NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇటు రేవంతు.. అటు బండి.. ఏపీ రాజ‌కీయాల్లో ఈ పంచ్‌లు సూప‌రెహే…!

ఏపీలో ఏమీ లేద‌ని అనుకుంటున్న రెండు పార్టీల‌కు.. స్టార్ క్యాంపెయిన‌ర్లు సిద్ధంగా ఉన్నారు. ఇటు కాంగ్రె స్‌, అటు బీజేపీల పక్షాన‌.. ఏపీలో దుమ్మురేపే ప్ర‌చారానికి తెలంగాణ‌కు చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు.. ఆయా పార్టీలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్టు తెలిసింది. కాంగ్రెస్ త‌ర‌ఫున‌.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఏపీలో ప‌ర్య‌ట‌న‌ల‌కు రెడీ అయ్యారు. మొత్తంగా ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న షెడ్యూల్ ప్ర‌కారం. రేవంత్‌.. నాలుగు స‌భ‌ల్లో పాల్గొన‌నున్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

ఈ నెల 15న విశాఖ‌లో కాంగ్రెస్ పార్టీ నిర్వ‌హించే భారీ బ‌హిరంగ స‌భ‌లో రేవంత్ పాల్గొంటారు. ఇది తొలి అ డుగు. త‌ర్వాత‌.. ఆయ‌న తిరుప‌తి, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌ల‌లో నిర్వ‌హించే భారీ స‌భ‌ల‌కు హాజ‌రు కానున్నా రు. ఈ మేర‌కు పార్టీకి షెడ్యూల్ ఖ‌రారైంది. అంటే ఏపీ కాంగ్రెస్‌కు బ‌ల‌మైన ప్ర‌చార క‌ర్త ల‌భించిన‌ట్టే.. ఏపీలో వాస్త‌వానికి ఏమీ లేని కాంగ్రెస్ .. ఇటీవ‌ల వైఎస్ త‌న‌య ష‌ర్మిల ప‌గ్గాలు చేప‌ట్టాక‌.. మార్పు క‌నిపించింది. కార్య‌క‌ర్త‌ల స‌మీక‌ర‌ణ‌లు, నాయ‌కుల రాక‌లు పెరిగాయి.

ఈ నేప‌థ్యానికి రేవంత్ కలిసి వ‌చ్చే అవ‌కాశం మెండుగా ఉంది. ఇది పార్టీకి ప్ల‌స్ కానుంది. ఇక‌, బీజేపీని చూ సుకుంటే.. ఏపీలో బీజేపీకి బ‌ల‌మైన ప్ర‌చార గ‌ళం అంటూ ఏమీ లేదు. ఉన్న‌ప్ప‌టికీ.. ఎవ‌రి వాద‌న వారిదే అన్న‌ట్టుగా ఉంది. క‌ల‌సి క‌ట్టుగా నాయ‌కులు ప్ర‌స్ మీట్ పెట్టింది లేదు. ఒక భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హిం చింది కూడా లేదు. పోనీ.. బ‌లంగా వాయిస్ వినిపించేవారు కూడా ఎవ‌రూ లేరు. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు ముందు బ‌ల‌మైన నాయ‌క‌త్వం అవ‌స‌రం ఉంది.

పోనీ.. నాయ‌క‌త్వం మాట ఎలా.. ఉన్న‌ప్ప‌టికీ బ‌ల‌మైన ప్ర‌చార క‌ర్త అవ‌స‌రం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ‌కు చెందిన ఎంపీ.. బండి సంజ‌య్‌పై బీజేపీ అగ్ర‌నేత‌ల చూపు ప‌డింది. ఈయ‌న‌ను ఏపీలో వాడుకునేందుకు దాదాపు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. ఎన్నిక‌ల ప్ర‌చారానికి ఆయ‌న ప్ర‌ధాన మోడీతో క‌లిసి ఈ నెల 17న ఏపీకి రానున్నారు. ఇక‌, అప్ప‌టి నుంచి ఈయ‌న కూడా. నాలుగు స‌భ‌ల్లో పాల్గొన‌నున్న‌ట్టు స‌మాచారం. ఇదే జ‌రిగితే.. అటు కాంగ్రెస్ ప‌క్షాన రేవంత్‌, ఇటు బీజేపీ ప‌క్షాన బండి దంచి కొట్ట‌డం ఖాయ‌మంటున్నారు ప‌రిశీల‌కులు.

Related posts

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju