NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials సినిమా

Karthika Deepam 2 April 16th 2024 Episode: దీప దెబ్బకు బెదిరిపోయిన పారిజాతం.. శౌర్య మాటలకు కన్నీరు మున్నీరు అయిన కార్తీక్..!

Karthika Deepam 2 April 16th 2024 Episode: కార్తీక్, జ్యోత్స్న పెళ్లి విషయంలో తీసుకున్న నిర్ణయం ఎప్పటికీ మారదని శివ నారాయణ అంటాడు. కాంచన కొడుకుతోనే పెళ్లి అంటుండగా బయట కార్తీక్ కారులో నుంచి దీప దిగడం చూసి పారిజాతం రగిలిపోతుంది. ఇది దేవుడి సమక్షంలో ఇచ్చిన మాట అంటాడు. కార్తీక్ ఇంట్లోకి రాగానే పెళ్లి సంగతి మాట్లాడుతూ ఉంటారు. వచ్చే ముహూర్తాలలో పెళ్లి చేసేయాల్సిందేనని సుమిత్ర అంటే కార్తీక్ కోపంగా పారు వైపు చూస్తాడు. అక్కడ నుంచి మెల్లగా జారుకుంటుంది పారు. కార్తీక్ కి శౌర్య వెదురుపడుతుంది. తనని చూడగానే నరసింహ మాటలు గుర్తుకు వస్తాయి. దీప తన గదిలోకి వచ్చి భర్త మాటలకు కోపంతో రగిలిపోతూ ఉంటే పారిజాతం వచ్చి కోపంగా పిలుస్తుంది. నువ్వు ఏవైనా కారు ఓనర్ అనుకుంటున్నావా? నా మనవడు కారు డ్రైవర్ అనుకుంటున్నావా? వాడు వచ్చి డోర్ తీస్తే కానీ దిగవా అంటూ విరుచుకుపడుతుంది.

Karthika Deepam 2 April 16th 2024 Episode
Karthika Deepam 2 April 16th 2024 Episode

డోర్ రాకపోతే తీశారని దీప చెబుతుంది. దీప వ్యక్తిత్వం పై నిందలు వేస్తూ ఉంటుంది. తన మనవడి కారు ఎందుకు ఎక్కావని పెద్ద రచ్చ చేస్తుంది. దీపను కుక్కతో పోలుస్తూ మాట్లాడుతుంది. నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు తిప్పొద్దు.. నేను చెయ్యి తిప్పాల్సి వస్తుందని దీప గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. నా హద్దులు నాకు తెలుసు. నా హద్దులు దాటి ఎవరైనా లోపలికి వస్తే అప్పుడు మాటలు నోటికి కాదు చేతికి వస్తాయని అనేసరికి పారిజాతం భయపడుతుంది. ఇదేంటి ఇంత మాట అనేసింది ఇంకా ఎక్కువ మాట్లాడితే దీపతో తన్నులు తినాల్సి వస్తుందని భయంతో పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను వదిలేసిన విషయాన్ని ఈయన జోక్యం చేసుకుని గొడవ చేశాడు. ఇది ఇక్కడితో ఆగుతుందా అని దీపా కంగారుపడుతుంది. కార్తీక్, శౌర్య దగ్గర తన తండ్రి వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటాడు.

నాన్న కోసమే హైదరాబాద్ వచ్చామని ఆయన ఎక్కడ ఉన్నాడో తెలియదని చెబుతుంది శౌర్య. నాన్న ఇక్కడికి ఎప్పుడు వస్తాడని కార్తీక్ అడుగుతాడు. తెలియదని సమాధానం ఇస్తుంది శౌర్య. మీ నాన్న ఇక్కడికి రావడానికి ముందు తనతో బాగా ఆడుకున్నావా అంటాడు. అయ్యో కార్తీక్ అసలు నాకు మా నాన్న ఎలా ఉంటాడో కూడా తెలియదు. ఎప్పుడూ చూడలేదు కూడా. మా ఫ్రెండ్స్ కి నాన్న ఉంటే మా నాన్న ఎక్కడని అడిగాను. ఊరు వెళ్ళాడు వస్తాడని చెప్పేది అమ్మ. నువ్వు నాన్న ని ఒకసారి కూడా చూడలేదా అంటే లేదని సమాధానం ఇస్తుంది. నాన్న పేరు ఏంటని శౌర్యని అడగగా నాన్న అని చెబుతుంది. ఏంటి ఇది పుట్టినప్పటినుంచి నాన్నని చూడలేదా? అసలు పేరు కూడా తెలియదా? అసలు వాడు వీళ్ళ జీవితాలని ఏం చేశాడని ఆలోచిస్తాడు కార్తీక్. ఇక మనం ఫ్రెండ్స్ కదా నాకు ఒక హెల్ప్ చేయవా? నేను అమ్మ ఎంత వెతికినా నాన్న దొరకడం లేదు.. కాస్త నువ్వు కూడా వెతకవా? మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం.

