Ennenno Janmala Bandham ఆగస్ట్ 8 ఎపిసోడ్ 472: ఏంటో చెప్పు అంటుంది ఏసిపి… మా వారు గురించి అని అంటుంది వేద. ఎవరు మీ వారు తల తోక ఏమి ఉండదా అది కూడా నేనే అడిగి తెలుసుకోవాలా అని చిరాకు పడుతుంది ఏసీపి. యశోదర్ గారు అని సమాధానం చెప్తుంది వేద. ఆయన ఎలాంటి తప్పు చేయలేదు అంటుంది వేద ఏమండీ ఏమండీ… తమాషాకి నా మొగుడు హత్య చేశాడు ఆయన ని అరెస్ట్ చేసుకోండి అని ఏ ఆడదైనా చెప్తుందా, ఈ ప్రపంచంలో ప్రతి భార్యకి తన భర్త మంచివాడే అని ఎసిపి అంటుంది.

మేడం మీకు ఇది రొటీన్ కావచ్చు కానీ మంచి మనిషికి డిఫరెన్స్ ఉంటుంది కదా అలా ఎందుకు ఆలోచించడం లేదు అని వేదా అంటుంది. మావారు క్రిమినల్ అని ఎలా నమ్ముతున్నారు. నేను నీకు ఆన్సర్ ఇవ్వాలి అని ఏసిపి అంటుంది. మీ ఇంట్లో ఏదో వేడుక జరిగిందనుకుంటా, అందులో అందరి ముందు ఆవేశం తోటి మీ ఆయన నిన్ను చంపేస్తా అని మాళవిక మీద గన్ పెట్టాడా లేదా అని ఏసిపి అడుగుతుంది. పెట్టారు అని చెప్తుంది వేద. అయిపోయింది నువ్వే ఒప్పుకున్నావు కదా, మర్డర్ అటెంప్ట్ చేశాడని అతని ఇంటెన్షన్ అదే అని ఏసీపి అంటుంది. మేడం మీకు పెళ్లి అయిందా, మేడం మీరు ఒక పోలీస్, నేనొక డాక్టర్ని రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నాను, ముఖ్యంగా మనం ఆడవాళ్ళం రెండు మాటలు మాట్లాడుకోవడంలో తప్పేముంది చెప్పండి మీకు పెళ్లి అయిందా అని వేద అడుగుతుంది. అయ్యింది అని ఏసిపి చెప్తుంది.

ఎక్కడుంటారు అని అడుగుతుంది. భువనేశ్వర్ లో ఉంటారు అని చెప్తుంది ఏసిపి. ఇక్కడ ఉండరా, సరే పిల్లలు మేడం అని వేద అడుగుతుంది. ఇద్దరు పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు. సరిపోయింది మీరు ఒకచోట మీ వారు ఒక చోట మీ పిల్లలు ఇంకో చోట మీ మధ్య రిలేషన్స్ ఎమోషన్స్ అసలు ఏమి ఉండవు, అప్పుడప్పుడు చుట్టపు చూపుకి కలుస్తారు దూరపు బంధువులు లాగా విడిపోతారు పొడి పొడి సంబంధాలు.ఏయ్ ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు? అని ఏసిపి అంటుంది.

ఉన్న మాటే ఉమ్మడిగా ఉంటే ఆ లైఫ్ వేరు చెట్టుకొకరు పుట్టకొకరు అన్నట్టు విసిరేసినట్టు తలా ఒకచోట ఉంటే ఎందుకు ఆ లైఫ్ అసలేముంది ఆ జీవితంలో ఫుల్ వేస్ట్ పరమ వేస్ట్ అని వేద అంటుంది. ఏయ్ ఇంకొకసారి ఆ మాట మాట్లాడవంటే చంపేస్తాను అంటుంది ఏసిపి. చంపేస్తారా చంపుతారా చంపండి చంపండి చంపరు చంపలేరు ఎందుకంటే అది ఒక ఎమోషనల్ సిచువేషన్ భయం ఈ ప్రపంచంలో చాలామంది ఎదుటి వాళ్ళని చంపేస్తాం అన్న సందర్భాలు చాలా ఉన్నాయి వీళ్ళందరూ నిజంగానే చంపేశారా అదే జరుగుంటే ఈ నేల మీద పచ్చటి పై ర్లు సెలయేర్లు ఇవి ఏవి ఉండేవి కావు తడి ఆరని రక్తపు మరకలే ఉండేది మా వారు కూడా అంతే మేడం ఏదో ఎమోషనల్ సిచువేషన్లో జస్ట్ అలా అన్నారు కానీ అది ఆయన ఇంటెన్షన్ కాదు అసలు ఆయనకి అటువంటి ఇంటెన్షన్ లేదు సారీ మేడం మీ పర్సనల్ విషయాలని నేను క్రిటిసైజ్ చేశాను కానీ క్లారిఫై చేయడానికి మాత్రమే నన్ను క్షమించండి అని వేద అంటుంది.

పర్వాలేదు అని ఏసిపి అంటుంది. నేను మిమ్మల్ని నమ్మండి అని అనడం లేదు కానీ యశోదర్ అనే వ్యక్తి అలాంటి వాడు కాదు అని ఆలోచించండి నేను మాత్రం పూర్తిగా సంపూర్తిగా యష్ ని నమ్ముతున్నాను భార్యగా మాత్రమే కాదు తన గురించి తెలిసిన దానిగా అసలు నాకు నవ్వొస్తుంది ఆయన మీద ఇలాంటి నిందా ఎవరా అని. అది వేసింది అభిమన్యు అని ఏసిపి అంటుంది. కట్ చేస్తే అభిమన్యు మాళవిక కి కర్మకాండ చేస్తూ ఉంటాడు. పూజ పూర్తవుతుంది పంతులు వెళ్లిపోతాడు.

ఎంతో కాలం నీతో జీవితం పంచుకున్నాను మాళవిక ఆ రోజులు ఆ క్షణాలు నేను ఎలా మర్చిపోగలను నిజం నాకు బాధేస్తుంది పురోహితుని పిలిచి సాంప్రదాయ పద్ధతిలో నేను ఈ కార్యక్రమం వేసేవాడిని కానీ నలుగురు నానారకాలుగా అనుకుంటారని శాంతించాల్సిన నీ ఆత్మ గోషిస్తుందని ఈ కార్యక్రమం ఇలా ఏర్పాటు చేశాను నిన్ను కాపాడుకోలేక పోయాను అని అభిమన్యు అనుకుంటాడు. ఇంతలో నీలిమ, అభి ఫ్రెండ్, వాళ్ళ అక్క వస్తారు.

బతికుండగానే పిండం పెట్టడం పాపంరా అని వాళ్ళ అక్క అంటుంది. మాళవిక చనిపోయింది ఆ యశ్ గాడు చంపేశాడు. ఏదో ఫంక్షన్ లో గొడవ అయింది అంట అక్కడే చంపేయబోయాడు కానీ రాత్రి ఎవ్వరు లేని చోటుకి తీసుకెళ్లి చంపేసాడంట. మీరు దండం పెట్టుకొని తన ఆత్మ శాంతించాలని దండం పెట్టుకోండి. అ యష్ ని అరెస్ట్ చేశారా.

వాడు ఏమైపోయాడు అన్నది నాకు అనవసరం, కానీ చనిపోయేటప్పుడు ఎంత బాధ పడిందో అని తలుచుకుంటుంటే గుండె తరుక్కుపోతుంది. ఇలాంటి సమయంలోనే గుండె నిబ్బరం చేసుకోవాలి అంటుంది నీలాంబరి. నీలాంబరి అలా మాట్లాడకు ప్లీజ్ అంటాడు అభి.మొన్ననే అనుకున్నాను తను ఎలా ఉందో ఒకసారి కలిసి కనుక్కుందాము అనుకున్నాను ఇంతలోనే ఇలా జరిగింది, మాళవిక నన్ను క్షమించు ని జ్ఞాపకం గా ఏదైనా కార్యక్రమం మొదలు పెడతాను నలుగురు నీ పేరు చెప్పుకునేలా చేస్తాను.ఖుషి వచ్చి ఒక కథ చెప్పమని అడుగుతుంది ఎప్పుడు చెప్పే కథ చెప్తావు కదా అమ్మ అంటుంది.కట్ చేస్తే వేద యశ్ గురించి ఆలోచిస్తుంది.