తిరుమలలో 900 ఏండ్ల ఉత్సవాలు !

తిరుమల శ్రీవారి ఆలయంకు ఎదురుగా ఉన్న శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ మఠం స్థాపించి 900 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రోత్సవాలు ఆదివారం నిర్వహించారు.

శ్రీశ్రీశ్రీ రామానుజులవారు తిరుమలలో పెద్ద జీయర్ మఠం స్థాపించిన విషయం విదితమే. ఈ మఠానికి మొదటి పెద్ద జీయర్ అయిన శ్రీశ్రీశ్రీ తిరువేంగడ రామానుజ జీయర్ తిరునక్షత్రమును పురస్కరించుకొని మఠంలోని శ్రీ రామానుజాచార్యుల సన్నిధిలో నాళాయరా దివ్య ప్రబంధం, శాత్తుమొర గత 10 రోజులుగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీ శ్రీ చిన్న జీయర్ స్వామి, శిష్యు బృందం పాల్గొన్నారు. ఈ తిరునక్షత్రోత్సవాల సందర్బంగా సోమవారం సాయంత్రం శ్రీశ్రీ శ్రీ పెద్ద జీయర్ స్వామివారికి శ్రీవారి ఆలయం నుండి పడి సమర్పించనున్నారు.