NewsOrbit
Entertainment News Telugu TV Serials

Ennenno Janmala Bandham: యష్ మాళవికను చంపేశాడు అని దుర్గ ఆరోపణలు…యష్ అరెస్ట్ గురించి తీవ్ర దిగ్బ్రాంతిలో మాలిని!

Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights

Ennenno Janmala Bandham ఆగస్టు 7 ఎపిసోడ్ 471:  కారు మీద అడ్డుపడి ఆపండి, ఏమండీ నన్ను కూడా తీసుకెళ్లండి నేను కూడా వస్తా అని వేదస్విని అనడంతో ఎన్నెన్నో జన్మల బంధం ఈ రోజు ఎపిసోడ్ ఆగస్టు 7 ఎపిసోడ్ 471 మొదలవుతుంది. నేను అలా వెళ్లి ఇలా వచ్చేస్తాను వేదా అంటాడు యష్. మేడం మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి అని పోలీస్ వాళ్ళు యష్ ని అక్కడ నుంచి తీసుకువెళతారు. కట్ చేస్తే ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. మాలిని ఏడుస్తూ ఉంటుంది. వేద ఇంట్లోకి వస్తుంది. అత్తయ్య ఎందుకు ఏడుస్తున్నారు మీరే చెప్పండి మీ అబ్బాయి తప్పు చేస్తాడా అని వేద అడుగుతుంది, యష్ ఎప్పటికీ తప్పు చేయడు అని మాలిని అంటుంది.

Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights

బాధ వల్ల ఏడవడం వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు ధైర్యంగా ఉంటేనే మనం ఏదైనా చేయగలం, అమ్మ నువ్వు చెప్పు మీ అల్లుడు మీద మీకు నమ్మకం లేదా, నమ్మకం లేకపోవడం ఏంటమ్మా కానీ పోలీసులు అంటుంది వేద వాళ్ళ అమ్మ. వాళ్లేదో మిస్ అండర్ స్టాండ్ చేసుకొని తీసుకువెళ్లారు అంతే. మనం ఏదైనా తప్పు చేస్తేనే భయపడాలి లేదంటే ధైర్యంగా ఉండాలి. ఏదైనా మంచి జరిగే ముందు ఒక చెడు జరుగుతుంది అంటారు ఇది కూడా అంతే తను చనిపోవాలని తనని చంపాలని మనం ఎవరం అనుకోలేదు విధిని ఎవరు మార్చలేరు కానీ తప్పు ఆయన చేశారని నేను అనుకోవడం లేదు మీరెలా ఆయనని వదిలి ఉండలేరు ఆయన కూడా మిమ్మల్ని వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేరు అలాంటిది ఆయన ఎందుకు ఇలా చేస్తారు నేను పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుసుకొని వస్తాను అంటుంది వేద. నేను కూడా వస్తాను అంటాడు రత్నం. మావయ్య మీరు నాతో రావడం కన్నా మీరు ఇక్కడ ఉండడమే అవసరం.

Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights

బంధం కోసం మీ అందరి అనుబంధం కోసం ఆయన తప్పకుండా వస్తారు అని వెళ్తుంది వేద. ఇంతలో ఖుషి వస్తుంది, అమ్మా అని పిలుస్తుంది. వేద ఖుషి నీ దగ్గరికి పిలిచి హగ్ చేసుకుంటుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మ అని అడుగుతుంది ఖుషి. నేను క్లినిక్ కి వెళ్తున్నాను, వచ్చేటప్పుడు నీకోసం నీకు ఇష్టమైన చాక్లెట్ తీసుకొస్తాను. నాకు చాక్లెట్ వద్దమ్మా, నన్ను ఆదిత్య అన్నని డాడీ బయటకి తీసుకెళ్తాను అన్నారు, డాడీ ఎక్కడ కనిపించడం లేదు అని అంటుంది ఖుషి. డాడీ ఆఫీస్ కి వెళ్లారు కదా అంటుంది వేద. ఆఫీస్ కి వెళ్లారు అంతే కదా ఒకసారి ఫోన్ చెయ్ అమ్మ నేను రమ్మంటే డాడీ ఎక్కడున్నా వచ్చేస్తారు. అది విన్న వేద బాధతో ఏడుస్తుంది. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావ్ అంటుంది ఖుషి. ఏడవట్లేదు అమ్మ కంట్లో ఏదో పడినట్టుంది అందుకే ఈ కన్నీళ్లు, డాడీ ఆఫీస్ లో చాలా ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నారు, అది అవ్వగానే వచ్చేస్తారు, ఇప్పుడు ఫోన్ చేస్తే బాగుండదు సరేన అని అంటుంది వేద. నువ్వు డాడీ త్వరగా వచ్చేయండి, బయటకి వెళ్దాం.

Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights

సరే నేను వెళ్లి వస్తాను అని వెళుతుంది వేద. కట్ చేస్తే ప్రజాపతి పోలీస్ స్టేషన్ కి వస్తాడు ఎవర్రా నా మనిషిని ఆరస్టు చేసింది పిలువు ఏసీపీని అంటాడు. మీ కొడుకో కూతురో చచ్చిపోతే నీకు నష్టం కాదా అని ఏసిపి అంటుంది. వాళ్లు వేరు నేను వేరు అంటాడు ప్రజాపతి. ఇదంతా కాదు మేడం మీరు రేటెంత చెప్పండి అంటాడు. ఏమన్నావ్ అని చెంప పగలగొడుతుంది. నాకు లంచం ఇస్తావా అని అంటుంది ఏసిపి. నన్ను కొడతావ్ ఏంటి ఏ కానిస్టేబుల్ మీరేనా చెప్పండి అయ్యా. నీ సంగతి చూస్తా అని ప్రజాపతి అంటాడు. ఏ సి పి గన్ తీసి పాయింట్ బ్లాంక్ లో పెడుతుంది. ఏ ఏందయ్యా ఇది కొడుతుంటే ఆపరా అంటాడు ప్రజాపతి. కానిస్టేబుల్స్ అందరు కలిసి ప్రజాపతిని కొడతారు.ఈ పూటకి ఇది చాలు, లోపలేసి పూట పూటకి పెట్టండి అంటుంది ఏసిపి. ఇంతలో పోలీసులు యశ్ ని తీసుకొని వస్తారు. మేడం నేను ఒక గౌరవప్రదమైన సొసైటీలో ఉన్నాను. ఏంటి నీ సొసైటీ ఆడదాన్ని చంపడమా. మేడం ఆ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు నేను క్రిమినల్ ని కాదు. ఏంటి నోరులేస్తుంది ఇదేమైనా మీ బాబు గారి ఇల్లు అనుకుంటున్నావా.

Ennenno Janmala Bandham Serial Today Episode August 7 2023 E471 Written Update
Ennenno Janmala Bandham Serial Today Episode August 7 2023 E471 Written Update

తప్పు చేసిన వాడు ఎవడైనా ఇక్కడ ఒకటే. తప్పు చేసిన తప్పు చేసిన ఒప్పుకుంటాడా, తన తప్పుని వేరే వాడి మీద రుద్దడం మనిషి నైజాం ఇది నేను నమ్మే నిజం, ఓ ఆడదానికి అన్యాయం జరిగితే వాళ్ళ అంతు చూడడం నా సిద్ధాంతం. ఇన్స్పెక్టర్ తీసుకెళ్లి సెల్లో వేయండి అని అంటుంది ఏసిపి.యశ్ సెల్లో ఉండి బాధ పడుతూ ఉంటాడు. వేద పోలీస్ స్టేషన్ కి వస్తుంది, యశ్ ని సెల్ లో చూసి దగ్గరికి వస్తుంది. మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నానండి. తప్పదు లేదా, పిల్లలు ఎలా ఉన్నారు. వాళ్లకి చెప్పకపోవడమే మంచిది పసిపిల్లలు తట్టుకోలేరు. మీరు తట్టుకోగలుగుతున్నారా అంటుంది వేద. ఇలాంటి కష్టాలు ఇంతకు మించిన మనో వేదాలు ఎన్నో అనుభవించాను నేను అంటాడు యష్.

Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights
Ennenno Janmala Bandham Today Episode August 7 2023 Episode 471 Highlights

అవన్నీ అప్పుడు మాళవిక వల్లే ఇప్పుడు కూడా మాళవిక వల్లనే, చరిత్ర పునరావృతం అవుతుందంటారు కానీ ఇలా అవుతుంది అనుకోలేదు, వేద నేను ఓ మాట చెప్పనా సమస్యను చూసి మనం భయపడితే అది అనకొండలా మారి మనల్ని మింగేస్తుంది తరిమి తరిమి కొడితే అదే సమస్యని ఓ అలాగా అనుకొని సరే అదే సమస్యని మనం ఫేస్ చేయాలి చేద్దాం ఏమవుతుంది ఏమీ కాదు కదా అని మనం ప్రిపేర్ అయితే ప్రాబ్లం చిన్నది అయిపోతుంది అదే అలా వనికి వెళ్లిపోతుంది ఇక్కడ ప్రాబ్లం కాదు మన మెంటల్ స్ట్రెంత్ ఇంపార్టెంట్. నాకు ధైర్యం చెబుతున్నారా అంటుంది వేద. ఇంతకుముందు ఇలాంటి సిచువేషన్ రాలేదు కదా వేద. ఇలా ఎలా ఉండగలుగుతున్నారండి. ఎలా ఉన్నాను వేద ఇంట్లో ఉన్నట్టే ఉన్నాను, కాకపోతే మీకు దూరంగా ఒంటరిగా, రిలీఫ్ కోసం నాకు తోడుగా నువ్వు ఉన్నావు కదా.

Ennenno Janmala Bandham Serial Today Episode August 7 2023 E471 Written Update
Ennenno Janmala Bandham Serial Today Episode August 7 2023 E471 Written Update

ఇంతలో ఎస్ఐ వస్తాడు. ఎస్సై గారు మీరు చాలా తప్పు చేస్తున్నారు, మా ఆయన గారి మాటలు వినండి. ఈ కేసుని ఏసీపి దుర్గ గారికి అప్పచెప్పారు ఏమైనా ఉంటే ఆవిడతో మాట్లాడండి. వేద దుర్గా దగ్గరికి వెళుతుంది. మేడం నేను వేద, మీతో మాట్లాడాలి. నువ్వు ఎవరైతే నాకేంటి కనీసం పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలని తెలియదా నీకు. ఇంకేమైనా నీళ్ల లోపలికి వచ్చేసి నేను మాట్లాడాలి నువ్వు వినాలి అంటే. ఎపిసోడ్ ముగుస్తుంది.

Related posts

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N