Murder Mubarak OTT release: బాలీవుడ్ ముద్దుగుమ్మ సారా అలీ ఖాన్ ప్రస్తుత కాలంలో సినిమాలు మరియు వెబ్ సిరీస్ లతో బాగా బిజీగా ఉంది. ఒకప్పుడు అడపాదడపా అవకాశాలు అందుకున్న ఈ చిన్నది ప్రస్తుత కాలంలో మాత్రం తనదైన నటనతో మెప్పిస్తూ వరస పెట్టి సినిమాలు, వెబ్ సిరీస్ చేస్తూ దూసుకుపోతుంది. అలా ఇప్పటికే అనేక వెబ్ సిరీస్ మరియు సినిమాలు రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ కూడా దక్కించుకున్నాయి.
ఇక తాజాగా మరో వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చేసింది. ప్రముఖ డైరెక్టర్ హౌమీ అదచానియా తెరకెక్కించిన మర్డర్ మిస్టరీ మూవీ ” మర్డర్ ముబారక్ “. ఈ సిరీస్ లో సారా తో పాటు సీనియర్ హీరోయిన్ కరిష్మా కపూర్, పంకజ్ త్రిపాఠి, డీంపుల్ కపాడియా, సంజయ్ కపూర్, టీస్కా చోప్రా, తార అలీషా తదితరులు ముఖ్య పాత్రలు వహించారు. ఇక ఈ సిరీస్ నుంచి విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు.
ఈ సిరీస్ యొక్క కథాంసానికి అందరూ ఎక్ట్రాక్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇది డైరెక్ట్ గా ఓటీటీలోనే విడుదలైంది. శుక్రవారం అనగా మార్చి 15 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫారం నెట్ ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చాయి. హిందీతో పాటుగా తెలుగు మరియు తమిళ్ భాషల్లో కూడా ఈ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. అనుజ చౌహాన్ రాసిన క్లబ్ యూ టు డెత్ నవల ఆధారంగా మర్డర్ ముబారక్ సినిమాను తెరకెక్కించారు. ఈ మర్డర్ మిస్టరీను డోక్ ఫిల్మ్స్ బ్యానర్ పై దినేష్ నిర్మించారు.
ఇక ఈ సిరీస్ కదా విషయానికి వస్తే.. ధనవంతులు మెంబర్స్ గా ఉండే ది రాయల్ ఢిల్లీ క్లబ్ లో అనుకోకుండా ఓ హత్య జరుగుతుంది. ఆ హత్య వెనుక ఉన్న కారణాలను మరియు మర్డర్ చేసింది ఎవరు? అనే మిస్టరీ ని బయటకి తీసేందుకు భవానీ సింగ్ ( పంకజ్ త్రిపాఠి) రంగంలోకి దిగుతుంది. ఇక ఈమె ఈ కేసులో నిందితులను పట్టుకుంటుందా? అసలు ఈ మర్డర్ ఎందుకు చేశారు? అనే విషయాలు చుట్టూ ఈ కథాంశం తిరుగుతుంది. అలా క్రైమ్, థ్రిల్లర్, మిస్టరీ కథాంశంతో ఈ సిరీస్ రూపుందాయి.