NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600: విక్కీని కాపాడిన పద్మావతి.. పోలీసుల రాకతో దివ్య కంగారు.. పద్మావతి ని కిడ్నాప్ చేయాలనుకున్న కృష్ణ..

Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights

Nuvvu Nenu Prema April 17 2024 Episode 600:  విక్కీని కిడ్నాప్ చేయడంతో, పద్మావతి ఎటు తీసుకెళ్లారు అని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత విక్కీ చేతి కంకణం చూసి పద్మావతి అక్కడ ఉన్న పెద్దయిని అడుగుతుంది ఆయన విక్కీ వాళ్ళు ఎటువైపు వెళ్ళారో చెప్తారు. విక్కీ కిడ్నాప్ చేసిన విషయాన్ని పద్మావతి ఆయనతో చెబుతుంది ఆయన విక్కీని కొంతమంది రౌడీలు తీసుకుని వెళ్లారని చెప్తాడు దాంతో పద్మావతి రౌడీలు ఎటువైపు వెళ్ళారు అటువైపు వెళుతుంది. పద్మావతి డేన్ దగ్గరికి వెళ్తుంది. రౌడీలకి కనిపించకుండా దాక్కుంటుంది ఇక అప్పుడే పద్మావతికి తన మనసులో విక్కి ఇక్కడే ఉన్నాడు అని అనిపిస్తుంది. ఇక మరోవైపు విక్కీని కూడా రౌడీలు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు. నీ భార్య గురించి గొప్పగా చెప్పావు కదా ఏది ఇంకా రాలేదు అని అంటాడు దాస్.

Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights
Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights

ఇక పద్మావతి రౌడీలను తప్పించుకొని లోపలికి వెళ్తుంది విక్కీ ఇక్కడే ఉన్నాడని నా మనసు చెప్తుంది కచ్చితంగా ఇక్కడే ఉండి ఉంటాడు అని వెతుకుతూ ఉంటుంది. మరోవైపు దాసుతోవిక్కీ అని నన్ను కట్టేసి మీరు ఇలా చేయడం కాదు ఒకసారి కట్లు ఇప్పి చూడండి అని అంటాడు. అవును ఇందాకటి దాకా నీ భార్య వచ్చి నేను కాపాడుతుంది అని ప్రగల్ బాలు చెప్పావు ఇప్పుడే ఒకట్లు విపమంటున్నావా ఇదే ఆఖరి రోజు ఈ పెట్రోల్ నీ మీద పోసేసి నేను నిప్పంటిచ్చేస్తాను అని పెట్రోల్ మూత తీస్తాడు. ఇక విక్కీ మనసులో పద్మావతి నాకు మళ్ళీ జన్మంటూ ఉంటే నేను నీకోసం మళ్లీ పుడతాను నీ ప్రేమని నేను తృప్తిగా పొంది వెళ్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. పద్మావతి కూడా మీరు లేకుండా నేను ఉండలేను సారు మీకోసం నేను ఏదైనా చేస్తాను మీరు ఇక్కడే ఉన్నారని నాకు అర్థం అవుతుంది మిమ్మల్ని నేను ఎలాగైనా కాపాడుకుంటాను అని మనసులో అనుకుంటుంది. దాస్ పెట్రోల్ ని చూపిస్తూ విక్కికి ఇలా చివరి రోజే నీకు అని అంటూ ఉంటాడు.వెనకాలే ఉన్న పద్మావతి అది చూస్తుంది వెంటనే విక్కిని ఎలాగైనా కాపాడుకోవాలి అని అక్కడ ఉన్న పెద్ద కర్రను తీసుకొని దాస్ దగ్గరికి వెళ్తుంది. దాస్ అగ్గిపెట్ట తీసి వెలిగించి ఇక నిన్ను కాపాడ్డానికి ఎవరూ లేరు ఇక నీకు ఇదే చివరి రోజు అని అంటూ ఉండగా పద్మావతి వెనకనుంచి దాస్ తల మీద కొడుతోంది.

Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights
Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights

ఇక పద్మావతి దాస్ తల మీద కొట్టి, విక్కీని ఏమన్నా చేయాలనుకుంటే ముందుగా ఆయన భార్య నేను పద్మావతి నన్ను ఏమైనా చేయాలి నన్ను చంపిన తర్వాతే విక్కీ దగ్గరికి వెళ్ళాలి అని పద్మావతి నేను ఎలాగైనా మిమ్మల్ని కాపాడుకుంటాను సారు అని అంటూ ఉంటుంది. పద్మావతిని చూసి వికీ హ్యాపీగా ఫీల్ అవుతాడు పద్మావతి నువ్వు వచ్చేసావా అని అంటాడు నేను వచ్చేసాను సారు అనే పద్మావతి రౌడీలు అందరినీ కొడుతుంది. పద్మావతి పద్మావతి ఇక్కడ తగ్గేదేలే మీ అందరికీ నా చేతిలో ఉంది అని పద్మావతి గట్టిగా అందరు రౌడీల్ని కొడుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights
Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights

ఇక మరోవైపు ఇంట్లో పార్వతి టెన్షన్ పడుతూ ఉంటుంది పద్మావతి ఇంకా కనిపించలేదు అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అరవింద కుచల ను తీసుకొని కులదైవానికి పూజ చేయడానికి వాళ్ళ ఊరు వెళ్తుంది. నారాయణ, శాంతాదేవితో అమ్మ అరవింద అక్కడ బాగానే చేరుకున్నారు. చెప్పిన వినకుండా అరవింద పూజ చేయడానికి వెళ్ళింది అని అంటుంది శాంతాదేవి. ఇక ఆర్య తో పార్వతి పద్మావతి గురించి ఏమన్నా తెలిసిందా బాబు అని అడుగుతుంది ఆ ప్రయత్నంలోనే ఉన్నా మత్తయ్య అని చెప్తాడు పద్మావతి కనిపించకుండా ఎక్కువ సమయం అయిపోయింది ఇక సమయం గడిచే కొద్ది నాలో భయం పెరిగిపోతుంది పద్మావతికి ఏమన్నా అయిందేమోనని నాకు చాలా టెన్షన్ గా ఉంది అని అంటుంది. ఇక అప్పుడే దివ్య బయటకు వస్తుంది. నారాయణ పార్వతి మీరేం కంగారు పడకండి మేమంతా మంది ఉన్నాం కదా పద్మావతిని వెతికి తీసుకు వస్తాము అని చెప్తూ ఉంటాడు. దివ్యకి కంగారుగా ఉంటుంది. ఇక అప్పుడే నారాయణ అప్పుడు ఎస్ఐ గారు వస్తున్నారు అని అంటాడు ఇక దాంతో దివ్య కంగారు ఇంకా ఎక్కువవుతుంది ఇక అప్పుడే ఎస్ఐ గారు వస్తారు.

Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights
Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights

