపీ బీజేపీకి కేటాయించింద‌ని అంటున్నారు.

వాస్త‌వంగా బీజేపీ విజయవాడ, విశాఖపట్నం సీట్ల కోసం గ‌ట్టిగా ప‌ట్టుబ‌ట్టింది. గ‌తంలో విశాఖ ఎంపీ సీటును బీజేపీ గెలుచుకుంది కూడా..! అయితే చంద్ర‌బాబు ఈ సారి ఈ రెండు సీట్లు బీజేపీకి ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. విజ‌య‌వాడ టీడీపీ కంచుకోట‌.. అక్క‌డ త్యాగం చేసేందుకు బాబు ఇష్ట‌ప‌డ‌లేదు. ఇక వైజాగ్‌లో బాల‌య్య చిన్న‌ల్లుడు భ‌ర‌త్ గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 3 వేల ఓట్ల స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. ఈ సారి భ‌ర‌త్‌కు ఆప్ష‌న్ లేదు. అందుకే ఈ సీటు వ‌దులుకోవ‌డం టీడీపీకి ఇష్టం లేదు. ఇక‌ విజయవాడ టీడీపీ అభ్యర్థిగా కేశినేని చిన్ని పేరు దాదాపు ఖరారు అయ్యింది.

ఇక బీజేపీ పోటీ చేసే ఆరు స్థానాల‌కు అభ్య‌ర్థులు కూడా దాదాపు ఫిక్స్ అయిన‌ట్టే. అరకు స్థానం నుంచి గీత రేసులో ఉన్నారు. ఆమె 2014లో ఇదే సీటు నుంచి వైసీపీ త‌ర‌పున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. ఇక అనకాపల్లి నుంచి ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పేరు రేసులో ఉంది. ఆయ‌న వెల‌మ సామాజిక వ‌ర్గానికి చెందిన వారు.. పైగా క‌డ‌ప జిల్లా వాసి.. అన‌కాప‌ల్లి పార్ల‌మెంటు ప‌రిధిలో కొప్పుల వెల‌మ‌లు ఎక్కువ‌. ఈ కోటాలో ఆయ‌న ఇక్క‌డ పోటీ చేసే ప్లాన్‌లో ఉన్నారు.

ఇక రాజమండ్రి నుంచి ఆ పార్టీ ఏపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వరి, కడప జిల్లా రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డి లేదా సాయి లోకేష్, హిందూపూరం నుంచి – సత్య కుమార్ లేదా పరిపూర్ణానంద స్వామి, ఏలూరు నుంచి సుజనా చౌదరి లేదా తపనా చౌదరి పేర్లను ఖరారు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

Related posts

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

Allu Arjun: ఎన్నికల వేళ అల్లు అర్జున్ బిగ్ ట్విస్ట్ .. వైసీపీ అభ్యర్ధి మద్దతుగా..

sharma somaraju

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Janasena: ఎట్టకేలకు కాకినాడలో పవన్ పర్యటనకు అనుమతి.. నేడు పిఠాపురంలో రామ్ చరణ్ ప్రచారం

sharma somaraju

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

BJP: బిజెపి అధికారంలోకి వస్తే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.400 ?  

ఏపీలో ఈ 3 నియోజకవర్గాల్లో ఖరీదైన ఎన్నికలు.. ఒక్కో ఓటుకు అన్ని డబ్బులా ?

రేవంత్ పాలన… అమ్మకానికి హైదరాబాద్ మెట్రో ?