NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 5 2024 Episode 376: రాజ్ కావ్య నడుము సీన్ సూపర్.. ధాన్యం అనామికని కడిగిపారేసిన కనకం.. కావ్య కి సపోర్ట్ గా కళ్యాణ్..

Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights

Brahmamudi April 5 2024 Episode 376:  అప్పుకి హెల్ప్ చేయడానికి కళ్యాణ్ ఆ బ్రోకర్ దగ్గరికి వెళ్లి కొడతాడు. అందరి ముందు అప్పు కి సపోర్ట్ చేస్తూ, ఆ బ్రోకర్ని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తాడు. పోలీసులు మీరెందుకు అండి లాండ్ ఆర్డర్ అని చేతిలోకి తీసుకుంటారు మేమున్నాం కదా ఇన్ని అరెస్ట్ చేస్తాము అని అంటారు. అక్కడే ఉన్న అప్పుని అందరూ అడుగుతారు ఇది నిజంగానే మీతో మిస్ బిహేవ్ చేశాడా అని, అందుకు అప్పు చేసాడు కాబట్టే బయటకు రావాల్సి వచ్చింది నాలాగా ఇంకొక ఆడపిల్ల బాధపడకూడదు అని నేను మీడియా ముందుకు వచ్చి చెప్తున్నాను అని అంటుంది ఇక అందరూ కళ్యాణ్ లాంటి వాళ్ళు మీకు సపోర్ట్ గా ఉంటే ఏ ఆడపిల్ల అయినా బాధ పడాల్సిన అవసరం ఉండదు అని అనడంతో కళ్యాణ్కి కోపంతో మీడియా వాళ్లతో ఇలా మాట్లాడుతాడు. మీరంతా తప్పుగా ఆలోచిస్తున్నారు మళ్ళీ నేను సపోర్ట్ చేయడం కాదు అసలు ఆడవాళ్ళకి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు వాళ్లంతాటి వాళ్ళ సమస్యని పరిష్కరించుకునే స్థాయికి రావాలి అది నేను కోరుకునేది అని అంటాడు దానితో ఇక అక్కడ వాళ్ళందరూ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు క్లాప్స్ కొడుతుంటారు కళ్యాణ్ అప్పును తీసుకొని కారులో బయలుదేరుతాడు.

Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights
Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights

ఇక మరోవైపు రుద్రాణి ఫోన్ చూస్తూ అందులో కళ్యాణం కొట్టిన వీడియో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి కవితలు మాత్రమే రాయడం వచ్చు అనుకున్నాను వీడికి ఫైటింగ్ చేయడం కూడా బాగా వచ్చే అనుకొని ఈ వీడియో ఒకటి చాలు ఇప్పుడు ధాన్యం దగ్గరికి వెళ్లి ఇంట్లో గొడవ చేయడం అని చెప్పడానికి అని అనుకుంటుంది. ఇక ధాన్యం దగ్గరికి వెళ్లి చూసేసరికి ధాన్యం రిలాక్స్ గా సాంగ్స్ వింటూ ఉంటుంది అక్కడికి వెళ్లి ఏదైనా ఎండి అయితే కొడుకు తల్లి ఇంతే హ్యాపీగా ఉంటుందేమో అని అంటుంది. ధాన్యం అవును నీవల్లే నా కొడుకు ఎండీ అయ్యాడు ఇదంతా నీ చలవే అంటుంది. సరే కొడుకు గురించి బానే ఆలోచిస్తున్నావు నీ కొడుకు ఎండి అయినందుకు కూడా సంతోషిస్తున్నావు కానీ వాడు బయట రౌడీ లాగా ఫైటింగ్ చేస్తున్నాడు దాని గురించి ఏమంటావు అని అంటుంది నా కొడుకు ఏంటి ఫైటింగ్ చేయడమేంటి అని అంటుంది ధాన్యం ఏమీ తెలియక, అయితే ఒకసారి ఈ వీడియో చూడు అని రుద్రాని వీడియో చూపిస్తుంది. అందులో కళ్యాణ్ ఒక్కడిని కొడుతూ ఉంటే, పక్కనే ఉన్న అప్పు కళ్యాణి ఆపుతూ ఉంటుంది అది చూసి ధాన్యం కోప్పడుతుంది అసలు కోపడాల్సింది నీ కొడుకు మీద కాదు పక్కనే ఉన్న అప్పు మీద అప్పు వల్లే కళ్యాణి ఇలా తయారయ్యాడు అని అంటుంది. అయితే ఇప్పుడే నేను కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటే ఫోన్ చేసి మాట్లాడాల్సింది కళ్యాణ్ తో కాదు ఆ కనకం వాళ్లకి ఫోన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని అడిగి పడేసే అని అంటుంది. ఆ మాటకి ధాన్యం వాలింటికి నేను వెళ్లేదేంటి వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్తాను అందరి ముందు కడిగి పడేస్తాను అని అంటుంది. శభాష్ మంచి పని చేశావు ధాన్యం అని రుద్రాణి మెచ్చుకుంటుంది. ఇక కనకానికి ఫోన్ చేస్తుంది ధాన్యం. కనకంధాన్యం ఫోన్ నెంబర్ చూసి టెన్షన్ పడుతుంది లిఫ్ట్ చేసి ఏంటి బాగున్నారా అని అడుగుతుంది. బాగాలేను అని అంటుంది అయ్యో అలాంటప్పుడు ధాన్యం గారు మీరు డాక్టర్ దగ్గర చూపించుకోవాల్సింది అని అంటుంది కనుకమ్, ఇది డాక్టర్ వేసే మందు వల్ల తగ్గదు మీవల్లే తగ్గుతుంది అని మీ అమ్మాయి చేసే పని గురించి మాట్లాడాలి ఇంటికి రండి అని గట్టిగా చెప్తుంది దానితో కంగారుపడి కనకం ఏమైంది అని అడుగుతుంది ఇంటికి వస్తే అన్ని తెలుస్తాయి అని ఫోన్ పెట్టేస్తుంది ధాన్యం.

Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights
Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights

ఇక కనకం అప్పుకి ఫోన్ చేసి ఏంటే ఆవిడ నన్ను ఇంటికి రమ్మని అడుగుతుంది నువ్వేం చేసావు బయట అని అడుగుతుంది నేనేం చేయలేదమ్మా అని అంటే ఏం చేయకుండానే ఆవిడని ఇంటికి రమ్మంటుందా? ఇప్పుడు ధాన్యం ఫోన్ చేసింది నన్ను నిన్ను ఇంటికి రమ్మని చెప్తుంది ఏం గొడవ జరుగుతుందో ఏంటో అని కంగారుపడుతుందో అప్పుకి చెప్తుంది అమ్మ ఏదైనా వెళ్తేనే కదా తెలిసేది నువ్వు రా నేను ఇటు నుంచి వస్తాను అని అప్పు ఫోన్ పెట్టేస్తుంది ఇక పక్కనే ఉన్న కళ్యాణ్ తో అప్పటికే అప్పు మాట్లాడుతూ ఉంటుంది నువ్వు బాగా మారిపోయావు బ్రో అని అంటుంది. అదేంటి అలా అన్నావు అంటే ఒకప్పుడు నువ్వు నేను లాగా ఉండేది వాడివి నేను నీలాగా ఉండేదాన్ని అలాంటిది ఇప్పుడు నువ్వు నాలాగా ఫాస్ట్ గా మారి రౌడీల్ని కొట్టేస్తున్నావు అని అంటుంది అప్పు 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు కదా అని కళ్యాణ్ అంటూ ఉంటాడు అప్పుడే కనకం ఫోన్ చేసి చెప్పడంతో ఇక ఆ కళ్యాణి ఏమైంది అని అడుగుతాడు మీ అమ్మగారు రమ్మని చెప్పారంట అని అంటుంది అప్పు సరే పర్లేదు వెళ్దాం పద ఏమైందో తెలుస్తుంది మన గొడవ మీడియాలో వచ్చిందేమో అని అంటాడు. కల్యాణ అప్పు కలిసి ధాన్యం ఇంటికి బయలుదేరుతారు.

Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights
Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights

ఇక అప్పటికే కనకం ఇంటికి వచ్చేసి ఉంటుంది దుగ్గిరాల ఇంట్లో రచ్చ మొదలైంది. ఇక ధాన్యం నోరు పడేసుకోవడం మొదలుపెడుతుంది అసలు మీ చెల్లెలు ఎన్నిసార్లు చెప్పినా వినద మా కళ్యాణ్ బాబుతో తిరగదు అన్నా కానీ తిరుగుతుంది అని కళ్యాణ్ కంటే తెలీదు అపుకైనా జ్ఞానం ఉండాలి కదా అని అంటుంది దాంతో అక్కడే ఉన్న కనకం మీ అబ్బాయి వద్దని చెప్పినా మా ఇంటికి వస్తున్నాడు అని అంటుంది. ఇప్పుడు తిరిగింది కాక రోడ్డున పడి రౌడీ లాగా కొడుతున్నాడు అని అంటే అక్కడే ఉన్న కనకం ఏమైంది అని అడుగుతుంది అవును మీకేం తెలీదు మరి అని వీడియో చూపిస్తుంది ధాన్యం. ఆ వీడియో చూసి కనకం కృష్ణమూర్తి ఇద్దరు షాక్ అవుతారు. రౌడీ లాగా వీధిన పడికొడుతున్నాడు అని అంటే కాస్త మీ అమ్మాయిని అదుపులో పెట్టాల్సింది మీ అమ్మాయి బరితెగించి తిరగడం వల్లే ఇలా జరిగింది అని ధాన్యం అంటే అక్కడే ఉన్న కావ్య కాస్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి చిన్న అత్తయ్య అని అంటుంది. అయినా కానీ ధాన్యం వినకుండా కనకం వాళ్ళని గొడవ పడుతూ మీకు మీ అమ్మాయికి బుద్ధి జ్ఞానం ఉన్నాయా అసలు అని అడుగుతుంది. దాంతో కావ్య కోపంగా కాస్త సంస్కారంతో మాట్లాడండి చిన్న అత్తయ్య అని అంటుంది. సంస్కారం మీ దగ్గర అసలు ఉందా అని అడుగుతుంది. లేదు కాబట్టి నేర్చుకోమని చెప్తున్నాము అని స్వప్న మాట్లాడుతుంది. అప్పుడే రుద్రాణి మధ్యలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. మీ అబ్బాయి ఏమైనా గొడవపడ్డాడా మీరు మధ్యలో ఎందుకు దూరుతున్నారు అని స్వప్న రుద్రాణితో అంటుంది. కాస్త మూసుకొని పక్కన నిలబడండి అని మర్యాదగా చెప్తుంది. దాంతో సైలెంట్ అవుతుంది రుద్రాణి. ఇక అక్కడే ఉన్న కృష్ణమూర్తి అమ్మ అసలు కూడా ఎందుకు జరిగిందో దేనికి జరిగిందో మాకు తెలియదు మీ అబ్బాయిని మా ఇంటికి రా వద్దన్నా వినకుండా వస్తున్నాడు ఇప్పుడు రోడ్డు మీద అలా గొడవ జరిగిందంటే మాకు నిజంగా తెలియదు అమ్మ అని అంటూ ఉంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ అప్పు ఇద్దరు నేను చెప్తాను అని కళ్యాణ్ అంటాడు.

Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights
Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights

కళ్యాణి ఎంట్రీ ఇస్తూనే అసలు అక్కడ ఏం జరిగిందో నేను చెప్తాను అప్పుతో అక్కడ మిస్ బిహేవ్ చేశాడు అది తప్పని తెలిసి కొట్టి వచ్చాను అయితే ఏంటి ఇప్పుడు అని అంటాడు. దాంతో అక్కడే ఉన్న అపర్ణ అవును తప్పే చేశావు అతనితో మిస్ బిహేవ్ చేస్తే నువ్వు పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలి కానీ ఇలా రౌడీ లాగా వీధిన పడి కొడతావా ఇప్పుడు పోయింది ఎవరి పరువు అని అంటుంది దాంతో నీ పరువే కాకుండా ఒక ఆడపిల్ల పరువు కూడా రోడ్డున పడేసావు అని అంటుంది. అది కాదు పెద్దమ్మ అని కళ్యాణ్ చెప్తుంటే మధ్యలో అనామికా, అసలు అప్పు వేరే వాడితో మిస్ బిహేవ్ చేసినట్టు నీకు ఎలా తెలిసింది నువ్వు అది ఇంకా టచ్ లో ఉన్నారు కదా అని అంటుంది. వెంటనే ఇందులో కళ్యాణి తప్పేం లేదు అని అప్పు ఉంటుంది అనామిక నువ్వు నోరు మధ్యలో నా భర్తను వెనకేసుకురా మాకు ఇప్పటికైనా భర్త వెనకాల తిరుగుతున్నావు సిగ్గులేకుండా అని అంటుంది. ఇక రుద్రాణి మధ్యలో ఎంట్రీ ఇచ్చి అసలు నాకు ఒక డౌట్ రేపొద్దున రాజ్ లాగా కళ్యాణ్ కూడా ఒక బిడ్డను తీసుకొచ్చి ట్వీస్ట్ ఇస్తాడేమో అని అంటుంది. ఆ మాటలకి కళ్యాణ్ కి బాగా కోపం వస్తుంది ఇంతలో ఒక భారీ డైలాగ్ తో స్వప్న చెప్పు తెగుతుంది అని అంటుంది. వెంటనే రుద్రాణి ఎవరిని అని అంటుంది అదే అలాంటి తప్ప ఏదైనా చేస్తే నా చెల్లెలికి చెప్పు తెగుతుంది అని అంటుంది. ఇక దాంతో సైలెంట్ అవుతుంది రుద్రాణి ఇక ధాన్యం ఇదంతా కాదు ఈ కనకం వాళ్ళు మా ఇంటికి రావడానికి వీల్లేదు ఇకమీదట ఈ కనకానికి ఇంటికి శాశ్వతంగా దూరం అవ్వాలి మీకే చెప్పేది ఇకమీదట మీరు ఇంటికి రావద్దు అని అంటుంది. ఇక కనకం రెచ్చిపోతుంది.

Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights
Brahmamudi Today Episode April 5 2024 Episode 376 highlights

ఇక కనుక మాట్లాడుతూ ఏ ఇంటికి రాకూడదు ఏ గడప తొక్కకూడదు అని అంటుంది ఈ గడప అని అంటుంది ఈగడపా అంటే అని అంటుంది కనుకమ్, ఈ గడపలో నా కూతుర్లు ఇద్దరున్నారు ఈ గడప తొక్కొద్దని అనడానికి మీకే హక్కు లేదు నా ఇద్దరు కూతుళ్ళని మీకు ఏమన్నా నేను అమ్మేశాను అనుకుంటున్నారా ఒక కూతురు కడుపుతో ఉంది. ఒక కూతురు కష్టాల్లో ఉంది అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా ఇంట్లోకి రాకుండా ఉండమని చెప్పే అధికారం మీకు లేదు అయినా మీరిద్దరు ఎవరు ఈ ఇంటికి మీరు ఏమైనా దుగ్గిరాల ఫ్యామిలీ స్థాపించిన వాళ్ళు అనుకుంటున్నారా అయినా మీరు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు ఇంటికి పెద్దవాళ్ళంటూ ఒకళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తే నేను వింటాను అమ్మ క్షమించండి అని సీతారామయ్య వైపు, ఇందిరా దేవి వైపు చూసి కనకం నేను ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి అని అంటుంది ఇక ధాన్యం వైపు చూసి ఎవరు ఏమన్నా సరే నేను ఇంటికి వస్తాను రోజు వస్తాను నేను ఈ ఇంటికి రావద్దు అని చెప్పే అధికారం మీకు లేదు అని, నేనేమైనా తప్పు మాట్లాడానా అని సీతారామయ్య వైపు చూసి అంటుంది కనుక మీరేం తప్పు మాట్లాడలేదు మీ ఇంటికి మీరు ఈ ఇంటికి వచ్చే అధికారం మీకు ఎప్పుడూ ఉంటుంది కాదనే హక్కు ఇంట్లో ఎవరికి లేదు అని సీతారామయ్య చెప్తాడు దాంతో కనకం కళ్ళు ఎగరేసి మరి బాబు కళ్యాణ్ నీకు ఇంకొకసారి చెప్తున్నాను నీ భార్య కనుక నా చిన్న కూతురు గురించి తప్పుగా మాట్లాడితే నేను నీ గురించి కూడా ఆలోచించకుండా ఇంకొకసారి నా కూతురు వైపు చూడకుండా బుద్ధి చెప్తాను అని అంటుంది ఇక దాంతో నా ఫుల్ సపోర్ట్ మీకే అండి అని అంటాడు కళ్యాణ్ మీకు అది కోపం వస్తుంది. నా కూతురు ఎలాంటి తప్పు చేయదు తప్పు చేయనివ్వను అని అప్పు ఉంది తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కనకమ్ కృష్ణమూర్తి కూడా వెళ్ళిపోతాడు.

