NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఐదో వారం బిగ్ బాస్ ఇంటి నుంచి వెళ్లేందుకు నామినేట్ అయిన సభ్యులు వీళ్లే..?

Share

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. నాలుగు వారాల ఆట చాలా దిగ్విజయంగా సాగింది. పవరస్త్రా కోసం ఇంటి సభ్యులకు బిగ్ బాస్ రకరకాల టాస్కులు పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కొంతమంది గెలుచుకోక మరి కొంతమంది గెలుచుకున్న గాని..పవరస్త్రా కోల్పోవడం మాత్రమే కాదు.. ఇమ్యూనిటీ కూడా కోల్పోవడం జరిగింది. స్టార్టింగ్ లో బిగ్ బాస్ హౌస్ లోకి 14 మంది సభ్యులు ఎంట్రీ ఇవ్వగా ప్రస్తుతం 10 మంది ఉన్నారు. ఈ పదిమందిలో పవరస్త్రా.. సందీప్, శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ సంపాదించుకోవడం జరిగింది.

These are the nominated members to leave the Bigg Boss house in the fifth week

ఈ పరిణామంతో ప్రస్తుతం హౌస్ లో ఐదో వారానికి నామినేషన్ ప్రక్రియ చాలా వెరైటీగా జరిగినట్లు సమాచారం. ఆల్రెడీ నాలుగో వారంలో గౌతం కృష్ణ పై బెల్టుతో వ్యవహరించిన తీరుకు టేస్టీ తేజ.. డైరెక్ట్ గా నామినేట్ కావడం తెలిసిందే. ఇక మిగతా సభ్యులు అమర్ దీప్, ప్రియాంక, ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్ కృష్ణ, శుభశ్రీ డైరెక్ట్ గా నామినేట్ కావటం జరిగిందట. ప్రియాంక, అమర్, శివాజీ లకు ఐదో వారంలో ఎక్కువ కత్తిపోట్లు పడ్డాయి. పవరస్త్రా గెలుచుకున్న సందీప్, శోభ, ప్రశాంత్ తప్ప మిగతా వాళ్ళందరూ నామినేట్ కావడం జరిగింది.

These are the nominated members to leave the Bigg Boss house in the fifth week

మరి ఐదో వారంలో ఎవరు హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారు అన్నది ఆసక్తికరంగా ఉంది. నాలుగో వారం రితిక ఎలిమినేట్ కావడం జరిగింది. ఆమె ఎలిమినేషన్ బిగ్ బాస్ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారు. మొదటి వారంలో టాప్ మోస్ట్ ప్లేయర్ గా పేరు సంపాదించుకుని తర్వాత తన స్వార్థం కోసం హౌస్ లో అందరి మధ్య గొడవ పెట్టడంతో రితిక చాలా నెగిటివిటీ సంపాదించుకుంది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ నీ టార్గెట్ చేసి ఆమె ఆడిన ఆట తీరు వ్యక్తిత్వ పరంగా కూడా ఆమెకు భారీ డ్యామేజ్ తీసుకొచ్చింది.


Share

Related posts

Krishna Mukunda Murari: అందరిని భవాని ముందు అడ్డంగా ఇరికించిన కృష్ణ.. రేపటి సూపర్ ట్విస్ట్..

bharani jella

విజయ్ దేవరకొండ కోసం “పోకిరి” ఫైట్ ప్లాన్ వేసిన పూరి జగన్నాథ్..??

sekhar

Liger: “లైగర్” ద్వారా జీవితంలో ఎంతో నేర్చుకున్నాను విజయ్ దేవరకొండ వైరల్ కామెంట్స్..!!

sekhar