NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nayanthara: ఆ స్టార్ హీరో వ‌ల్లే నయన‌తార – విఘ్నేష్ శివన్ ప్రేమకు పునాది ప‌డిందా.. బ‌య‌ట‌ప‌డ్డ టాప్ సీక్రెట్‌!

Nayanthara: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల జాబితాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకటి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నయనతార.. ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తనదైన గ్లామర్ మరియు టాలెంట్ తో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. చంద్రముఖి, గజిని, లక్ష్మి, బాస్, తులసి వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హోదాను సంపాదించుకుంది. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ముద్ర వేయించుకుంది. నాలుగు పదుల వయసులోనూ అగ్రతారగా కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది.

నయనతార పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మొదట ఈ బ్యూటీ తన సహ నటుడు శింబుతో ప్రేమలో పడింది. అయితే వీరి రిలేషన్ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవా, నయనతార మధ్య రిలేషన్ ఏర్పడింది. 2010లో ప్రభుదేవా నయనతారను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించాడు. పైగా నయనతార కోసం ప్రభుదేవా తన మొదటి భార్య విడాకులు ఇచ్చాడు. కానీ ఏమైందో ఏమోగానీ 2012లో పెళ్ళి వరకు వెళ్లకుండానే ప్రభుదేవాకి నయనతార బ్రేకప్ చెప్పింది. ప్ర‌భుదేవాతో రిలేష‌న్ బ్రేక్ అయ్యాక‌ చాలా కాలం నయనతార ఒంటరిగానే లైఫ్ ను లీడ్‌ చేసింది కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది.

ఇక నానుమ్ రౌడీధాన్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో నయనతారకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దాదాపు ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విఘ్నేష్ శివ‌న్ జంట‌ 2022లో వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్​లో అంగ‌రంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకున్నారు. రజినీకాంత్, షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, దర్శకుడు అట్లీ, అజిత్ కుమార్‌, రాధిక శరత్‌కుమార్, విజయ్​ సేతుపతి, కార్తితో స‌హా ప‌లువ‌రు సినీ తార‌లు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ పెళ్లితో సంద‌డి చేశారు.

వివాహం అయిన అదే ఏడాది స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ త‌ల్లిదండ్రులు అయ్యారు. ప్ర‌స్తుతం ఈ జంట ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను.. మ‌రోవైపు ఫ్రొఫెష‌నల్ లైఫ్‌ను చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు. అయితే తాజాగా న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల‌వ్ స్టోరీ గురించి ఓ టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెడింది. వీరిద్ద‌రి ప్రేమ‌కు పునాది ప‌డ‌టానికి కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరో కార‌ణ‌మ‌ట‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విఘ్నేష్ శివ‌న్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు ధ‌నుష్‌.

విఘ్నేష్ శివ‌న్ మాట్లాడుతూ.. `నానుమ్‌ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్‌ సారే నాకు సూచించాడు. ఆయ‌న చెప్ప‌డం వ‌ల్లే న‌య‌న‌తార‌ను నేను క‌లిశాను. స్టోరీ న‌చ్చ‌డంతో ఆమె వెంట‌నే ఓకే చెప్పింది. మొద‌ట స్క్రిప్ట్‌ నచ్చలేదన్న విజయ్‌ సేతుపతి నయన్‌ ఓకే చేప్పిందగానే ఆయ‌న కూడా సైన్ చేశారు. ఇక ఈ సినిమా వ‌ల్ల దాదాపు ఏడాది న‌య‌న్‌తో క‌లిసి ట్రావెల్ చేశాను. ఈ జ‌ర్నీలో తెలియ‌కుండానే ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డిపోయాం. ఒక‌ర‌కంగా ధ‌నుష్ సారే మా ఇద్ద‌రి ప్రేమ‌కు పునాది వేశారు` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విఘ్నేష్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

Related posts

Supreme Court: ఏపీలో ఇసుక తవ్వకాలపై సుప్రీం సీరియస్ .. కీలక ఆదేశాలు జారీ

sharma somaraju

EC: పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు వేసిన ఈసీ .. మరి కొందరిపై బదిలీ వేటు

sharma somaraju

AP Elections: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీకి వ్యక్తిగతంగా వివరణ ఇచ్చిన సీఎస్, డీజీపీ

sharma somaraju

CM YS Jagan: ఏపీ ఎన్నికల ఫలితాలు దేశంలోని ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తాయన్న సీఎం జగన్

sharma somaraju

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

భారీ భద్రత మధ్య జేసీ ఫ్యామిలీ హైదరాబాద్ తరలింపు.. ఎందుకంటే..?

sharma somaraju

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Devara: “దేవర” సాంగ్ వింటే “హుకుం” మర్చిపోతారు అంటూ నాగవంశీ కీలక వ్యాఖ్యలు..!!

sekhar

Tollywood Actor: ఇత‌నెవ‌రో గుర్తుప‌ట్టారా.. చైల్డ్ ఆర్టిస్ట్‌గా వ‌చ్చి హీరోగా అద‌ర‌గొట్టి చివ‌ర‌కు ఇండ‌స్ట్రీలోనే లేకుండా పోయాడు!

kavya N

Sai Pallavi-Sreeleela: సాయి ప‌ల్ల‌వి – శ్రీ‌లీల మ‌ధ్య ఉన్న ఈ కామ‌న్ పాయింట్స్ ను గ‌మ‌నించారా..?

kavya N

Serial Actress Sireesha: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. భ‌ర్త‌తో విడిపోయిన‌ట్లు ప్ర‌క‌టించిన ప్ర‌ముఖ సీరియ‌ల్ న‌టి!

kavya N

Janhvi Kapoor: జాన్వీ మెడ‌లో మూడు ముళ్లు వేయాలంటే ఈ క్వాలిటీస్ క‌చ్చితంగా ఉండాల్సిందే అట‌!

kavya N