మా ఫ్రెండ్ ని వాళ్ళ నాన్న ఎత్తుకుని స్కూల్ కి తీసుకొస్తాడు. నన్ను మా నాన్న ఎత్తుకుని స్కూల్ కి తీసుకెళ్లాలి. ఆయనతో బోల్డన్ని కబుర్లు చెప్పాలని కార్తీక్ తో చెబుతుంది శౌర్య. వెతికి తీసుకొస్తానని మాట ఇస్తాడు కార్తీక్. థాంక్స్ కార్తీక్ నువ్వు చాలా మంచి వాడివి అంటుంది శౌర్య. మా నాన్న కూడా నీలా ఉంటాడా? అని అడుగుతుంది. దీప కోపంగా శౌర్య ని అరిసి తనని తీసుకుని వెళ్ళిపోతుంది. నావల్ల జీవితానికి కొంత అన్యాయం జరిగిందని అనుకున్నాను. కానీ నీ జీవితమే అన్యాయం అయిపోయిందని ఇప్పుడే అర్థమైంది. నాన్న అంటే ఇలా ఉంటాడని పాప చాలా గొప్పగా అనుకుంటుంది. కానీ కూతురుకి తండ్రి పేరు కూడా చెప్పలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది? నిన్ను ఎందుకు వాడు పొమ్మని అంటున్నాడని కార్తీక్ బాధపడతాడు. శౌర్య మీద కోపంగా అరుస్తుంది దీప. ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలియదా? అతన్ని అలా అడగడం తప్పని దీప అంటుంది. తప్పేముంది అయితే నువ్వు నాన్న ఎలా ఉంటాడో చెప్పమని శౌర్య దీపని ప్రశ్నిస్తుంది.

నీలాగా ఉంటాడని చెప్పాను కదా అంటే కార్తీక్ కూడా నాలానే ఉంటాడని అంటుంది. కార్తీక్ చాలా మంచివాడు. ఒకవేళ మనల్ని ఎక్కువగా ఇష్టపడితే అది ప్రేమ అన్నావు కదా. నువ్వు నా మీద ఎంత ప్రేమ చూపిస్తావో కార్తీక్ కూడా నామీద అంతే ప్రేమ చూపిస్తాడు. అమ్మ అంటే నీలా ఉండాలి. మరి నాన్న అంటే ఎలా ఉంటాడు. వాళ్లందరికీ నేనంటే చాలా ఇష్టం. అమ్మమ్మ నన్ను స్కూల్లో జాయిన్ చేస్తానని చెప్పింది. కానీ నేను ఏమన్నానో తెలుసా మా అమ్మ వెళ్ళమంటేనే వెళ్తానని చెప్పాను. మా ఊర్లో ఉన్నప్పుడు చిన్నగా నాతో మాట్లాడే దానివి కానీ ఇక్కడ మాత్రం చాలా పెద్దగా మాట్లాడుతున్నావని అంటుంది. దీప బతిమలాడుతుంటే నీతో మాట్లాడను అలిగానని శౌర్య బుంగమూతి పెడుతుంది. జ్యోత్స్న బర్తడే ఏర్పాట్లు గురించి సుమిత్ర మాట్లాడుతుంది. తన బర్తడే వంట బాగా చేయించాలని అనుకుంటుంది జ్యోత్స్న.

Karthika Deepam 2 April 16th 2024 Episode
Karthika Deepam 2 April 16th 2024 Episode

