NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలో కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం గుంటూరు వెస్ట్‌. ఇక్క‌డ నుంచి వైసీపీ, టీడీపీ త‌ర‌పున బీసీ మ‌హిళ‌లు పోటీ చేస్తున్నారు. నిజానికి రాష్ట్రంలో ఇలా ఇద్ద‌రు మ‌హిళ‌లు పోటీ ప‌డుతున్న స్థానాల్లో ఇది చాలా కీల‌కంగా మారింది. ఎందుకంటే అటు వైపు మంత్రి.. ఇటు వైపు బిజినెస్ ఉమ‌న్‌. ఇద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులే. ఇద్ద‌రూ ఆర్థికంగా బ‌లంగా ఉన్న వారే. ఇద్ద‌రూ బీసీలే. అయితే ర‌జ‌క సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌కు టీడీపీ సీటు ఇవ్వ‌డం.. ఆమె లోక‌ల్ కావ‌డంతో రాజ‌కీయం మారుతోంది.

ఇక ఇద్ద‌రూ బీసీ వ‌ర్గానికి చెందిన మ‌హిళ‌లు.. ఇద్ద‌రూ ఉన్న‌త విద్యావంతులు కావ‌డంతో వీరిలో ఎవ‌రిని ఎన్నుకోవాలి? ప్ర‌జ‌ల‌కు ఎవ‌రికి ఓటేయాలి? ఇది మీకు, మాకు కాదు. నియోజ‌క‌వ‌ర్గంలోనే వినిపిస్తున్న ప్ర‌శ్న‌. ఇక‌, అభ్య‌ర్థుల విష‌యానికి వ‌స్తే.. టీడీపీ నుంచి పిడుగురాళ్ల మాధ‌వి, వైసీపీ నుంచి మంత్రి విడుద‌ల ర‌జ‌నీ పోటీలో చేస్తున్నారు. ఇద్ద‌రి పేర్లూ.. ఆక‌ర్ష‌ణీయం. ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుండేదే కావ‌డం గ‌మ‌నార్హం. ఇద్ద‌రూ స‌మ ఉజ్జీలే క‌దా! అనే చ‌ర్చ గుంటూరు వెస్ట్‌లో జోరుగా సాగుతోంది.

ఈ విష‌యంపై స్థానికంగా ఉన్న కొంద‌రు మీడియా మిత్రులు ఆరా తీశారు. దీనిలో ప్ర‌జ‌లు ఆస‌క్తిక‌ర విష యాలు వెల్ల‌డించారు. ప్ర‌ధానంగా స్థానిక‌త‌కు వారు జై కొడుతున్నారు. ఇది వాస్త‌వం కూడా. ఈ విష‌యం లో ర‌జ‌నీ చాలా వెనుక‌బ‌డ్డారు. ఇది టీడీపీ త‌ర‌ఫున పోటీ చేస్తున్న మాధ‌వికి ప్ల‌స్ అవుతోంది. `ఆమెవ‌రో మాకు తెలుసు. ఎప్ప‌టి నుంచో చూస్తున్నాం. ఇది ఆమె మెట్టినిల్లు` అని మాధ‌వి గురించి జ‌నాలు చెబుతున్నారు. అంతేకాదు.. ఆమె ఈ జిల్లాకు చెందినామే అని కూడా అనేస్తున్నారు.

ఈ లోక‌ల్ టాక్ ర‌జ‌నీకి రావ‌డం లేదు. పైగా.. ఆమె నియోజ‌క‌వ‌ర్గం మారడం.. చిల‌క‌లూరిపేట నుంచి గుంటూరు వెస్ట్‌కు వ‌చ్చి పోటీ చేయ‌డం వంటివి కూడా ఆస‌క్తిగా మారాయి. పైగా ఆమె చిల‌క‌లూరిపేట‌కే లోక‌ల్ కాదు.. ఎక్క‌డో తెలంగాణ అమ్మాయి.. అదే మాధ‌వి ఇక్క‌డే పుట్టి పెరిగి.. ఇక్క‌డ స‌మ‌స్య‌లపై పూర్తి గ్రిప్ ఉన్న ఆమె అన్న‌దే లోక‌ల్‌గా బాగా వినిపిస్తోంది. ఇక ర‌జ‌నీపై ఆమె `అక్క‌డెందుకు పోటీ చేయ‌ట్లే దు? ఆవిడ తెలంగాణ మ‌నిషి. పోయిన ఎన్నిక‌ల్లో పేట నుంచి గెలిచారు. అక్క‌డే గెల‌వొచ్చుగా. ఏదో తేడా ఉంది. అందుకే ఇక్క‌డ‌కు వ‌చ్చారు. ఇప్పుడు మేం మా ఇల్లు స‌రిచేసుకుంటాం కానీ.. ఎక్క‌డినుంచో వ‌చ్చిన వారి ఇంట్లో దీపం పెట్టలేం` అని మ‌హిళ‌లే ముక్త‌కంఠంతో చెబుతున్నారు.

ఈ ఒక్క విష‌యం ర‌జ‌నీని ఓట‌ర్ల‌కు చాలా దూరం చేసేసింది. ఆమె ఇప్పుడు మంత్రి, డ‌బ్బున్న‌ నాయ‌కురాలే కావొచ్చు. మాట‌ల మాంత్రికురాలే కావొచ్చు. కానీ, నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న లోక‌ల్‌-నాన్‌లోక‌ల్ అనే విష‌యంలో మాత్రం ర‌జ‌నీ.. తేలిపోతున్నారు. అందుకే.. ఈ విష‌యం తెలుసా మేడం ? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి.

Related posts

 జిందాల్ పరిశ్రమ లేఆఫ్ .. కార్మికుల ఆందోళన

sharma somaraju

KA Paul: తెలంగాణలో కేఏ పాల్ పై చీటింగ్ కేసు నమోదు ..ఎమి చేశారంటే..?

sharma somaraju

Rain Alert: ఏపీ సహా ఈ రాష్ట్రాల్లో అయిదు రోజుల పాటు భారీ వర్షాలు .. ఐఎండీ హెచ్చరిక

sharma somaraju

Lok Sabha Elections 2024: ‘దేశంలో ప్రజాస్వామ్యం ఉందా..?’ : జ్యోతిమఠ్ శంకరాచార్యులు

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో వైఎస్ షర్మిల, సునీతకు భారీ ఊరట .. కడప కోర్టు ఉత్తర్వులపై స్టే

sharma somaraju

YSRCP: అజ్ఞాతంలోకి ఆ వైసీపీ ఎమ్మెల్యే సోదరులు

sharma somaraju

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ కొత్త సెంటిమెంట్లు మీరు గ‌మ‌నించారా ?

ఎన్టీఆర్, వైఎస్సార్ త‌ర్వాత జ‌గ‌న్‌దే ఆ రికార్డ్‌..?

ఏపీ పోలింగ్‌పై అంతు చిక్క‌ట్లేదా… గెలుపుపై ఎవ‌రి లెక్క‌లు వారివే..?

ఏపీ ఎన్నిక‌లు – రివ‌ర్స్ అయిన వ్యూహాలు..?

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Tragedy: ఒక ప్రమాదం నుండి బయటపడిన నిమిషాల వ్యవధిలోనే మరో ప్రమాదం .. అమెరికాలో తెలుగు యువకుడి మృతి

sharma somaraju