NewsOrbit
Cinema Entertainment News న్యూస్ సినిమా

Nayanthara: ఆ స్టార్ హీరో వ‌ల్లే నయన‌తార – విఘ్నేష్ శివన్ ప్రేమకు పునాది ప‌డిందా.. బ‌య‌ట‌ప‌డ్డ టాప్ సీక్రెట్‌!

Nayanthara: సౌత్ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల జాబితాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకటి. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన నయనతార.. ఆ తర్వాత నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తనదైన గ్లామర్ మరియు టాలెంట్ తో తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా నిలదొక్కుకుంది. చంద్రముఖి, గజిని, లక్ష్మి, బాస్, తులసి వంటి విజయవంతమైన చిత్రాలతో స్టార్ హోదాను సంపాదించుకుంది. దక్షిణాదిలో లేడీ సూపర్ స్టార్ గా ముద్ర వేయించుకుంది. నాలుగు పదుల వయసులోనూ అగ్రతారగా కెరీర్ ను పరుగులు పెట్టిస్తోంది.

నయనతార పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే.. మొదట ఈ బ్యూటీ తన సహ నటుడు శింబుతో ప్రేమలో పడింది. అయితే వీరి రిలేషన్ ఎక్కువ కాలం సాగలేదు. ఆ తర్వాత విల్లు షూటింగ్ సమయంలో ప్రభుదేవా, నయనతార మధ్య రిలేషన్ ఏర్పడింది. 2010లో ప్రభుదేవా నయనతారను పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా ప్రకటించాడు. పైగా నయనతార కోసం ప్రభుదేవా తన మొదటి భార్య విడాకులు ఇచ్చాడు. కానీ ఏమైందో ఏమోగానీ 2012లో పెళ్ళి వరకు వెళ్లకుండానే ప్రభుదేవాకి నయనతార బ్రేకప్ చెప్పింది. ప్ర‌భుదేవాతో రిలేష‌న్ బ్రేక్ అయ్యాక‌ చాలా కాలం నయనతార ఒంటరిగానే లైఫ్ ను లీడ్‌ చేసింది కెరీర్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టింది.

ఇక నానుమ్ రౌడీధాన్ షూటింగ్ సమయంలో డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో నయనతారకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ కాలం పట్టలేదు. దాదాపు ఏడేళ్లు డేటింగ్ చేసిన నయనతార, విఘ్నేష్ శివ‌న్ జంట‌ 2022లో వివాహం చేసుకున్నారు. మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్​లో అంగ‌రంగ వైభవంగా వీరు పెళ్లి చేసుకున్నారు. రజినీకాంత్, షారుఖ్ ఖాన్, బోనీ కపూర్, దర్శకుడు అట్లీ, అజిత్ కుమార్‌, రాధిక శరత్‌కుమార్, విజయ్​ సేతుపతి, కార్తితో స‌హా ప‌లువ‌రు సినీ తార‌లు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ పెళ్లితో సంద‌డి చేశారు.

వివాహం అయిన అదే ఏడాది స‌రోగ‌సి ద్వారా ఇద్ద‌రు క‌వ‌ల మ‌గ పిల్ల‌ల‌కు న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ త‌ల్లిదండ్రులు అయ్యారు. ప్ర‌స్తుతం ఈ జంట ఓవైపు ఫ్యామిలీ లైఫ్‌ను.. మ‌రోవైపు ఫ్రొఫెష‌నల్ లైఫ్‌ను చ‌క్క‌గా బ్యాలెన్స్ చేస్తూ హ్యాపీగా జీవిస్తున్నారు. అయితే తాజాగా న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ ల‌వ్ స్టోరీ గురించి ఓ టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెడింది. వీరిద్ద‌రి ప్రేమ‌కు పునాది ప‌డ‌టానికి కోలీవుడ్ కు చెందిన స్టార్ హీరో కార‌ణ‌మ‌ట‌. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో విఘ్నేష్ శివ‌న్ స్వ‌యంగా ఈ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌కీ ఆ హీరో మ‌రెవ‌రో కాదు ధ‌నుష్‌.

విఘ్నేష్ శివ‌న్ మాట్లాడుతూ.. `నానుమ్‌ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్‌ సారే నాకు సూచించాడు. ఆయ‌న చెప్ప‌డం వ‌ల్లే న‌య‌న‌తార‌ను నేను క‌లిశాను. స్టోరీ న‌చ్చ‌డంతో ఆమె వెంట‌నే ఓకే చెప్పింది. మొద‌ట స్క్రిప్ట్‌ నచ్చలేదన్న విజయ్‌ సేతుపతి నయన్‌ ఓకే చేప్పిందగానే ఆయ‌న కూడా సైన్ చేశారు. ఇక ఈ సినిమా వ‌ల్ల దాదాపు ఏడాది న‌య‌న్‌తో క‌లిసి ట్రావెల్ చేశాను. ఈ జ‌ర్నీలో తెలియ‌కుండానే ఒక‌రితో ఒక‌రు ప్రేమ‌లో ప‌డిపోయాం. ఒక‌ర‌కంగా ధ‌నుష్ సారే మా ఇద్ద‌రి ప్రేమ‌కు పునాది వేశారు` అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో విఘ్నేష్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి.

 

Related posts

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri