NewsOrbit
జాతీయం న్యూస్ రాజ‌కీయాలు

మరో వివాదంలో రాహుల్ గాంధీ .. స్పీకర్ కు బీజేపీ ఎంపీలు ఫిర్యాదు ..ఎందుకంటే..?

Advertisements
Share

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై సుప్రీం కోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో లోక్ సభ్య సచివాలయం ఆయనపై విధించిన అనర్హత వేటును ఎత్తివేసింది. దీంతో లోక్ సభ సమావేశాలకు రాహుల్ గాంధీ యథావిధిగా హజరు అవుతున్నారు. అయితే ఇవేళ లోక్ సభలో రాహుల్ గాంధీ తనను చూసి ప్లయింగ్ కిస్ ఇచ్చారని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. ఈ మేరకు బీజేపీ ఎంపీలు స్పీకర్ కు ఫిర్యాదు చేయడంతో అధికారులను సీసీ పుటేజీ పరిశీలించాలని ఆదేశించారు.

Advertisements

బుధవారం పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానంపై మాట్లాడి వెళ్లిపోయే క్రమంలో రాహుల్ తనను ఉద్దేశించి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చారని స్మృతి ఇరానీ ఆరోపించారు. కేవలం స్త్రీద్వేషి మాత్రమే ఇలా తమ స్థానంలో కూర్చున్న మహిళా ఎంపీలను చూసి ప్లయింగ్ కిస్ ఇస్తారేమో అంటూ రాహుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఆమె. తన చేష్టల ద్వారా ఆయన అగౌరవంగా వ్యవహరించారంటూ మండిపడ్డారు.  తొలుత పార్లమెంట్ లో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ, మోడీ సర్కార్ పై విరుచుకుపడగా, కౌంటర్ గా స్మృతి ఇరానీ ఆవేశపూరితంగా ప్రసంగించారు.

Advertisements

అయితే రాహుల్ పార్లమెంట్ ను ఉద్దేశించి ప్లయింగ్ కిస్ ఇచ్చినట్లుగా వీడియోలో ఉందని కాంగ్రెస్ ఎంపీలు చెబుతున్నారు. ఈ మేరకు స్పీకర్ ను కలిసి బీజేపీ అనవసర రాద్దాంతం చేస్తొందని వివరణ ఇస్తున్నట్లు సమాచారం.

Car Accident: విశాఖలో కారును ఢీకొన్న రైలు .. కారు నుజ్జునుజ్జు.. విశేషం ఏమిటంటే..?


Share
Advertisements

Related posts

రిలయన్స్ జియో రూ. 11 ఆఫర్ అదుర్స్..!! మిగతా కంపెనీలకు గట్టి పోటీ..!!

bharani jella

ఎన్డీయేకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ గుడ్ బై?

Siva Prasad

ఎన్నిక‌ల టైంలో కేసీఆర్‌కు కోర్టు ఆర్డ‌ర్ షాకిచ్చిన‌ట్లే క‌దా

sridhar