Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్తరంగా సాగుతోంది. హౌస్ లో వాతావరణం క్షణం క్షణానికి మారిపోతుంది. ఎవరూ కూడా ఆటని అంచనా వేయలేకపోతున్నారు. ఆ రీతిగా బిగ్ బాస్ ఇంటి సభ్యులకు టాస్క్ లు ఇస్తున్నారు. ఇదే సమయంలో చూసే ప్రేక్షకులకు హౌస్ లో సభ్యులకు ట్విస్టులు కూడా ఇస్తున్నారు. ఆల్రెడీ నాలుగో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన రతికకి మరో అవకాశం ఇచ్చి హౌస్ లో రియంట్రీ ఇప్పించడం జరిగింది. అయితే బయటకు భయంకరమైన నెగెటివిటీతో వెళ్లిపోయిన రతిక.. హౌస్ లోకి అడుగు పెట్టాక మళ్ళీ పాత గేమ్ మాదిరిగానే వ్యవహరిస్తూ ఉంది. వాస్తవానికి రీఎంట్రీ ఇచ్చే ముందు ఒక వీడియో పోస్ట్ చేసి ఈసారి ఏ అద్భుతంగా ఆడతానని పాత తప్పులు రిపీట్ చేయనని తెలిపింది.
కానీ హౌస్ లో పల్లవి ప్రశాంత్ తో గతంలో మాదిరిగానే వ్యవహరిస్తూ ఉంది. ప్రశాంత్ ఫీలింగ్స్ నీ రెచ్చగొట్టే విధంగా ప్రశ్నలు అడుగుతుంది. ఆల్రెడీ నేను అక్క అని అనేశాను మళ్లీ ఇలాంటి ప్రస్తావన తీసుకురావటం ఏమిటి అని ప్రశాంత్ చాలా గట్టిగా రతిక వ్యవహరిస్తున్న తీరుకు కౌంటర్ ఇచ్చాడు. అయినా గాని రతిక గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేయడం జరిగింది. నా గురించి ఎందుకు పాటలు పాడావ్ నాగార్జున ముందు ఎందుకు డాన్స్ వేసావ్ అంటూ ఏదో తనపై ప్రశాంత్ కి ఇంట్రెస్ట్ ఉన్నట్లు ప్రశ్నలు వేసింది నువ్వు నాకు అక్క లాంటివే అంటూ.. ప్రశాంత్ తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు.
ఒక ప్రశాంత్ తో మాత్రమే కాదు యావర్ తో కూడా రతిక ఈ రకంగానే గేమ్ ఆడుతూ ఉంది. గతంలో ఈ రకంగా గేమ్ ఆడితే మనుషుల ఫీలింగ్స్ తో ఆడుకోవద్దు అని నాగార్జున వార్నింగ్ ఇచ్చారు. అయినా గాని ఆ రకంగానే వాళ్ళని రెచ్చగొట్టి నెగెటివిటీ మూటగట్టుకుని.. నాలుగో వారమే హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ రీఎంట్రీలో కూడా రతిక పాత గేమ్ ఆడుతూ ఉండటం పట్ల ఆడియన్స్ ఈమే మారదు ఇంకా అని కామెంట్లు చేస్తున్నారు.