NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్ర‌బాబు – జ‌గ‌న్ రెండు సంత‌కాలు తేలిపోయాయ్‌… జ‌నం ఎవ‌రికి జై కొడ‌తారో..?

వ‌చ్చేది ఏ ప్ర‌భుత్వ‌మో తెలియదు. కానీ, అటు వైసీపీ, ఇటు టీడీపీలు రెండూ కూడా సంత‌కాలు ప్ర‌క‌టిం చాయి. దీంతో ఈ రెండు సంత‌కాల‌పై జ‌నంలో చ‌ర్చ సాగుతోంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌స్తుతం ఎన్డీయే కూట‌మిగా ఏర్ప‌డి ఎన్నిక‌ల్లో త‌ల‌ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న తొలి సంత‌కం ప్ర‌క‌టించారు. అయితే.. ఇది వివాదానికి దారితీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. తాను అధికారంలోకి రాగానే.. తొలి సంత‌కం డీఎస్సీపైనే ఉంటుంద‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు.

అది కూడా.. మెగా డీఎస్సీపై తొలి సంత‌కం చేస్తాన‌ని చంద్ర‌బాబు ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం. ఇక‌, వైసీపీ అధినేత జ‌గ‌న్ కూడా తాజాగా రెండు రోజుల కిందట తన తొలి సంత‌కాన్ని ప్ర‌క‌టించారు. తాను మ‌రోసారి అదికారంలోకి వ‌స్తే.. తొలి సంత‌కం .. వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌పైనే ఉంటుంద‌ని చెప్పారు. ఇక‌, ఇద్ద‌రి సంత‌కాల వ్య‌వ‌హారాన్ని చూస్తే.. రెండు హాట్ టాపిక్‌లే.. వైసీపీ హ‌యాంలో ఎన్నిక‌ల‌కు ముందు మెగా డీఎస్సీ వేస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్‌.. ఐదేళ్ల అధికారంలోఒక్క‌టి కూడా వేయ‌లేక పోయారు.

అర‌కొర పోస్టుల‌తో (6 వేల‌తో) డీఎస్సీ వేసినా.. అది ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌కు ముందు కావ‌డంతో స‌క్సెస్ కాలేదు . తాజాగా ఎన్నిక‌ల సంఘం ఈ నోటిఫికేష‌న్‌పై బ్రేక్ వేసింది. దీంతో ఇది ఆగిపోయింది. ఫ‌లితంగా ఒక్క డీఎస్సీ కూడా వేయ‌ని ప్ర‌భుత్వంగా సీఎం జ‌గ‌న్ హ‌యాం నిలిచిపోయింది. దీనిని కార్న‌ర్ చేస్తూ.. చంద్ర బాబు నిరుద్యోగుల‌ను త‌న‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మెగా డీఎస్సీకి ప్ర‌క‌ట‌న చేశారు. తొలి సంత‌కం దీనిపైనే ఉంటుంద‌న్నారు.

ఇక‌, చంద్ర‌బాబు కు చెందిన కొంద‌రు వ్య‌క్తులు వలంటీర్ల‌ను నిలుపుద‌ల చేశార‌ని… ప్ర‌జ‌ల‌కు చేరువైన వ‌లంటీర్ల‌ను ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్ర‌జ‌ల‌కు దూరం చేశార‌ని ఆరోపిస్తున్న సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంపైనే త‌న తొలి సంత‌కం ఉంటుంద‌ని అన్నారు. అయితే.. ఈ రెండు అంశాలు కూడా.. కొన్నివ‌ర్గాల‌కు మాత్ర‌మే ప‌రిమితం కావ‌డం గ‌మ‌నార్హం. ఎవ‌రైనా ఎక్క‌డైనా విశేష సంఖ్య‌లో ప్ర‌యోజ‌నం కూర్చే ప‌థ‌కాల‌పై సంత‌కాలు చేస్తారు.

కానీ, ప్ర‌జ‌ల భావోద్వేగాల‌తో ముడిప‌డిన రెండు కీల‌క విషయాల‌పై కీల‌క నాయ‌కులు ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పెద్ద‌గా చ‌ర్చ‌కు రాకుండానే పోయాయి. అయితే.. డీఎస్సీపై నిరుద్యోగులు కొంత మేర‌కు ఆశ‌లు పెట్టుకున్నారు. అయితే.. జ‌గ‌న్ చేసిన ప్ర‌క‌ట‌న‌తో వ‌లంటీర్లు కూడా ఆశ‌లు పెట్టుకున్నారు. అంటే.. రెండు భిన్న‌మైన అంశాల‌పై ఇద్ద‌రు వాగ్దానం చేయ‌డంతో పెద్ద‌గా ఇది రాజ‌కీయ చ‌ర్చ‌కు రాకుండా పోయింద‌నే వాద‌న వినిపిస్తోంది.

Related posts

ACB Raids On ACP: ఏసీపీ నివాసంలో భారీగా బయటపడిన నగదు, నగలు .. కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

sharma somaraju

CM Revanth Reddy: పారిశ్రామిక అభివృద్ధిలో ప్రపంచ దేశాలతో పోటీ పడేలా నూతన పాలసీలు :  సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

AP Election 2024: కొత్తపేటలో ఓటర్లకు నగదు పంపిణీపై ఈసీకి వైసీపీ ఫిర్యాదు

sharma somaraju

వినియోగదారుల స్వచ్చంద సంస్థలు, సంఘాలకు ఏపీ సర్కార్ కీలక హెచ్చరిక .. ఆ పదాలను వాడటం చట్టవిరుద్దం

sharma somaraju

Singapore Airlines: సింగపూర్ ఎయిర్ లైన్స్ విమానంలో భారీ కుదుపులు ..ఒకరి మృతి.. 30 మందికి గాయాలు

sharma somaraju

కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే పెండ్యాల మృతి.. ఏపీ హోంమంత్రి తానేటి వనిత సంతాపం

sharma somaraju

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Poll Violence: ఏపీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాపై కేసు నమోదు

sharma somaraju

Breaking: అనంతలో ఎన్ఐఏ సోదాల కలకలం

sharma somaraju

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

ఆ ఒక్క న‌మ్మ‌కం ప‌నిచేసి ఉంటే.. ఏపీ రిజ‌ల్ట్ తిరుగే లేకుండా ఉండేదా..?