NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Car Accident: విశాఖలో కారును ఢీకొన్న రైలు .. కారు నుజ్జునుజ్జు.. విశేషం ఏమిటంటే..?

Advertisements
Share

Car Accident:  గాడ్ గ్రేస్ అంటే ఇదేనేమో..పెద్ద ప్రమాదం జరిగింది.. రైల్వే ట్రాక్ పై నిలిచిపోయిన కారును ట్రైన్ ఢీకొట్టింది. కారు నుజ్జు అయ్యింది. కానీ కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. భగవంతుడి దయే కారణమని వారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన విశాఖలోని షీలానగర్ పోర్టు రోడ్డు మారుతీ సర్కిల్ వద్ద ఈ తెల్లవారుజామున జరిగింది. ఈ ఘటనలో కారుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎవరికీ ఏమీ కాకుండా ప్రమాదం నుండి బయటపడటం నిజంగా అదృష్టం అంటూ నెటిజన్ లు కామెంట్స్ పెడుతున్నారు.

Advertisements

 

వివరాల్లోకి వెళితే..రిటైర్డ్ నేవీ అధికారి కుటుంబం శ్రీహరి పురం నుండి విశాఖ సిటీకి వెళ్లే క్రమంలో పోర్టు నుండి వేర్ హౌజ్ లకు వెళ్లే రైల్వే లూప్ లైన్ పై వీరి కారు అకస్మాత్తుగా ఆగిపోయింది. అదే సమయంలో ఆ లైన్ పై ట్రైన్ దగ్గరగా వస్తుండటంతో కారులో ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఆందోళనకు గురైయ్యారు. ట్రాక్ పై కారు ఆగి ఉండటాన్ని గమనించిన లోకో పైలట్ రైలును స్లో చేశాడు. ప్రమాదాన్ని గమనించిన కారులోని వాళ్లు కారు డొర్లు తెరచి బయటకు దుకేశారు. క్షణాల వ్యవధిలోనే ట్రైన్ కారును ఢీకొట్టింది. కారు నుజ్జునుజ్జు అయ్యింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ప్రమాదంపై గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే బాధితులు తమ వివరాలు చెప్పవద్దంటూ పోలీసులకు విజ్ఞప్తి చేయడంతో వారి వివరాలు వెల్లడించలేదు.

Advertisements

బాబుకు బిగ్ షాక్ .. చంద్రబాబు తదితరులపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు


Share
Advertisements

Related posts

Naga chaithanya : నాగచైతన్య చాలా బిజీ..ఎన్ని సినిమాలను కమిటయ్యాడో తెలుసా..

GRK

RaghuramaKrishnamraju case: టీవీ 9 కి రఘురామకృష్ణంరాజు షాక్.. లెక్కలు, ఆధారాలతో సహా స్ట్రాంగ్ లీగల్ నోటీసు..!!

Srinivas Manem

Weight Loss: నిద్రపోతూ కూడా బరువు తగ్గొచ్చు..!! ఎలాగంటే..!?

bharani jella