ఇక దివ్య అమ్మ పోలీసులు మళ్ళీ వచ్చారు ఏంట్లు దొరికిందో ఏంటో అసలు మళ్ళీ ఎందుకు వచ్చారు ఏం ఆరా తీయడానికి వచ్చారు నేను దొరికిపోతానా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది. చెప్పండి ఎస్ఐ గారు ఏమన్నా మా పద్మావతి గురించి తెలిసిందా అని పార్వతి అడుగుతుంది. దాంతో వచ్చిన పోలీసు మీ పద్మావతి గురించి ఇంకా ఏమీ తెలియలేదమ్మా ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని అంటాడు. కాకపోతే మాకు ఇప్పుడు ఇంకొక విషయం తెలిసింది మీ విక్కీ లండన్ వెళ్లలేదు లండన్ ఎయిర్ పోర్ట్ లోనే విక్కీ ని ఎవరో కిడ్నాప్ చేశారు ఆ విషయం మాకు ఇన్వెస్టిగేషన్లో తెలిసింది అని చెప్తాడు దాంతో వెంటనే దివ్య కంగారుగా అమ్మ వీళ్ళకి ఎలా తెలిసింది ఈ విషయం అంటే వీలింగ్ అన్ని విషయాలు బయటపెడతారో ఏంటో అయినా బాబు కూడా లేడు ఇప్పుడు ఏం చేయాలి ఏమన్నా తెలిస్తే నేను బావ ఇద్దరం జైల్లో కూర్చొని చెప్పకూడదు తినాల్సిందే అని కంగారుపడుతూ భయపడుతూ ఉంటుంది. ఇక శాంతాదేవి ఆశ్చర్య పోతుంది అదేంటి విక్కిని కిడ్నాప్ చేయడం ఏంటండీ అని అడిగితే అవునమ్మా విక్కిని ఎవరో కిడ్నాప్ చేశారు ఎక్కడ తీసుకెళ్లారు అన్నది ఇంకా తెలియలేదు ఇన్వెస్ట్రేషన్ జరుగుతుంది అని చెప్తాడు ఇక దాంతోపాటు మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి అమ్మ మీ పద్మావతికి విక్కిని కిడ్నాప్ చేసిన విషయం ముందే తెలుసు మా పోలీస్ స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చింది కాకపోతే మేము సరైన ఆధారాలు లేవని కంప్లైంట్ ని తీసుకోలేదు దాంతో విక్కిని కాపాడడానికి తనే స్వయంగా వెళ్లి ఇవాళ కనిపించకుండా పోయింది అని చెప్తాడు ఎస్సై దాంతో ఒక్కసారిగా పద్మావతి హనీ పార్వతి ఏడుస్తూ ఉంటుంది మీరేం కంగారు పడకండి అమ్మ విక్కీ కిడ్నాప్ కి పద్మావతి కనిపించకుండా పోవడానికి అన్నిటికీ మేము ఆధారాలతో సహా కనుక్కుంటాము ఖచ్చితంగా దోషులు ఎవరైనా శిక్షించి చేరుతాము మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాడు ఎస్ఐ. మీకు ఎవరి మీద అయినా అనుమానం ఉంటే చెప్పండి అని అడుగుతాడు. దివ్య కంగారుగా ఉంటుంది అప్పుడే పార్వతీ కృష్ణ మీద అనుమానంగా ఉంది అని చెబుదాం అనుకునే లోపు అను ఆపేస్తుంది. మీకు ఎవరి మీద అయినా అనుమానం గా ఉంటే మాకు ఫోన్ చేసి చెప్పండి అని వెళ్ళిపోతారు.

Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights
Nuvvu Nenu Prema Today Episode April 17 2024 Episode 600 highlights

ఇక దివ్య మాత్రం చాలా కంగారుగా ఇప్పుడు ఏం చేయాలి అని బావకి ఫోన్ చేద్దాం అనుకొని వెళ్తుంది. ఇక పార్వతికి ఓదార్చి శాంతాదేవి భోజనం తీసుకు రమ్మని అణువుతో చెప్తుంది మీరు ఏం కంగారు పడొద్దు ఖచ్చితంగా దోషులు ఎవరైనా సరే శిక్ష పడుతుంది వికీ పద్మావతి గురించి మీరు టెన్షన్ పడమాకండి అని అంటుంది. ఇక అప్పుడే పార్వతి ఎలా టెన్షన్ పడకుండా ఉంటాము పద్మావతి కనిపించకుండా పోవడానికి విక్కీ కిడ్నాప్ అవ్వడం ముందే తెలిసి భర్తని కాపాడుకోవడానికి వెళ్ళింది. ఇప్పుడు ఇద్దరూ ప్రమాదంలో ఉన్నారు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అంటే ఈ విషయం మాత్రం అరవింద్ ఎట్టి పరిస్థితిలో తెలియకూడదు అని నారాయణ అంటాడు. అసలు విక్కీ లండన్ వెళ్లకుండా క్యాన్సిల్ ఇవ్వడానికి కారణాలు నీకు ఏమైనా తెలుసా అని ఆర్య అని అడుగుతాడు నారాయణ నాకేం తెలియదు నాన్న అసలు ఎవరు కిడ్నాప్ చేశారో తెలిస్తే నా చేతితో నేను షూట్ చేసి పడేస్తాను అని అంటాడు ఆర్య

