NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MLC: వేటు పడింది

YCP MLC: పార్టీ ఫిరాయించిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీలపై వేటుపడింది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ ఫిరాయించిన వైసీపీ ఎమ్మెల్సీలు వంశీకృష్ణ యాదవ్, సీ రామచంద్ర యాదవ్ లపై వేటు వేసినట్లు ప్రకటించారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంశీకృష్ణ యాదవ్ స్థానిక సంస్థల కోటా నుండి, సీ రామచంద్రయ్య గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వంశీకృష్ణ యాదవ్ జనసేన పార్టీలో చేరారు. సీ రామచంద్రయ్య టీడీపీ గూటికి చేరారు. దీంతో పార్టీ ఫిరాయింపుల కింద చర్యలు తీసుకోవాలంటూ మండలి కార్యదర్శికి వైసీపీ నేత, మండలిలో చీఫ్ విప్ మేరిగ మురళీధర్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి లు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలంటూ మండలి చైర్మన్ మోషేన్ రాజు ఆ ఇద్దరికి నోటీసులు  పంపించారు. నోటీసుల ఆధారంగా వారిద్దరి నుండి వివరణ సైతం తీసుకున్నారు మండలి చైర్మన్. ఈ క్రమంలో సమగ్ర విచారణ అనంతరమే ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు.

ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వేటు వేసిన సంగతి తెలిసిందే. టీడీపీ నుండి గెలిచి వైసీపీకి చేరిన నలుగురు ఎమ్మెల్యేలు, వైసీపీ నుండి విజయం సాధించి టీడీపీ లో చేరిన నలుగురు మొత్తం 8 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. తాజాగా శాసనమండలి చైర్మన్ కూడా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకున్నారు.

CAA: మోడీ సర్కార్ కీలక నిర్ణయం ..సీఏఏ నోటిఫికేషన్ జారీ

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Janga Krishna Murty: వైసీపీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై అనర్హత వేటు

sharma somaraju

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

జూన్ 1 వ‌ర‌కు పాల‌న ఎవ‌రిది? చంద్ర‌బాబే అన్నీనా?

ఏపీ చ‌రిత్ర‌లోనే ఇవ‌న్నీ తొలిసారి.. మీరు గ‌మ‌నించారా ?

నాడు గెలిపించి.. నేడు ఓడించేందుకు.. పీకే ప్లాన్‌లో కొత్త ట్విస్ట్ ఇదే..?

ఏపీలో ఇలాంటి ఎన్నిక‌లు ఫ‌స్ట్ టైమ్‌… అదిరిపోయే ట్విస్టులు ఇవే…?