Ennenno Janmala Bandham ఆగస్టు 9 ఎపిసోడ్ 473: వేద పాత జ్ఞాపకాలను ఇలా గుర్తు చేసుకుంటుంది… ఇలా జ్ఞాపకాలతో మొదలవుతుంది ఈ రోజు ఎన్నెన్నో జన్మల బంధం ఎపిసోడ్… ఒక జ్ఞాపకంలో యశ్ వచ్చి వేద ని వెనుక నుండి వాటేసుకుంటాడు.అప్పుడే వచ్చారు ఏంటి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అన్నారు కదా అని వేద అంటుంది.చాలా టైం పట్టేది కాని నేను ఆ మీటింగ్ త్వరగా క్లోజ్ చేసుకొని వచ్చాను అని యశ్ అంటాడు.ఎందుకో అని అడుగుతుంది వేద. ఎందుకు అంటావ్ ఏంటి నీకు తెలియదా అని అంటాడు యశ్. సరే నాకు ఆకలి వేస్తుంది తిందాం రా అంటాడు. ఫైవ్ స్టార్ హోటల్ అక్కడ గ్రాండ్ గా ఉంటుంది అన్నారు, ఇంట్లో వంట తింటాను అంటారు ఏంటి ఇది అంత బాగుటుందా అని అంటుంది వేద.

అవును నువ్ వచ్చాక బయట వంట ఒంటికి పట్టడం లేదు…నువ్ ప్రేమతో చేస్తావ్ అదే తేడా అని యశ్ అంటాడు.కాని మీరు రారు అనుకోని మేము అందరం తినేసాం కొంచమే ఉంది అని వేద అంటుంది. కొంచం ఉన్న చాలు నువ్వు ప్రేమతో చేసావ్ కదా ఆది చాలు అంటాడు. వేద వడ్డిస్తుంది. ఆగండి నా కోసం మీటింగ్ త్వరగా పూర్తి చేసుకొని వచ్చారు కదా నేను తినిపిస్తాను అని వేద తినిపిస్తుంది. తినిపిస్తూ కబుర్లు చెప్తుంది ఇద్దరు సరదగా మాట్లాడుకుంటారు.ఆ జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటుంది.

అయ్యో ఆయన ఆకలి తో ఉన్నారేమో అని అనుకుంటుంది. కట్ చేస్తే…మాలిని వచ్చి రత్నం అసలు ఏం జరుగుతుంది అని అడుగుతుంది. కేసు ఏసీపీ పరిధిలోకి వెళ్ళింది ఆవిడతో వేద మాట్లాడింది, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, వాళ్లకు ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి అంట మళ్ళీ మళ్ళీ స్టేషన్ చుట్టూ తిరగడం ఎందుకు మొత్తం పూర్తి అయ్యాక వస్తా అని వేద చెప్పింది అంట అని రత్నం అంటాడు.ఇంత చెడ్డదా ఈ ప్రపంచం చిన్న పిల్ల అని చూడకుండా ఖుషి తో అలా ఎలా మాట్లాడుతారు అని మాలిని అంటుంది.

బాధ పడకండి వదిన,ఒక సామెత చెప్తారు కాసే చెట్టుకే రాళ్లు తగులుతాయి అలాగే మంచి వాళ్ళకే కష్టాలు సహించక తప్పదు అని వేద వాళ్ళ అమ్మ చెప్తుంది.బరిస్తాం సులోచన బరిస్తాం సహిస్తాం అది మన పర్సనల్ అసలు ఏం జరిగిందో ఎవ్వరికి తెలియదు రూల్స్ కి లేని తొందర వీళ్లకు ఎందుకు ముందే వీళ్ళు ఇట్లా జడ్జిమెంట్ ఇచ్చేస్తే ఎలా అని మాలిని అంటుంది. తప్పదు మాలిని అందరు ఒకేలా ఉంటారా చెప్పు కొంత మందికి కాలా క్షాపనికి ఏవో కధలు కావాలి చిన్న దాన్ని పెద్దది చేసి ఆనంద పడతారు వాళ్ళ గురించి వదిలేయ్ మాలిని అని అంటాడు రత్నం.

అది పసి పిల్ల ఖుషి ఏం తెలుసు పిల్లల మనసు కాస్త పడకూడదు అని మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఎంత జాగ్రత్త పడుతున్నాము అని మాలిని అంటుంది. పోనిలే వదిన ఈ రోజు కాకపోతే రేపు అయినా పిల్లలకు నిజం చెప్పక తప్పదు కదా అది ఏదో ఈ విధంగా తెలిసింది అనుకుందాం బాధ పడకండి అని సులోచన అంటుంది.అవును మనందరికీ సహనం అవసరం మనం ఇంత మంది ఉన్న వేద ఎంతో సహనం తో ఎంతో ఓపిక తో అన్ని తను అయ్యి ఎలా పరుగులు పెడుతుంది చూడు మనం తనకి సపోర్ట్ గా ఉందాం మాలిని అని రత్నం అంటాడు. అవును చెల్లెమ్మ ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ అందరం ఒకే మాట మీద ఉందాం ఆపైన ఆ దేవుడే చూసుకుంటాడు అని సులోచన వాళ్ళ భర్త అంటాడు.కట్ చేస్తే,ఏసీపీ చెప్పు అని యశ్ ని అంటుంది.

మీరు అడిగితే నేను చెప్పను ప్రశ్న ఉంటే సమాధానము ఉంటుంది ప్రశ్నించకుండ చెప్పేది ఏదో కాలక్షేపం కబుర్లు అని యశ్ అంటాడు. కొంచం పొగరు ఎక్కువ అనుకుంట అని ఏసీపీ అంటుంది. అభిప్రాయం చెప్పడం పొగరు ఎలా అవుతుంది మేడం అని యశ్ అంటాడు. నా సర్వీస్ లో నా ముందు కూర్చొని ఇంత దైర్యంగా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరు అని ఏసీపీ అంటుంది.నా లైఫ్ లో కూడా ఒక పోలీస్ ఆఫీసర్ ముందు కూర్చొని మాట్లాడిన సందర్భం లేదు అని యశ్ అంటాడు. తెలివిగా మాట్లాడుతున్నావు వేద అనగానే, యశ్ నా భార్య అంటాడు.చాలా తెలివైంది అనుకుంట అని అంటుంది. అవును అని యశ అంటాడు.నీకు బాగా సపోర్ట్ గా ఉంటుందా. ఉంటుంది అంటాడు.

ఏదైనా క్రైమ్ బయట పడేయడానికి తన తెలివి బలం అన్ని ఉపయోగిస్తుంది అనుకుంట అంటుంది. యశ్ నవ్వుతు, మేడం సైన్స్ స్టూడెంట్ ని ఇంటర్నేషనల్ మీద ప్రశ్నలు అడిగితే ఏం చెప్తాడు అని అంటాడు.నా భార్య ఒక డాక్టర్ క్రైమ్ లో సహకరిస్తుంది అంటే ఏం చెప్పాలి.సంబంధం లేని ప్రశ్న.మాళవిక ఎవరు తనని ఎందుకు వదిలివేశావ్ అని ఆడుతుంది.తను నా మెదటి భార్య తనే నన్ను వదిలేసింది తన ఆలోచనలు ఎవరికీ నచ్చలేదు.సరే నువ్వు వేళ్ళు. వేద యశ్ కోసం భోజనం తీస్కొని వస్తుంది.