 

ఇక మరోవైపు విక్కీ పద్మావతి ఇద్దరూ దాస్ని వాళ్ళ గ్యాంగ్ ని మొత్తాన్ని కొట్టి అక్కడ నుంచి బయటపడతారు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత బాగా అలసిపోతారు ఎదురుగా ఆంజనేయస్వామి విగ్రహము జెండాలు ఉంటాయి వెళ్లి అక్కడికిదండం పెట్టుకొని అక్కడే కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటారు. నీకు ఎన్నిసార్లు చెప్పాను పద్మావతి నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నువ్వు రావద్దు అని అయినా వినకుండా వస్తావు అని అంటాడు విక్కి మీరు లేకపోతే నేను ఉండలేను సారు మిమ్మల్ని కాపాడుకోడానికే వచ్చాను అయితే కాపాడుకుంటాను లేదంటే మీతో పాటు చనిపోతాను అని అంటుంది. నువ్వు ఆ మాట అనడానికి కూడా నేను ఇష్టపడిన పద్మావతి నేను ఉండంగా నీకేం కాదు అని అంటాడు ఇక ఇద్దరు ఒకరికి ఒకరు హగ్ చేసుకుంటారు. మనం ఇక నుంచి ఎలాగైనా బయటపడాలి పద్మావతి అని అంటాడు సరే సారు అని ఇద్దరు అక్కడి నుంచి బయటికి వెళ్లే దారి ఎటు ఉందా అని ఆలోచిస్తూ ఉంటారు. మరోవైపు దివ్య కృష్ణ కి ఫోన్ ట్రై చేస్తూ ఉంటుంది కానీ కృష్ణ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు. దివ్య టెన్షన్ పెరిగిపోతుంది బావ కూడా ఫోన్ ఎత్తట్లేదు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి పోలీసుల కనక ఏమన్నా అనుమానం వస్తే ఏం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చి నారాయణ ఏంటి దివ్య కంగారు పడుతున్నావు అని అంటే విక్కీ పద్మావతి ఇద్దరి గురించి మా ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి కనుక్కుంటున్నాను ఎక్కడైనా కనిపించారేమోనని అని అంటుంది దివ్య దాంతో నారాయణ ఎలాగైనా సరే వాళ్ళని పట్టుకుంటామమ్మ నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాతో చెప్పు అని వెళ్ళిపోతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో విక్కీ పద్మావతి ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక అక్కడి నుంచి బయటికి వెళ్దామని అడవి మార్గం నుండి రోడ్డు కి వెళ్ళాలి అనుకుంటారు. అప్పుడే వెనకనుంచి కృష్ణ వచ్చి వికీ తల మీద కొడతాడు వికీ అక్కడే పడిపోతాడు ఇక పద్మావతిని లాక్కొని వెళ్లి జీవులకు కూర్చోబెట్టుకొని వెళ్తూ ఉంటాడు. నన్ను వదిలి అని పద్మావతి కృష్ణుని కొడుతూ ఉంటుంది. సారు వచ్చి నన్ను కాపాడండి దృష్టిలో నన్ను తీసుకెళ్తున్నాడు అని అరుస్తూ ఉంటుంది ఇక విక్కి రాలేడు పద్మావతి వికీ ఎప్పుడో పైకి పోయాడు నేను కొట్టిన దెబ్బలకి వికీ చనిపోయాడు నిన్ను ఎవరు కాపాడలేరు అని అంటాడు దాంతో పద్మావతి మా ప్రేమ గురించి నీకు తెలియదు విక్కీ నన్ను కచ్చితంగా కాపాడతాడు మా ప్రేమ నిజమైన అయితే నిన్ను కొట్టి నన్ను తీసుకెళ్తాడు మా ఆయన అని అంటుంది అప్పుడే కృష్ణ కార్ బ్రేక్ వేస్తాడు. ఎదురుగా చూస్తే విక్కీ నిలబడి ఉంటాడు. మరి విక్కీ కృష్ణుని కొట్టి పద్మావతిని కాపాడాడా లేదంటే ఇద్దరి కృష్ణ మళ్లీ కిడ్నాప్ చేశాడా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Nuvvu Nenu Prema May 22 Episode 630: అరవింద కోసం పద్మావతి చేసిన పని..? పద్మావతిని అపార్థం చేసుకొని కొట్టిన విక్కి..