అంతలో దీప వస్తే సుమిత్ర వంటలు బాగా చేస్తావంట కదా శౌర్య చెప్పిందని అంటుంది. దీపని మాట్లాడనివ్వకుండా జ్యోత్స్న పుట్టినరోజుకి వంటలు చేయాలని చెబుతుంది. వెళ్ళిపోదామని చెప్పడానికి వస్తే పుట్టినరోజు అంటారు ఏంటి? నాకు అన్నం పెట్టిన ఈ ఇంటికి వంట చేసి పెట్టి రుణం తీర్చుకుంటానని దీప అనుకుంటుంది. దీంతో వంట చేసేందుకు ఒప్పుకుంటుంది. ఇక దీప ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే బంటు ‌ తనని చూసి కనిపించకుండా పక్కకి దాక్కుంటూ వెళ్లిపోతాడు. కానీ దీప అతన్ని చూసి ఎదురుగా నిలబడుతుంది. నన్ను చూసి నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావ్? ఏమైనా తప్పు చేశావా? అని ప్రశ్నిస్తుంది. బంటు వనికి పోతు ఉంటాడు. నువ్వు ఏదో తప్పు చేశావు లేకపోతే నీ చేతులు ఇలా ఎందుకు వణుకుతాయని అంటుంది దీప. కాసేపు ఇక్కడే ఉంటే గుడి దగ్గర చేసింది గుర్తు చేసుకుంటుందని బంటు తప్పించుకోవాలని అనుకుంటాడు. దొంగతనం ఏమైనా చేసావా అని దీపా అడిగితే నేనెందుకు దొంగతనం చేస్తాను నేను పారిజాతం అమ్మగారికి నమ్మిన బంటుని అని చెప్పి తప్పించుకుంటాడు బంటు. ఇక ఇతన్ని నేను ఎక్కడో చూసినట్లు అనిపిస్తుందని దీపా ఆలోచించడం మొదలు పెడుతుంది.. అక్కడితో ఈ సీరియల్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది.

Related posts

Manam Movie: రీరిలీజ్‌కు సిద్ధ‌మైన‌ మ‌నం.. ఈ సినిమాలో శ్రియా పాత్ర‌ను మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

kavya N

SS Rajamouli: మహేష్, రాజమౌళి ప్రాజెక్టుపై వస్తున్న రూమర్స్ కి క్లారిటీ ఇచ్చిన నిర్మాణ సంస్థ..!!

sekhar

Tollywood Actress: ఒక‌ప్పుడు ర‌జ‌నీకాంత్ మూవీలో సైడ్ ఆర్టిస్ట్‌గా న‌టించిన ఈ అమ్మాయి ఇప్పుడు స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Eesha Rebba: త్రివిక్ర‌మ్ మాట‌లు న‌మ్మి దారుణంగా మోస‌పోయిన ఈషా రెబ్బ.. వెలుగులోకి వ‌చ్చిన సంచ‌ల‌న నిజాలు!

kavya N

NTR – Prashanth Neel: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీకి క్రేజీ టైటిల్‌.. అదిరిపోయిందంటున్న ఫ్యాన్స్‌!

kavya N

Prabhas: ఇట్స్ అఫీషియ‌ల్‌.. ఫైన‌ల్ గా జీవితంలోకి ఒక‌రు రాబోతున్నారంటూ ప్ర‌క‌టించిన ప్ర‌భాస్‌!

kavya N

Krishnamma: విడుద‌లైన వారానికే ఓటీటీలో ద‌ర్శ‌న‌మిచ్చిన స‌త్య‌దేవ్ లేటెస్ట్ మూవీ కృష్ణ‌మ్మ.. ఎందులో చూడొచ్చంటే?

kavya N

Krishna Mukunda Murari May 17 2024 Episode 472: ముకుంద ప్రెగ్నెంట్ అన్న భవాని. చెకప్ చేయనున్న కృష్ణ. మురారి కంగారు

siddhu

Nuvvu Nenu Prema May 17 2024 Episode 626: కూతుర్లని పుట్టింటికి తీసుకెళ్లడానికి పార్వతి ప్రయత్నం.. కృష్ణ కి వార్నింగ్ ఇచ్చిన విక్కీ…

bharani jella

Brahmamudi May 17 2024 Episode 412: లేచిపోదామన్న అప్పు.. అనామికకు విడాకులు.. కావ్య అమ్మకానికి బేరం..

bharani jella

Weekend OTT Movies: ఈ వీకెండ్ ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్ సిరీస్ ఇవే..!

Saranya Koduri

OTT: ఒకే రోజు ఓటీటీలో కి వచ్చేసిన.. తమన్నా, విశాల్ మూవీస్.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Scam 2010 Web Series: మరో సిరీస్ అనౌన్స్ చేసిన హన్సల్ మెహతా.. వైరల్ అవుతున్న పోస్టర్..!

Saranya Koduri

Manjummel Boys OTT: ఓటీటీలో దూసుకుపోతున్న మలయాల్ బ్లాక్ బస్టర్ మూవీ..!స‌స‌

Saranya Koduri

Big Boss Siri: సరికొత్త లుక్ లో సిరి హనుమాన్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri