NewsOrbit
దైవం

కర్పూరంలో ఎన్ని రకాలు ఉన్నాయి.. ? వాటిలో భీమసేని కర్పూరం యోక్క ప్రాధాన్యత ఏమిటంటే..?

Share

కర్పూరంను హిందువులు తమ పూజా కార్యక్రమాలలో దేవుడికి హరతికి ఇవ్వడానికే కాకుండా అన్ని ఆహార పదార్ధాలల్లో కూడా ఉపయోగిస్తుంటారు. ఇది మైనంలా స్వచ్చమైన తెల్లదనంతో పారదర్శకంగా ఉండే ఒక ఘాటైన వాసన గల పూజా ద్రవ్యం. అయితే ఇది రసాయనాలలో కృత్రిమంగా తయారైందని చాలా మంది అనుకుంటారు కానీ కార్పూరం ప్రకృతి ప్రసాదం. కర్పూరం చెట్టు నుంచి లభిస్తుంది. కర్పూరాన్ని కాంఫర్ లారెల్ లేదా సన్ని మొముం క్యాంఫొర అనే చెట్ల ఆకులు, కొమ్మల నుండి తయారు చేస్తారు. కర్పూర చెట్ల కాండం మీద గాట్లు పెడతారు. ఆ గాట్లలోంచి పాలు వస్తాయి. ఆ పాలతో కర్పూరం తయారవుతుంది. కర్పూరం చెట్టు వంద అడుగుల వరకూ పెరిగే సుందరమైన నిత్య హరిత వృక్షం. చక్కని సువాసన వెదజల్లుతుంది. ఆకులు పొడవుగా ఉండి ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాలతాయి. పువ్వులు చిన్నవిగా ఉంటాయి. పండ్లు ముదురు ఆకు పచ్చని రంగులో ఉండి అక్టోబర్‌లో పక్వానికి వస్తాయి. ఈ చెట్లు చైనా, జపాన్ దేశాల్లో విస్తారంగా పెరుగుతాయి. మన దేశంలో దీనిని నీలగిరి కొండల్లో పెంచుతారు. అలాగే మైసూర్‌లోనూ, మలబార్ ప్రాంతంలోనూ కర్పూరం చెట్లు కనిపిస్తాయి.

Bhimseni camphor

 

కర్పూరం చాలా రకాలుగా ఉంటాయి. ఒక్కో రకం ఒక్కో విధంగా మనకి ఉపయోగపడుతుంది.

పచ్చ కర్పూరం: కర్పూరం చెట్టు వేర్లు, మాను, కొమ్మలను నీళ్లలో వేసి మరిగించి, డిస్టిలేషన్ పద్ధతిలో సేకరించే కర్పూరాన్ని పచ్చకర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడుకోవచ్చు. దీనిని ఎక్కువగా వంటలలో వాడతారు. కాటుకని ఈ పచ్చ కర్పూరంతోనే చేస్తారు. అంజనం వేయడానికి కూడా దీనినే వాడతారు.
హారతి కర్పూరం: టర్‌పెన్‌టైన్ నుంచి రసాయనిక ప్రక్రియ ద్వారా తయారుచేసే కృత్రిమ కర్పూరాన్ని హారతి కర్పూరం అంటారు. దీనిని ఔషధ ప్రయోగాలకు వాడకూడదు.
రస కర్పూరం: చిన్న పిల్లలకి ఒంట్లో ఉన్న దోషాలు పోవడానికి ఆముదంతో కలిపి కర్పూరం పట్టిస్తారు. దానిని రస కర్పూరం అంటారు.
భీమసేని కర్పూరం: సహజముగా మొక్క నించి తయారుగా లభించే కర్పూరాన్ని భీమసేని కర్పూరం లేదా అపక్వ కర్పూరం అంటారు. దీనిని ఔషధ ఉపయోగాల కోసం విరివిగా వాడుతూ ఉంటారు.
సితాభ్ర కర్పూరం: ఇది తెల్లని మేఘం లాగా కనిపిస్తుంది కనుక దీనికి ఆ పేరు వచ్చింది.
హిమవాలుక కర్పూరం: ఇది మంచులాంటి రేణువులు కలిగి ఉంటుంది.
ఘనసార కర్పూరం: ఇది మేఘంలాంటి సారం కలిగినది.
హిమ కర్పూరం: ఇది మంచులాగా చల్లగా ఉంటుంది.

ఇవే కాక ఉదయ భాస్కరము, కమ్మ కర్పూరము, ఘటికము, తురు దాహము, హిక్కరి, పోతాశ్రయము, పోతాశము, తారాభ్రము, తుహినము, రాత్రి కరము, విధువు, ముక్తాఫలము, రస కేసరము, ప్రాలేయాంశువు, చంద్ర నామము, గంబూరము, భూతికము, లోక తుషారము, శుభ్ర కరము, సోమ సంజ్ఞ, వర్ణ కర్పూరం, శంకరావాస కర్పూరం, చీనా కర్పూరం అని చాలా రకాల కర్పూరాలు ఉన్నాయి. కర్పూరం వలన అసంఖ్యాకమైన ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయి. ఆయుర్వేద చికిత్సలో కర్పూరాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. అసలు కర్పూర సువాసన పీలిస్తే అనేక శారీరక రుగ్మతలన్నీ పోయినట్లు, సేద తీరినట్లు ఉంటుంది. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కర్పూరం వల్ల అనేక ఆరోగ్య కరమైన ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంటుంటారు.

భీమసేని కర్పూరం వల్ల ప్రధానంగా అయిదు ప్రయోజనాలు ఉన్నాయి. పర్యావరణాన్ని శుద్ది చేస్తుంది. బీమసేని కర్పూరం యాంటీ ఫంగల్ మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. దీన్ని కాల్చినప్పుడు బాక్టీరియా, సుక్ష్మక్రిములను చంపే టాక్సిన్స్ ను విడుదల చేస్తుంది.  భీమసేన కర్పూరం యొక్క సువాసన మానసిక స్థితిని పెంచుతుంది. నెగటివ్ ఎనర్జీని పొగొడుతుంది. అదే విధంగా భీమసేని కర్పూరం యోక్క సువానస మీ ఇంటిని దోమలు, ఈగలు వంటి కీటకాలు లేకుండా చేస్తుంది.  అంతే కాకుండా జలుబు మరియు దగ్గు చికిత్సలోనూ భీమసేని కర్పూరం ఉపయోపడుతుంది. పురాతన కాలం నుండి భీమసేన కర్పూరాన్ని వివిధ వ్యాదుల చికిత్సకు ఉపయోగిస్తున్నారు. జలుబు లేదా దగ్గు ఉన్నప్పుడు ఒక చిన్న ముక్కను వేడి నీటిలో వేసి ఆవిరి పీల్పడం ద్వారా దాని నుండి ఉపశమనం కల్గుతుంది. అంతే కాకుండా భీమసేని కర్పూరం గాలిని శుద్ధి చేస్తుంది.

Video Viral: అభిమానం అంటే ఇది కదా..! అమిత్ షా షేర్ చేసిన వీడియో వైరల్


Share

Related posts

Daily Horoscope: ఏప్రిల్ 27 – వైశాఖమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

నవంబర్ 12 – కార్తీక మాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma

జూలై 12 – ఆషాడమాసం – రోజు వారి రాశి ఫలాలు

somaraju sharma