NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

‘ మంత్రి సీదిరి ‘ మావాడే.. మాకు కాకుండా పోయాడు..!

ఉమ్మ‌డి శ్రీకాకుళం జిల్లాలోని ప‌లాస నియోజ‌క‌వ‌ర్గం హాట్ టాపిక్‌గా మారింది. జిల్లా వ్యాప్తంగా ఎన్నో నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నా.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మాత్రం.. చాలా ఎక్కువే చ‌ర్చ న‌డుస్తోంది. దీనికి కార‌ణం.. టీడీపీ నుంచి పోటీ చేసి గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపో యినా.. మొక్క‌వోని ధైర్యంతో ఇప్పుడు కూడా త‌ల‌ప‌డుతున్న గౌతు శిరీషే. ఇంటింటి ప్ర‌చారం ప్రారంభించ‌క‌పోయినా.. శిరీష గురించి మాత్రం ఇంటింటా చ‌ర్చ సాగుతోంది. ఈ సారి విజ‌యం త‌మ‌దేన‌ని టీడీపీ నేత‌లు చెబుతున్నారు. స‌రే.. ఈ విష‌యం ఎలా ఉన్నా.. అధికార పార్టీ అభ్య‌ర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే క‌మ్ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు కూడా గ‌ట్టిగానే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఇక్క‌డ చేసిన అభివృద్ది గురించి ప‌దే ప‌దే ప్ర‌స్తావిస్తున్నారు. క‌ర‌ప‌త్రాలు వేసి.. అన‌ధికార వ‌లంటీర్ల‌తో ఇంటింటికీ పంపిణీ చేయిస్తున్నారు. దీనిలో ప్ర‌ధానంగా ఉద్దానంలో కిడ్నీ సెంట‌ర్‌ను ప్ర‌స్తావిస్తున్నారు. దీనిని తాము అధికారం లోకి వ‌చ్చాకే నిర్మించామ‌ని చెబుతున్నారు. అదేవిధంగా మంచి నీటి ప్రాజెక్టును కూడా నిర్మించిన విష‌యాన్ని ఊద‌ర గొడుతు న్నారు. ప‌దే ప‌దే త‌న గొప్ప‌లు చెప్పుకొంటున్నారు. అయితే.. ఎవ‌రు ఎన్న‌యినా చెప్పుకోవ‌చ్చు. కానీ, అంతిమంగా ప్ర‌జ‌లు ఏంట‌నేది తేలుస్తారు. ఈ విష‌యంలో సీదిరి అప్ప‌ల‌రాజు చేస్తున్న ప్ర‌సంగానికి 5 శాతం మార్కులే ప‌డుతున్నాయి. ఇది వాస్త‌వం.

`ఔను.. ఉద్దానంలో కొంత అభివృద్ది జ‌రిగింది. అది కేవ‌లం 5 శాతం.. అంత‌కంటే త‌క్కువ !` అనే వారే ఎక్కువుగా ఉన్నారు. అంతేకాదు, `మావోడే మాకు కాకుండా పోయాడు` అని సొంత మ‌త్య్స‌కార కుటుంబాలే దెప్పిపొడుస్తున్నాయి. ఇక‌, వైసీపీలోనే రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన వారు.. ఎప్పుడో ఏడాది కింద‌ట నుంచి సీదిరి వ్య‌తిరేకంగా ఇక్క‌డ చ‌క్రం తిప్పుతున్నాయి. ఇవి కూడా.. 90 శాతం ప్ర‌భావితం చూపిస్తున్నాయి. మ‌రీముఖ్యంగా త‌న దురుసు ప్ర‌వ‌ర్త‌న‌.. త‌న వ్య‌వ‌హార శైలి వంటివి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు సీదిరిని దూరం చేశాయి. `డాట‌ర్ గారు మారిపోయారు` అనే టాక్ వినిపిస్తోందంటే.. అది ఏ రేంజ్‌లో ప్ర‌భావితం చూపిస్తోందో అర్ధం చేసుక‌వ‌చ్చు.

గ‌త ఎన్నిక‌ల్లో ఏ పార్టీకి ఆ పార్టీ పోటీలో ఉన్న‌ప్పుడే.. కేవ‌లం 16 వేల ఓట్ల ఆధిక్య‌త‌తో సీదిరి విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ, ఇప్పుడు మూడు పార్టీలు క‌లిశాయి. దీనికి తోడు ఆయ‌న‌కు 10 శాతం అనుకూల మాత్ర‌మే క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో సీదిరి ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. అంతేకాదు.. కాంగ్రెస్ త‌ర‌ఫున మ‌జ్జి త్రినాధ్ బాబు పోటీ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ ఓటు బ్యాంకు చీలి పోవ‌డం ఖాయ‌మ‌ని తెలుస్తోంది. ఇదే జ‌రిగితే సీదిరికి ఇప్పుడు చెబుతున్న 10 శాతం అనుకూల‌త కూడా త‌గ్గ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి మిగిలిన 90 శాతం అనుకూల‌త ఇప్పుడున్న ప‌రిస్థితిలో టీడీపీ వైపే ఉండ‌డం విశేషం. దీనిని సీదిరి ఎలా త‌ట్ట‌కుంటారో చూడాలి.

Related posts

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి టాలీవుడ్ స్టార్ హీరో స‌తీమ‌ణి.. హీరోయిన్‌గా కూడా చేసింది.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Priyadarshi Pulikonda: హీరోగా దూసుకుపోతున్న క‌మెడియ‌న్ ప్రియదర్శి.. చేతిలో ఏకంగా అన్ని సినిమాలా..?

kavya N