bharani jella

Krishna Mukunda Murari May 22 Episode 476:ఆదర్శ్ మీరాల పెళ్ళికి భవానీ తొందర..ముకుంద చేత నిజం బయటపెట్టించిన కృష్ణ..రేపటి ట్వీస్ట్…?

bharani jella

Kalki 2898 AD: హాట్ టాపిక్ గా క‌ల్కి మూవీ ప్ర‌మోష‌న్స్ బ‌డ్జెట్‌.. మ‌రో రెండు సినిమాలు తీయొచ్చు!!

kavya N

Bengalore Rave Party: రేవ్ పార్టీ ఎంట్రీ ఫీజు అన్ని ల‌క్ష‌లా.. షాకింగ్ విష‌యాలు బ‌ట‌య‌పెట్టిన బెంగళూరు పోలీస్ కమిషనర్!

kavya N

Tollywood Young Heroes: షాకిస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోల రెమ్యున‌రేష‌న్‌.. ఒక్కొక్క‌రిది ఒక్కో రేటు!

kavya N

Harom Hara Release Date: కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన హరోం హర మూవీ టీం.. పోటీ నుంచి తప్పుకున్న సుధీర్ బాబు..!

Saranya Koduri

Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. తల్లి కాబోతున్న లావణ్య..!

Saranya Koduri

Srimukhi: శ్రీముఖి మూవీ టైటిల్ ని దొబ్బేసిన అజిత్.. రిలీజ్ కి నోచుకోలేకపోయినా తెలుగు యాంకర్ మూవీ..!

Saranya Koduri

Prabhas Kalki OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టనున్న కల్కి.. తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Dhe Promo: ఢీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరైన కాజల్.. గ్రాండ్ ఫినాలే కి చేరుకున్న ముగ్గురు కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే..!

Saranya Koduri

South Actress: ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుప‌ట్టారా.. సౌత్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ ఆమె..!!

kavya N

Karthika Deepam 2 May 21th 2024 Episode: తాళి తెంపబోయిన నరసింహ.. కాళికాదేవి రూపం ఎత్తిన దీప..!

Saranya Koduri

Kajal Aggarwal: అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి కాజ‌ల్ కు చేదు అనుభ‌వం.. కారవాన్ లో ష‌ర్ట్ తీసేసి అంత ప‌ని చేశాడా..?

kavya N

Vijayashanti: మ‌రో కొత్త సినిమాకు సైన్ చేసిన విజ‌య‌శాంతి.. ఆ మెగా హీరోకి త‌ల్లిగా రాముల‌మ్మ‌!

kavya N

Brahmamudi May 21 Episode  415:అనామిక తో విడాకులు అన్న కళ్యాణ్.. మాయని దుగ్గిరాల ఇంటికి తెచ్చిన కావ్య.. ప్లేట్ తిప్పేసిన మాయ… ఫ్యుజులు ఎగిరే ట్విస్ట్ రేపటికి..

bharani jella