NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Machilipatnam (krishna): నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న యువ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు

Share

Machilipatnam (krishna): కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ సిన్వర్ తన వివాహాన్ని నిరాడంబరంగా చేసుకున్నారు. రాజస్థాన్ కు చెందిన అపరాజిత సింగ్ అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్ర కుమార్ ను ఇవేళ వివాహం చేసుకున్నారు. మచిలీపట్నం కలెక్టరేట్ లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్టార్ సమక్షంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో అపరాజిత, దేవేంద్ర కుమార్ దండలు మార్చుకున్నారు.

ఇరువురిది పెద్దలు కుదిర్చిన వివాహమే అయినా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. ఉత్తరప్రదేశ్ కేడర్ కు చెందిన దేవేంద్ర కుమార్ ప్రస్తుతం హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిగా ఉన్నారు. ఏపీ క్యాడర్ కు చెందిన అపరాజిత సింగ్ వృత్తిరీత్యా వైద్యురాలు. హర్యానాలోని రోహ్ తక్ లో అపరాజితా సింగ్ ప్రాధమిక విద్య పూర్తి చేశారు. 2017 లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన తర్వాత తొలిసారి యూపీఎస్సీ పరీక్షలకు హజరై తొలి ప్రయత్నంలో విజయం సాధించలేకపోయారు.

రెండో ప్రయత్నంలో భాగంగా 2018 సివిల్స్ పరీక్షల్లో 82వ ర్యాంక్ సాధించారు. అపరాజిత తల్లిదండ్రులు డాక్టర్ నీతా, డాక్టర్ అమర్ సింగ్ లు రాజస్థాన్ లోని భరత్ పూర్ వైద్య వృత్తి లో ఉన్నారు. వివాహరం అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. అయితే వివాహం అయిన నేపథ్యంలో ఇద్దరిలో ఎవరు తమ క్యాడర్ మార్చుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరో వివాదంలో రాహుల్ గాంధీ .. స్పీకర్ కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు ..ఎందుకంటే..?


Share

Related posts

లంచ్ బాక్స్‌లో గ్రనేడ్

sarath

AP High Court: అప్పుడు తమ్మినేని ..! ఇప్పుడు మోదుగుల..!!

somaraju sharma

కరోనా విషయంలో ఇండియా ని మెచ్చుకున్న చైనా..!!

sekhar