ఇక మరోవైపు కావ్య దిగులుగా ఉంటే అక్కడికి వచ్చిన ఇందిరా దేవి, ఏంటి పొద్దున జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా అంటుంది లేదు అమ్మమ్మ గారు అసలు నా చెల్లెలు తప్పు చేస్తుందంటే నమ్మను కళ్యాణ్ తప్పు చేశాడంటే కూడా నేను నమ్మలేను కళ్యాణ్ గురించి నాకు బాగా తెలుసు అని అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కళ్యాణ్ మీరు ఇంతలా నమ్ముతారు వదిన నన్ను నేను కూడా మీకు ఏదైనా సహాయం చేస్తాను అని అంటే వద్దు కళ్యాణి ఇప్పుడు నువ్వు ఆఫీస్కి ఎండి అయ్యావు నువ్వు ఆ బాధ్యతలు చూసుకో అనామిక గురించి ఆలోచించు నేను ఏదైనా అవసరమైతే నీ దగ్గరికి వచ్చి అడుగుతానని నీకు తెలుసు కదా అని అంటుంది మీకు దాంతో కళ్యాణ్ మీరు నా వదిన కాదు అమ్మలాంటి వాళ్ళు మీకే సహాయం కావాలంటే నేను చేస్తాను అని అంటాడు. అమ్మనే చెప్తున్నాను కళ్యాణ్ నీ గురించి నాకు తెలుసు నేనే హెల్ప్ కావాలన్నా నిన్నే అడుగుతాను అని అక్కడి నుంచి కళ్యాణి పంపించేస్తుంది అదంతా చూసి ఇందిరా దేవి సంతోషిస్తుంది. మీరిద్దరి అండర్స్టాండింగ్ బాగుంది కానీ ఇప్పుడు నువ్వు వెన్నెల్ని వెతుకుకొచ్చి ఏం చేస్తావో అని నాకు టెన్షన్ గా ఉంది అని అంటుంది అదేంటి అమ్మమ్మ గారు అలా అన్నారు అని అంటుంది కావ్య అవును వెన్నెలను తీసుకొచ్చి ఇంట్లో రాజ్ కి వెన్నెలకి సంబంధాన్ని బయటపెట్టి నువ్వేమైపోతావు అని అంటుంది. రాజకీయ వెన్నెల భార్యని చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతావా అని అడుగుతుంది. ఇందిరా దేవి అక్కడితో ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో కావ్య బాబుకి స్నానం చేయించి పౌడర్ రాస్తూ ఉంటే నడుం మీద పుట్టుమచ్చ చూసి రుద్రాణి ఇలాంటి పుట్టుమచ్చ రాజ్ కి కూడా ఉంది అని అంటుంది. ఇక దాంతో కాఫీకి అనుమానం వస్తుంది రాజ్ దగ్గరికి వచ్చి రాజ్ నడుం మీద పుట్టుమచ్చ ఉందో లేదో చూద్దామని పైకి అంటుంది. రాజు ఒకసారి గా కంగారుపడి ఏం చేస్తున్నావ్ అని అంటాడు నువ్వు నా నడుము చూసావు కదా అని అంటాడు. లేదు నేను నడుము చూడలేదు అని అంటుంది. అవును నువ్వు నా నడుము చూసావు నేను నాకు తెలుసు అని అంటాడు అవును చూసాను అయితే ఏంటి అని అంటుంది కావ్య.

Related posts

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N

Karthika Deepam 2 May 16th 2024 Episode: నరసింహా కి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేసిన కార్తీక్.. భీష్మించుకు కూర్చున్న శౌర్య..!

Saranya Koduri

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella